national current affairs octomber లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
national current affairs octomber లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

national current affairs octomber 2022

 

అక్టోబర్  నేషనల్ కరెంట్ ఎఫైర్స్  2022

యూఏపీఏ ట్రిబ్యునల్ పీవోగా జస్టిస్ దినెస్ శర్మ

చట్ట వ్యతిరేక కార్య కలాపాల నిరోధక చట్టం (యూ ఏపీఏ) కి ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ అధికారి (పివో) గా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్ దినేశ్ కుమార్ శర్మ నియమితులయ్యారు.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ( పి.ఎస్.ఐ), దాని అనుబంధ సంస్థలపై నిషేదాన్ని ఈ ట్రిబ్యునల్ సమీక్షిస్తుంది.


పారిశ్రామిక దిగ్గజం రాకేష్ జుంజన్ వాలా కన్నుమూత.

పారిశ్రామిక దిగ్గజం రాకేష్ జుంజన్ వాలా  బిగ్ బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్ " కింగ్ ఆఫ్ బుల్ మార్కెట్" మరియు "ఇండియన్ వారెన్ బఫెట్ మరణించారు.


భారత ఆర్థిక వేత్త అభిజిత్ సెన్ మరణించారు.

భారత మాజీ ప్లానింగ్ కమిషన్ సభ్యుడు, ఆర్థికవేత్త అబిజిత్ సిన్  మరణించారు.

ఈయన పద్మ భూషణ్ అవార్డు గ్రహీత. 


భారత జావెలిన్ త్రో దిగ్గజం నీరజ్ చోప్రాకు డైమండ్ లీగ్ లో బంగారు పతకం

స్విజర్లాండ్ ఏది జరిగినా డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించారు.


మంగళయాన్  సేవలు పూర్తి :

ఇంధనం పూర్తి, బ్యాటరీడెడ్ తో మంగళయాన్ సేవలు పూర్తిగా నిలిచాయి.

2013 నవంబర్ PSLV C25 ద్వారా అంగారకుడి పైకి ప్రయోగించారు.

అంచనాలను మించి 8 సంవత్సరాల 8 రోజుల పాటుమంగళయాన్ సేవలు చేసింది. 

దాదాపుగా 8వేలకు పైగా ఫోటోలను పంపింది ,అప్పట్లో దీనికోసం ఇస్రో 450 కోట్లు ఖర్చు చేసింది .


ఆరవ ఇండియా మెబైల్ కాంగ్రెస్ 2022 : ఢీల్లీ

ఇండియా మెబైల్ కాంగ్రెస్ (IMC) ,ఆపియాలో అతి పెద్ద టెలికాం, మీడియా మరియు టెక్నాలజీ ఫోరమ్.ఢీల్లీ  ప్రగతి మైధాన్ లో Oct 1 నుండి 4 వరకు జరుగుతుంది.

ఇండియా మొబైల్ కాంగ్రెస్ ను డిపార్టుమెంట్ ఆఫ్ టెలి కమ్మునికేషన్స్ (DOT) మరియు సెల్యులర్ ఆపరేటర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియ నిరహిస్తున్నాయి.

భారతీఎయిర్ టెల్ యొక్క 5G, సేవలు అక్టోబర్ 1 నుండి దేశం యొక్క 8 నగరాలలో ప్రారంభం అవుతాయి.


విండ్ మ్యాన్ - తులసి తంతి మరణం.

 సుజ్ఞాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు పవన విద్యుత్ రంగ దిగ్గజం తులసీ తంతి మరణించారు.

విండ్ మ్యాన్ గా పేరున్న తులసి తంతి దేశ ఆర్థిక పురోగతికి తోడ్పడిన పారిశ్రామిక దిగ్గజాలలో ఒకరు.


ఆస్ట్రేలియా వేదికగా ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ.[ఐసీఐడి]

24 న ఇంటర్నేషనల్ కమిషన్ ఇన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ఐసీఐడి)

73 వ ఇంటర్నేషనల్ ఎగ్జికూటివ్ కౌన్సిల్ (ఐఈసి] ఆస్ట్రేలియా లోని అడి లైడ్ లో 3/అక్టోబర్ / 2022న ప్రారంభం అయ్యాయి.

ఆంధ్ర ప్రదేశ్ తరుపున ఈ కాంగ్రెస్ కు జలవనరుల శాఖ మంత్రి అంబంటి రా౦ బాబు నేతృత్వం లోని బృందం హాజరౌతుంది.

భారత్ వేదికగా 25వ ఐసిఐడి కాంగ్రెస్ 2023 లో  ఆంధ్ర ప్రదేశ్  విశాఖ పట్టణంలో నవంబర్ 6 నుంచి 13 వరకు నిర్వహించబడుతుంది.

ఈ సమావేశంలో 78 దేశాల ప్రతి నిధులు, శాస్త్రవేత్తలు పాల్గొంటారు.

జల భద్రత చేకూర్చడం, తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటలుసాగు చేసే అత్యాధునిక నీటి వినియోగ విధానాలను ఈ సమాఖ్య లో ప్రదర్శిస్తారు.


రైళ్ళ సమచారం తెలుసుకొనేందుకు ఆర్ టి.ఐ.ఎస్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తో కలిసి రైల్వే శాఖ ఆధునిక సమాచార వ్యవస్థ  “రియల్ టైమ్ ట్రైన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టం “ ను రూపొందించింది.

రైల్వే కంట్రోల్ ఆఫీస్ అప్లికేషన్ తో అనుసందానించి. రైళ్ళు సమచారాన్ని రైల్వేశాఖ తెలుసుకుంటుంది.

ప్రస్తుతం రైల్వే ఎలక్ట్రిక్ లో కో షెడ్ పరిదిలో 2,000 రైళ్ళ లో ఈ రియల్ టైమ్ ట్రైన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టం ను  ప్రవేశ పెట్టారు.

ఆర్. టి. ఐ.ఎస్ ను దేశంలో దూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్ళలో దశల వారిగా ప్రవేశ పెట్టనున్నారు


రోహన్ బోపన్న జోడీ టైటిల్ సాధించారు

భారత టెన్నిస్ సీనియర్ స్టార్ రోహన్ బోపన్న తన కెరీర్‌లో 22వ డబుల్స్ టైటిల్  అవీవ్ ఎటిపి -250 టోర్నీ టైటిల్ సాధించారు.


వైమానిక దళంలోకి ఆధునాతన తేలికపాటి హెలికాప్టర్ ప్రచండ

రాజస్తాన్ లోని జోథ్ పూర్ వైమానిక  స్థావరంలో 3 అక్టోబర్ 2022 న అధునాతన స్వదేశీ తేలికపాటి హెలికాప్టర్ ప్రచండ ను రక్షణ మంత్రి రాజ్ నాథ్, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహన్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సమక్షంలో 4  లైట్ కంబాట్ హెలికాప్టర్లను వైమానిక దళంలో ప్రవేశ పెట్టారు.


ప్రతికూల వాతావరణంలో, రాత్రి, పగలు శత్రువులపై దాడి చేయడం ప్రచండప్రత్యేకత. గగనతలం నుంచే ఛేదించగల క్షిపణులను, ట్యాంక్ విధ్యంసక మిసైళ్ళను, 20 ఎంఎం తుపాకులను అమర్చ వచ్చు.

నిమిషానికి 750 తూటాలను పేల్చగల  సామర్థ్యం వీటికి ఉంది.

పర్వత ప్రాంతాలలో శత్రుసైన్యం పై, బంకర్లు, ట్యాంక్ లు, డ్రోన్ లపై దాడి చేయగలవు.

తక్కువ శబ్దం చేస్తూ రాడార్ కు, ఇన్ ఫ్రారెడ్ సెన్సార్లకు చిక్కకుండా వెళ్ళ  గల సామర్థ్యం వీటి సొంతం.



పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా విజయ సాయి రెడ్డి


కేంద్ర రహదారులు, నౌకాయానం, పౌరవిమానయానం, పర్యాటక, సాంస్కృతిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మెన్ గా ఎంపీ విజయసాయి రెడ్డి నియమించబడ్డారు.

ఉపరాష్ట్రపతి జగ్దీష్ ధన్ ఖడ్ ఈ నియామక ప్రక్రియ జరిపారు. 


జర్మనీ, నార్వే అంబాసిడర్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి

కేంద్ర ప్రభుత్వం  నిర్వహిస్తున్నఅజాకా అమృత్ మహాత్సవ్ లో భాగంగా "అమృత్ సరోవర్” పథకంలో ఆంధ్ర ప్రదేశ్ 3 వ స్థానంలో నిలిచింది.

ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త నీటి చెరువుల తవ్వకం, పాత చెరువుల పునరుద్ధరణ, పునర్జీవం, వంటి కార్యక్రమాలను చేపట్టింది.

జర్మనీ, నార్వే అంబాసిడర్ల బృదం  ఈ కార్యక్రమాలను పరిశీలించడం తో పాటు, భూగర్భ జలాలను పెంచడంలో ప్రభుత్వం చేపట్టిన పతకాలను కూడా పరిశీలించనున్నారు.


జాతీయ క్రీడల్లో బ్యాడ్మింటన్ డబుల్స్ విజేతలు గా సిక్కిరెడ్డి - గాయత్రి 


చీతాల కోసం టాస్క్ ఫోర్స్

నవీబియం నుంచి తీసుకువచ్చి మధ్య ప్రదేశ్ లోని కునో అంతర్జాతీయ పార్కులో వదిలిన చీలాలకోసం కేంద్ర ప్రభుత్వం 9 మంది సభ్యులతో కూడిన టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది.

నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సహకారంతో ఈ తొమ్మిది మంది సభ్యుల బృందం పర్యవేక్షిస్తుంది. 

చీతాల ఆరోగ్య పరిస్థితి ,వేట కి సంబంధించిన వివరాలు వంటి విషయాలను గురించి టాస్క్ ఫోర్స్ 2 సంవత్సరాల వరకు పనిచేస్తుంది.

జాతీయ క్రీడల్లో తెలంగాణకు కాంస్యం:-

జాతీయ క్రీడలు మహిళ స్విమ్మింగ్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో వ్రిత్బి అగర్వాల్ కాంస్య పతకం కైవసం చేసుకుంది.

ఈమె తెలంగాణ నుండి ఈ విభాగంలో పాల్గొన్నది.


డిజిటల్ రూపాయిని ప్రవేశ పెట్టె యోచనలో ఆర్.బి.ఐ (ఈ - రూపి]


దేశ డిజిటల్ ఎకానమీ అభివృద్ధికి  ఆర్.బి.ఐ  డిజిటల్ రూపాయని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుక వస్తుంది.

డిజిటల్ రూపాయని పైలెట్ ప్రాతిపాదికన అందుబాటులో తెచ్చి దానిపై కాన్సెప్ట్ సమీక్షలను ఆర్.బి.ఐ నిర్వహిస్తుంది.

ఆర్.బి.ఐ డిజిటల్ రూపాయకి సంబంధించిన కాన్సెప్ట్ నోట్ ను 7/10/2022 న విడుదల చేసింది.

రిజర్వుబ్యాంక్ అధికారికంగా ప్రవేశపెట్టిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ [సిబిడిసి ] రెండు రకాలు.


1 )రిటైల్, 2)హోల్ సేల్ 

రిటైల్ సిబిడిసి : ప్రజలందరూ వినియోగించడానికి ఉద్దేశించిన కరెన్సి

హోల్ సేల్ సిబిడిసి : ప్రత్యేకంగా నిర్థిష్ట ఆర్థిక సంస్థల వినియోగం కోసం ఉంటుంది.

దీనివల్ల పేమెంట్ వ్యవస్థ సమర్ధ వంతంగా నిర్వహించబడుతుంది. మనీలాండరింగ్ ను నిరోధిస్తుంది.


అగ్రస్థానం - సెర్ప్ నివేదిక.

పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ పథకాలపై  ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపిదే అగ్రస్థానం అని

కోర్టుకు సర్వే నివేదించింది.


ఒంగోలు జాతి పునరుజ్జీవం కోసం దేశంలోనే  తొలిసారిగా పిండ మార్పిడి ప్రక్రియ (ఈటిటీ)

అంతరించి పోతున్న ఒంగోలు జాతిని రక్షించడం కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

దేశంలోనే తొలి సారిగా పిండ మార్పిడి 

ఎంబ్రియె ట్రాన్స్ ఫర్ టెక్నాలజీ )(ఈ టీటీ) ద్వారా ఈ జాతి పునరుత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది,

ఈ ప్రక్రియలో భాగంగా కృత్రిమ గర్భధారణ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ) ఐ.వీ.ఎఫ్ ద్వాపిండాలను ఉత్పత్తి చేసి వాటిని ఘనీభవింపజేసి నిల్వ చేస్తారు. తరువాత ఈ పిండాలను ఆవుల అద్దె గర్భాల్లో ప్రవేశ పెట్టి దూడలను అభివృద్ధి చేస్తారు.

ఈ ప్రక్రియను లాంఫాం ఐవీఎఫ్- ఈటీటీ ప్రయోగాల ద్వార అభివృద్ధి చేశారు.

ఇప్పటి వరకు 787 పిండాలను ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేశారు.


అక్టోబర్ - 2 నుండి 8 వతేదీ వరకు భారత్ వైల్డ్ లైఫ్ వీక్:

అక్టోబర్ -2 నుండి 8 వ తేదీ వరకు భారత్ వైల్డ్ లైఫ్ వీక్ ను నిర్వహిస్తుంది.


వైల్డ్ లైఫ్ గురించి మోదీ సంభాషణ

పారిశ్రామిక అభివృద్ధితో పర్యావరణానికి హాని కలుగుతుంది కాని సమగ్ర విధి విధానాలతో ఆర్థికాభివృద్ధి సాధిస్తూ పర్యావరణాన్ని కాపాడే విధానం ఎలాగో భారతదేశం చేసి ప్రపంచ దేశాలకు తెలియజెప్పిందని 

ఇందుకు ప్రతీకగా భారతదే 8 సంవత్సరాల లో 259 సంరక్షణ అభయారణ్యాలును గుర్తించి అభివృద్ధి చేసింది. పులుల సంఖ్యను రెట్టింపు చేసింది, ఎనుగులను, సిహాలను కాపాడుకుంటున్నామ ఆయన వివరించారు.


అక్టోబర్ -23న 2 జీఎస్ ఎల్ వీ మార్క్ -3 ప్రయోగం.

సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదిక నుంచి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, న్యూ స్పెస్ ఇండియా లిమిటెడ్, డిపార్టు మెంట్ ఆఫ్ స్పేస్ సంయుక్తంగా అక్టోబర్ 23 2022 న రాత్రి 12.02 గంటలకు జియో శాటిలైట్ లాంచింగ్

వెహికల్ ( జీఎస్ ఎల్వీ మార్క్ -3, ఎం-2) ఉపగ్రహం నౌకను ప్రయోగిస్తారు.

యునైటెడ్ కింగ్డం (యు.కే) కు చెందిన నెట్వర్క్ యాక్సెస్

అషోషియేషన్ లిమిటెడ్ (వన్ వెబ్ కంపెనీ) తో ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా, డిపార్టుమెంట్ ఆఫ్ స్పేస్ సంస్థలు ఈ ప్రయోగం కొరకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.


శివ నేనను రెండు పార్టీలుగా, గుర్తులు కేటయించిన ఎన్నికల సంగ౦

శివసేన షిండే వర్గం :- బాలాసా హెబంచి శివసేనగా గుర్తింపు,

రెండు కత్తులు, డాలు గుర్తు గా కేటాయింపు.

శివసిన ఉద్దవ్ వర్గం: శివసేనా - ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే గా

ఆ పార్టీకి కాగడా గుర్తును ఈసీ కేటాయించింది.

అయితే శివసేన గుర్తయిన విల్లు, బాణం గుర్తును ప్రస్తుతానికి

ఏ పార్టీకి కేటాయిం చలేమని ఎన్నికల సంగ౦ తెలిపింది


50వ సీజేఐ గా జస్టిస్ డీవై చంద్రచూడ్

50వ సీజేఐ గా డీవై చంద్రచూడ్ ను సిఫారసు చేసిన ప్రస్తుత  సీజేఐ యు.యు. లలిత్

ప్రస్తుత సీజేఐ జస్టిస్ యు. మే యు లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్న సందర్భంగా

 తదుపరి సీజేఐ గా జస్టిస్ చంద్రచూడ్ ను సిఫార్సు చేశారు.

నవంబర్ 9న జస్టిస్ చంద్ర చూడ్ సీజీ ఐ గా

ప్రయాణ స్వీకారం చేసి 2024 నవంబర్ 10 వరకు కొనసాగుతారు.

ప్రధాని పరిశీలన, రాష్ట్రపతి ఆమోదం తర్వాత జస్టిస్ చంద్ర చూడ్ ఈ పదవికి ఎన్నికై తారు.


అవినీతి పరుల నిరోధానికి 14400.

అవినీతి నిరోధానికి 14400.యాప్ ను ప్రభుత్వం తీసుకు వచ్చిన ఏసీబీ మొబైల్ యాప్ ను 14400

అవినీతి పరుల ను నిరోధించేందుకు సామాన్యుడి ఆస్త్రంగా మారింది.

పైలెట్ ప్రాజెక్టుగా 14400 ఇది విజయవంతం కావడంతో దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం ప్రవేశ పెట్టింది

అవినీతి పరులపై ఈ ఆప్ ద్వారా విడియోలు, ఆడియో క్లిప్పులతో సహా పిర్యాధులు,చేయవచ్చు



మనహక్కుల దూతగా, తొలి ఆసియా,తొలి భారతీయ, తొలి  దళిత మహిళ అశ్విని కె.పి.

ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ (యు.ఎన్.హెచ్.ఆ.సి)

తన ప్రత్యేక దూతగా  అశ్విని కె.పి ని నియమించింది.

ఈమె ఈ పదవి ? ఎన్నికైన (తొలి ఆసియా) తొలి భారతీయ, దళిత మహిళ. 

ఈ నియామకం కార్యకలాపాలను నమోదు చేయడం,జాతి వివక్ష, జాత్యహంకారం, దాని కార్యకలాపాలను నమోదు చేయడం,విదేశీయుల పట్ల ద్వేషం,

ఈ విషయాల పట్ల వివిధ దేశాలలో గల ధోరనుల గురించి స్వతంత్ర స్థాయిలో నివేదిస్తుంది.

అశ్విని కె.పి ప్రస్తుతం బెంగళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తుంది.


తమిళ నాడులో స్లెండర్ లోరిస్ సంరక్షణ కేంద్రం

తమిళ నాడులోని దిండిగుల్ జిల్లా కరూర్ లో స్లెండర్ లోరిస్ సంరక్షణ కేంద్రం ను ఏర్పాటు చేస్తుంది.

ఇది దేశం లోనే స్లెండర్ లోరిస్ కి సంబంధించి మొట్టమొదటి సంరక్షణ కేంద్రం.


ఆర్టీకే ల పరిశీలనకు ఇథియోపియా బృందం

గన్నవరం. ఇండి గ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్టీకె ఛానల్ కంకిపాడు, ఇంటి గ్రేటెడ్

అగ్రిల్యాబ్ సందర్శన ఆఫ్రికా ఇథియోపియా ప్రతినిధి బృందం వైఎస్సార్, రైతు భరోసా

కేంద్రాల విధి విధానాలను పరిశీలించేందుకు ఆ దేశ వ్యవసాయ శాఖ -మంత్రి డాక్టర్ మెలెస్ మెకోనెన్ యిమెర్ నేతృత్వం లోని పది మంది బృందం 12/22 అక్టోబర్ న రాష్ట్రంలో పర్యటించింది.



రోదసి లో లార్డ్ ఆఫ్ ద రింగ్స్ 

 జెమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా చిత్రీకరించిన చిత్రంలో రెండు నక్షత్రాలు ఒకదాని కొకటి దగ్గరగా చేరినప్పుడు వాటి వాయు ప్రవాహాల వల్ల ఏర్పడే అందరికి ధూళి వల్ల 17 వలయాలు కాంతి వంతంగా ఏర్పడుతున్నాయి.

ఈ నక్షత్రాలు భూమి నుండి 50 వేల కాంతి సంవత్సరాల దూరంలోఉన్నాయి. 

ఈ జంట తారలను వూల్ఫ్ - రామెట్ 140 గా వ్యవహరిస్తున్నారు.


తారల మరుభూమి గుర్తింపు.

వ్యోయోగాములు తొలిసారిగా పురాతన నక్షత్రాల తో కూడిన మరు భూమిని పాలపుంతలో ఒక మూలన గుర్తించారు.

లెక్కకు మిక్కిలి సంఖ్యలో మృత నక్షత్రాలు అక్కడున్నాయని ఇవి ఒక్కాక్కటిగా బ్లాక్ హోల్స్ కి మారుతున్నాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు

ఇవి మన పాలపుంత లోని ద్రవ్యరాశిలో మూడో వంతు ఇవి ఉన్నాయని శాస్త్ర వేత్తలు నిర్ధారించారు


దేశంలో నాలుగో వందే భారత రైలు ఉనా లో ప్రారంభం

హిమాచల్ ప్రదేశ్ లోనిఉనా లో దేశంలోని నాలుగో వందే భారత్ రైలును ప్రారంభించారు.


హిజాబ్ పై సుప్రీం భిన్న తీర్పులు :-

కర్ణాటక ఉడిపిలోని కాలేజీలో మొదలైన హిజాబ్ ధారణ వివాధం సుప్రీంకు చేరింది.

విద్యాలయాలలో హిజన్ ధారణనను మొదట ప్రభుత్వం నిషేదించింది.

కర్నాటక హైకోర్టు మార్చి 15న ఇస్లాం ప్రకారం ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని, విద్యా, సంస్థలలో ఉమ్మడి నిబంధనలను తప్పని సరిగా పాటించాలన్న ప్రభుత్వ జీవోను హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రుదురాజ్ అవస్థీ, జస్టిస్ కృష్ణా జస్టిన్ జేబున్నీసా ఎం వాజీ లతో కూడిన ధర్మాసనం బెంచ్ సమర్ధించింది.

ప్రభుత్వ నిర్ణయాన్ని ,ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు విద్యార్ధులు అపీల్ చేశారు.

సుప్రీం కోర్టు ది సభ్య బెంచ్ 13 / అక్టోబర్ 2022 న విన్నాభి ప్రాయం వ్యక్తం చేసింది.

ఇందులో ఒకరైన జస్టిస్ హేమంత్ గుప్తా కర్ణాటక హైకోర్చు తీర్పును సమర్తించి సవాలు చేస్తు వేసిన పిటీషన్ ను కోట్టి వేశారు.

మరొక న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధూలియా హైకోర్టు తీర్పును వ్యతిరేఖిస్తూ కొట్టివేశారు.

భిన్న తీర్పుల కారణంగా ఈ కేసు విచారణ కు విస్తృత రాజ్యాంగ ధర్మాసణం ఏర్పాటు చేయడం కోసం సీజేఐకి సిఫారస్సు చేయాలని బెంచికి  నేతృత్వం వహించిన జస్టిన్ హేమంత్ గుప్తా నిర్ణయించారు


ఏపీ మెడ్ టెక్ జోన్ నుంచి ఎం. ఆర్. ఐ పరికరాలు

ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్ వైద్య ఉపకరణాలు తయారీలో ప్రపంచంలోనే  ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుంది.

దేశంలోనే తొలిసారిగా ఎం ఆర్ ఐ కోసం అత్యున్నత పరికరాలను తయారుచేసింది.

ఇందులో భాగంగా అత్యుత్తమ ఫలితాలు పొందేందుకు , తక్కువ సమయంలో ఫలితాలను అందించేలా ఎం ఆర్ ఐ లో ఉపయోగించే సూపర్ కండక్టింగ్ మాగ్నెట్ ని రూపొందించింది.

మెడ్ టెక్ జోన్ నుంచి అభివృద్ధి చేసిన ఈ పరికరం దేశంలోనే తొలి సారిగా ఈ జోన్ నుంచే ఉత్పత్తి, పరీక్షలు, అభివృద్ధి చేశారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 1.5  టెస్లా ఎం.ఆర్ .ఐ కండక్టింగ్ మాగ్నెట్స్ ని వినియోగిస్తున్నారు. 

అయితే మెడ్ టెక్ జోన్ అభివృద్ధి చేసిన సూపర్ కండెక్టింగ్ మాగ్నెట్స్ వల్ల ఎం.ఆర్ .ఐ స్కానింగ్ కు సమయం తగ్గుతుంది అని శాస్త్ర వేత్తల బృందం  వివరించింది.


నోట్ల రద్దుపై పరిశీలన - సుప్రీంకోర్టు

2016 నోట్ల రద్దు నిర్ణ యాన్ని పరిశీలిస్తామని సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎస్.ఎ. నజీర్ సారధ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 12/ అక్టోబర్ / 2002 న పేర్కొంది.

దీనికి సంబంధించి కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.


నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై పూర్తి అఫిడవిట్ దాఖలు చేయవలసిందిగా కేంద్రానికి, రిజర్వుబ్యాంకు కి ధర్మాసనం సూచించింది.

విచారణ 9, నవంబర్ లో జరుగుతుంది.

ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయ సమీక్ష పరిమితులకు సంబంధించిన లక్ష్మణ రేఖ అవగాహన గురించి ధర్మాసనం ఈ వాదనలలో తెలిపింది.


గుజరాత్ ఆతిధ్యంగా ముగిసిన 36 వ జాతీయ క్రీడలు. 

గుజరాత్ ఆతిధ్యంగా ముగిసిన 36 వ జాతీయ క్రీడలు ,37 వ జాతీయ క్రీడలు 2023 సంవత్సరం గోవా అతిధ్యంలో జరుగుతాయి

సర్వీసెస్ స్పోర్స్ కంట్రోల్ బోర్టు జట్టుకు అత్యధిక పతకాలతో అగ్రస్థానం లో నిలిచింది.

36 వ  జాతీయ క్రీడలు 12-10-2022 న ముగిసాయి. 

28 రాష్ట్రాలకు చెందిన , 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 8000 లకు పైగా అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారు.

చివరిరోజు జాతీయ క్రీడలకు ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్కర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

గుజరాత్ ముఖ్య మంత్రి భూపేంద్ర భామ్ పటేల్, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, తదితరులు పాల్గోన్నారు.

మిగిలిన జాతీయ క్రీడలు గోవా వేదికగా జరగనున్నాయి.

 ఈ క్రీడలల్లో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రల్ బోర్డు (ఎస్.ఎస్ సీబీ) జట్టు 128 పతకాలతో అగ్రస్థానం లో నిలిచింది. ఇందులో 61 స్వర్ణాలు, 35 రజతాలు, 32 కాంస్యాలున్నాయి.

పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఇండోర్ స్టేడియంలో ముగింపు వేడుకలు జరిగాయి.

ఓవరాల్ చాంప్ సర్వీసెస్ స్పోర్స్ కంట్రోల్ బోర్టు జట్టు రాజా భళీంద్ర సింగ్ ట్రోఫీని

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అందజేశారు.

140 పతకాలతో రెండవస్థానంలో నిలిచిన మహారాష్ట్ర 39 స్వర్ణాలు, 38 రజతాలు, 63 కాంస్యాలతో మొర్లం 140 పథకాలన,, బెస్ట్ స్టేట్ ట్రాఫి దక్కించుకుంది.

సర్వీసెస్ నాలుగు సార్లు "రాజు భళీంద్ర సింగ్ ట్రఫి' ని దక్కించుకుంది.


పురుష విభాగం ఉత్తమ క్రీడాకారుడు: సజన్ ప్రకాస్

కేరళ స్విమ్మర్ సీజన్ ప్రకాష్ 5 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం మొత్తం 8 పతకాలతో ఉత్తమ క్రీడాకారుడుగా నిలిచారు.

గత జాతీయ క్రీడల్లోను (కేరళ 2015) సజన్ ప్రకాశ్ ఉత్తమ క్రీడా కారునిగా నిలిచారు.

మహిళా విభాగం ఉత్తమ క్రీడాకారిని : హషిక (14)

కర్ణాటకకు చెందిన 14 సంవత్సరాల స్విమ్మర్

స్విమ్మర్ హషిక 6 స్వర్ణాలు, 1 కా౦ష్యం మొత్తం 7 పతకాలతో ఉత్తమ క్రీడాకారిణిగా నిలిచారు.


చివరి రోజు తెలంగాణ బాక్సర్ ముసాముద్దీన్ సర్వీసెస్ తరుపున పసిడిని సచిన్ సివాబ్  (హర్యానా)పై  గెలిచి కైవసం చేసుకున్నారు..

36 వ జాతీయ క్రీడల లో తెలంగాణ 23 పతకాలతో 15వ స్థానం

తెలంగాణ 8 స్వర్ణాలు, 7 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పథకాలతో 15వ స్థానంలో నిలిచింది

2015 కేరళ జాతీయ క్రీడల్లో 33 పథకాలతో ( 8 స్వర్ణాలు,14 రజతాలు, 11 కాంస్యాలతో) గతంలో తెలంగాణ 12వ స్థానంలో నిలిచింది.



36 వ జాతీయ క్రీడల లో ఆంధ్ర ప్రదేశ్ 16 పథకాలతో 21వ స్థానంలో

ఆంధ్రప్రదేశ్ 2 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంష్యాల తో మొత్తం 16 పతకాలతో 21వ స్థానం లో నిలిచింది.

2015 కేరళ జాతీయ క్రీడల్లో 16 పతాకాల తో(6 సర్థార్థాలు, 3 రజతాలు, 7 కాంష్యాలు) గతంలో 18వ స్థానం లో నిలిచింది.


మూడు సంవత్సరాల నిషేధం లో డిస్కస్ త్రోయర్ కమల్ ప్రీత్ :-

భారత మహిళా డిస్కస్ త్రోయర్ కమల్ ప్రీత్ కౌర్ పై ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) మూడిళ్ళ నిషేధం విధించింది. 

నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్న కారణంగా ఇంటిగ్రిటీ యూనిట్ (ఏవియ) విచారల శిక్షను ఖరారు చేసింది. 

నాలుగు సంవత్సరాల నిషేదం ఉండగా  తీసుకున్నట్టు అంగీరించడంతో శిక్ష లో 1 ఒక సంవత్సరం మినహాయింపు లభించింది.


రెజ్లర్ సుశీల్ పై చార్జిషీట్ 

రెజ్లర్ సాగర్ ధనకర్ హత్యా కేస్ లో నిందితుడిగా ఉన్న సునీల్ పేరును ఢీల్లీ పోలీసులు చార్జిషీట్ లో చేర్చారు. 

రెజ్లర్ సుశీల్ 2 సార్లు ఒలంపిక్ పథక విజేత.


మయన్మార్ ఉద్యమ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ కి మరో ఆరు సంవత్సరాల శిక్ష

మయన్మార్ ఉద్యమ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ కి 6 సంవత్సరాల జైలు శిక్ష పడింది. దీంతో ఆమెకు మొత్తం 26 సంవత్సరాల శిక్ష పడింది.

సైనిక  పాలకులు ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన సూకీ ప్రభుత్వాన్ని 2021 లో హస్తగతం చేసుకొని ఆమెను, కీలక నేతలను జైలులో వేశారు.


అధానికి టెలికం లైసెన్స్

దేశీయ టెలికాం సర్వీసులకు సంబంధించి అధానీ డేటా నెట్వర్క్ కు ఏకీకృత లైసెన్సు (యుఎల్) లభించింది.

డేటా సెంటర్ల కోసం, తమ కస్టమర్ల కోసం రూపొందిస్తున్న సూపర్ యాప్ కోసం ఆదానీ డెటా నెట్ వర్స్క్ 5 జీ స్పెక్ట్రం వేలంలో 26 గిగా హెట్జ్ బ్యాండ్ లో 400 మెగా హెట్జ్ స్పెక్ట్రంను 20 సంవత్సరాలకు 212 కోట్లతో కొనుగోలు చేసింది.


లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ఎందుకు : A .P హైకోర్ట్


విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉన్న ప్పుడు ప్రవేటీకరణ ఎందుకని కేంద్రాన్ని హైకోర్ట్ ప్రశ్నించింది.


కేంద్రానికి హైకోర్టు ప్రశ్న స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉన్న సంస్థ ప్రవేటీకరన పై పున: పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.

నిర్వాసితులకు  స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాల కల్పన పై దాఖలైన వ్యాజ్యం లో

పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది.

ప్రవేటీకరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తు మాజీ IPS  అధికారి లక్ష్మీనారాయణ హైకోర్టు లో పిల్ దాఖలు చేశారు.

ఈ విషయం పైనే మరో వ్యక్తి సువర్ణ రాజు కూడా పిల్ దాఖలు చేశారు.


ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనిషియెటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్ పథకం(పియం.డెవ్.ఇన్ )


ఈశాన్య , రాష్ట్రాలు అభివృద్ధి కోసం : ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనిషియెటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్ ( పియం డెవ్ ఇన్ ) పథకం

"పియం డెవ్ ఇన్" పథకం : ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి కోసం 6,600 కోట్లతో ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్ మెంట్ ఇనిషియోటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం అంగీకరించింది. 

ఈ పథకం క్రింద 2022-23 నుండి 2025 - 26 దాకా ఈశాన్య రాష్ట్రాల్లో మౌళిక సదుపాయాలు, పరిశ్రమల అభివృద్ధి, "జీవన ఉపాధి” కి సంబంధించినప్రాజెక్టులు చేపడతారు. దీనిని పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం.


గుజరాత్ లోని దీన్ దయాల్ పోర్టు కంటైనర్ టెర్మినల్ అభివృద్ది


గుజరాత్ లోని దీన్ దయాల్ పోర్టులో కంటైనర్ టెర్మినల్ అభివృద్ధి ప్రతిపాదనకు కేబినెట్ 4, 243.63 కోట్లతో ఆమోదం తెలిపింది.


మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ చట్టంలో సవరణకు ఆమోదం


మల్టీ స్టేట్ కో - ఆపరేటివ్ సొసైటీస్ చట్టంలో సవరణలకు అంగీకారం తెలియజేసింది.

దీనివల్ల ఈ రంగ౦ లో పారదర్శక, ఎన్నికల వ్యవస్థలు సంస్కరణలు సాధ్యమైతాయని ప్రభుత్వం భావిస్తుంది.


రైల్వే కార్మికులకు బోనస్ కు ఆమోదం


2021-22 ఆర్థిక సంవత్సరానికి రైల్వేకార్మికులకు 78 రోజుల సమాన వేతనం బోనస్ గా ఇవ్వడం కోసం ప్రభుత్వం ఆమోదించింది.

నాన్-గెజిట్ ఉద్యోగులకు, కార్మికులకు ప్రొడక్టివిటీ లింక్ బోనస్ (PAR) కోసం నరేంద్ర మోడీ నాయకత్వం లోని కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.


ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు వన్ టైమ్ గ్రాంట్.


ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్,భారత్ పెట్రోలియం కార్పరేషన్ లిమిటెడ్, హిందుస్థానే పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే

గృహావసరాల ఎల్పీజి విక్రయం లో నష్ట పోతున్న కారణంగా వాటిని ఆదుకోవడానికి వన్ టైమ్ గ్రాంట్ కింద కేంద్రం రూ 29,000 కోట్లు కేటాయించింది.

2020- 22 మధ్య అంతర్జాతీయంగా ఎల్పీజీ ధర 300 శాతం పెరిగినా మనదేశంలో 72 శాతమే పెంచారు. అదనపు భారాన్ని చమురు సంస్థలే భరించాయి.


ఫేస్ బుక్ లో  అన్ ఫాలో  సమస్య.

సామాజిక మాద్యమం ఫేస్ బుక్ వినియోగదారుల ఫాలోవర్ల సంఖ్య పడి పోయింది,

మార్క్ జుకర్ బర్గ్, రచయిత్రి తస్లీమా నస్రీన్, ప్రముఖ పత్రికల అకౌట్లలో కూడా ఫాలోయర్ల సంఖ్య 12/11/22 న తగ్గాయి అయితే ఫేస్ బుక్ దీనిని పునరుద్ధించింది కాని

ఇందు గల కల కారణాలను ఫేస్ బుక్ సంస్థ తెలుపలేదు.


మోదీ హిమాచల్ పర్యటన:-


* హిమాచల్ ప్రదేశ్ ఉనాలో ఐఐఐటీ - ఉనా ని ప్రధాని ప్రారంభించారు.

* హిమాచల్ ప్రదేశ్ చంబాలో రెండు హైడ్రోపవర్ ప్రాజెక్టుల నిర్మాణం   ప్రారంభించారు.

* హిమాచల్ ప్రదేశ్ హారోలీలో బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ నిర్మాణానికి శ్రీకారం.


భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపి) వృద్ధి రేటుఐ.ఎం.ఎఫ్. రెండో సారి తగ్గింపు.


భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపి) వృద్ధి రేటు 2022-23 ఆర్థిక సంవత్సరం  6.8 శాతం గా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్) మరోసారి సవరించింది.

భారత్ వృద్ధి అంచనాలను ఐ.ఎం.ఎఫ్ సవరించి ప్రకటించడం ఇది రెండవసారి.

మొదట జనవరిలో 2022-23 వృద్ధి రేటు  అంచన 8.2 గా ప్రకటించింది.

జులై లో ఈ అంచన వృద్ధి రేటు  అంచన  సవరించి 7.4 శాతం కి తగ్గించింది.

ప్రస్తుతం దీనిని మరో సారి 6.88 గా సవరించింది.

ద్రవ్యోల్బణం, వడ్డీరేటు పెంపు,భౌగోళి ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల కారణంగా వృద్ధి రేటు అంచనా కంటే తగ్గుతూ వస్తుంది.

ప్రపంచ వృద్ధి రేటు 3.2 శాతానికిగా ఏ.ఎం.ఎఫ్ అంచనా వేసింది.


భారత్ లో 100% ఇథానాల్ తో నడిచే కారు ప్రారంభం


బ్యాటరీ, 100% ఇథానాల్ తో నడిచే కారును హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ ను ప్రారంభించిన -కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.

కాలుష్యాన్ని నివారించడం కోసం జపాన్ వాహన సంస్థ కలిసి ఈ వాహనాన్ని భారత్ లో ప్రారంభించారు.


ప్రపంచ ఛాంపియన్ షిప్ లో షూటింగ్ లో కాంష్యం

షూటింగ్ లో నామ్యకపూర్, విభూతి భాటియా, ఇషాసింగ్ (తెలంగాణ) లతో కూడిన జట్టు జర్మనీ తో గెలిచి కాంష్యం గెలుచుకుంది.


భూమిదీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది అంతరిక్ష  శాస్త్రవేత్తలు


భూమి దీర్ఘ వృత్తాకారంలో ఉంటుందని అంతరిక్ష శాస్త్రవేత్తలు  ప్రతి పాదిస్తున్నారు. 

ఈ ప్రతి పాదనకు భూకేంద్రం నుండి భూమధ్య రేఖ వద్ద ఉపరితలంకు గల దూరం, ధృవాలవద్ద భూకేంద్రం

నుండి ఉపరితలం కు గల దూరంలో గల వ్యత్యాసం బలం చేకూరుస్తుందని వారు  ప్రతిపాదిస్తున్నారు,

భూమి ఇంకా తన రూపాన్ని పునరుద్ధ రించు కుంటునే ఉందని భూమి యొక్క  భూ గురుత్వాఖర్షణ శక్తే భూమిని దీర్ఘ వృత్తాకారం లో మర్చుటకు కారణం అని, మరియు గతం లో అత్యంత ఎత్తుగల

పర్వతాలు, శిఖరాలు భూమి లోకి చొచ్చుకు పోతూ ఎత్తు తగ్గుతున్నాయని శాస్త్ర వేత్తలు

ప్రతిపాదిస్తున్నారు.


క్యాన్సర్ కు వ్యాక్సిన్ త్వరలో బయో ఎన్ టెక్.


బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ల తయారీ సంస్థ అధినేతలు ఉగుర్ సాహిన్, ప్రొఫెసర్ ఓజ్లేమ్ టురేసి 8 సంవత్సరాల

లోపు క్యాన్సర్ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ ను వాడుకలోకి తీసుకువస్తామని M- RNA సాంకేతికతో

ఈ వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్టు వారు వివరించారు.


పోలియో నివారణకు గేట్స్ ఫౌండేషన్ విరాళం.


పోలియో నివారణకు  ప్రపంచ వ్యాప్తంగా జరిగే నివారణ చర్యలకు గేట్స్ ఫౌండేషన్ (9.8 వేల కోట్లు)

[బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్] 1.2 బిలియన్ డాలర్ల ను విరాళంగా ప్రకటించింది.

ఆర్థికంగా వెనుకబడిన దేశాలకు, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ వంటి దేశాలలో పోలియో నివారకు ఈ మొత్తాన్ని

వెచ్చించాలని పౌండేషన్  నిర్ణయించినట్టు తెలుస్తుంది.


పియం. కిసాన్ సమ్మాన్ నిధుల మంజూరు.


 పియం కిసాన్ సమ్మన్ నిధి నుంచి 2 వ విడత నిధులు 16,000 కోట్లను రైతుల ఖాతాలోకి విడుదల చేశారు.


కిసాన్ సమృద్ధి కేంద్రాలు

 

పియం - సమృద్ది కేంద్రాలను నరేంద్ర మోది గారు ప్రారంభించారు.

ఒక దేశం - ఒకే ఎరువు" పథకం లో భారత్ బ్రాండ్ - లో రాయితీ యూరియా ను ప్రధాని నరేంద్ర  మోడీ

  ఆవిష్కరించారు


రైతులకూ బహుళ సేవలు కిసాన్ సంవృద్ధి కేంద్రంలో అందిస్తారు.

ఇవి వన్ షాప్ గా పని చేస్తాయి. 3.25 రిటైల్ ఎరువుల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మారుస్తా

వని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు.

ఎరువులు, నూనెల వంట నూనెల పై దిగుమతి భారం తగ్గించుకోవాలంటే ఎరువులు, వంట నూనెలపై

ఉత్పత్తిలో స్వయం సావలంభన సాధించాలని ఆయన ఈ సందర్భంగా ప్రతిపాదించారు


సాల్ట్ ప్రాజెక్టును ప్రశంశించిన. ప్రపంచబ్యాంకు


ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్

ట్రాన్స్ ఫర్మేషన్ (సాల్ట్) ప్రాజెక్టు అమలు, పుర గతిని ప్రపంచబ్యాంకు ప్రశంశించింది.


సాల్ట్ ప్రాజెక్ట్ లో భాగంగా 15 వేలకు పైగా పాఠశాలలో అభ్యాసన వాతావరణాన్ని మెరుగుపరిచింది. 

 అభ్యాసన, పరి వర్తన సహాయ పథకం (సాల్ట్) పాఠశాల విద్యలో

వివిధ అభివృద్దికి ప్రపంచ బ్యాంకు రుణ సహాయంతో పాఠశాలల నిర్మాణ అభివృద్ధి,నాడు - నేడు

ఉపాధ్యాయులలో బోధన నైపున్యాలు మొరుగు పరచడం,  విద్యార్థుల ప్రాక్టికల్ నాలెడ్జ్ ను

పెంపొందించడం వంటి కార్యక్రమాలు  ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధనను అభివృద్ధి

పరచడం ఈ పతకం యొక్క ముఖ్య ఉద్దేశం.

ఈ  పతకం 2021-2022 నుండి 2026-2027  విద్యా సంవత్సర౦ వరకు 

(IN Ter national Bank for Reconstruction & Development)ఆర్థిక సహాయం అంతర్జాతీయ పుననిర్మాణ

అభివృద్ధి బ్యాంకు. 250 మిలియన్ డాలర్లు (1860 కోట్ల రూపాయలు) అందిస్తుంది.


గోల్డెన్ కనరీ వజ్రం వేలం

గొల్డెన్ కనరీ వజ్రం ప్రపంచ అత్యంత స్వచ్చమైన  పెద్ద పసుపు రంగు వజ్రం దుబాయ్ లోని సోత్ బేస్

ప్రదర్శనలో ఉంటారు.

దీనిని న్యూయార్క్ లో వేలం వేయదలచారు.  

1980లో  కాంగో దేశం వజ్రాల గని సమీపంలో లభించినప్పుడు దీని బరువు 890 క్యారెట్లు ప్రస్తుతం

ఇది 303.10 క్యారెట్లుగా ఉంది.

డిసెంబర్ -7 న న్యూయార్కలో దీనిని వేలం వేస్తారు.


ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు పధకాలు.


ప్రపంచ షూటింగ్  ఛాంపియన్  షిప్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్

రైఫిల్ టీమ్ ఈవెంట్ లో ఇలవేనిల్, మెహులీ ఘోష్, మేఘనా

సజ్జనార్ లతో కూడిన జట్టు కాంస్యం కై వనం చేసుకుంది.

ఈ జట్టు జర్మనీ పై గెలిచి కాంస్యం సాధించింది.

జూనియర్ పురుషుల 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో

సమీర్ రజతం సాధించాడు.


సాన్ డియోగో ఓపెన్ టోర్నీ టైటిల్ విజేత: స్వీయాటెక్


అమెరికా వేదిక గా జరిగిన  సాన్ డియెగో ఓపెన్ టోర్నీలో మహిళల టెన్నిస్ ప్రపంచ నెంబర్ వన్ ఇగా

స్వియా టెక్ టైటిల్ సాధించింది.

 

ఫైనల్లో ఫోలాండ్ కు చెందిన సిరియుటిర్ డోనా వెబ్ (క్రోయేషియా) పై గెలిచి ఈటైటిల్ సొంత చేసుకుంది.

ఈ టోర్నీలో 470 ర్యాంకింగ్ పాయింట్లు ఈమె సాధించింది.


 ప్రపంచ నెంబర్ వన్ చెన్ ప్లెయర్ కార్ల్ సన్ ఓటమి

 ప్రపంచ నెంబర్ వేసెయల్  కార్ల్ సన్ ను చెన్నై కి చెందిన 16 సంవత్సరాల సుకేశ్ చేతిలో ఓడిపోయాడు.

కార్ల్ సన్ ను ఓడించిన అతి చిన్న వయస్కుడు గా సుకేశ్ రికార్డు సృష్టించాడు.

కార్ల్ సన్ భారత యువ గ్రాండ్  మాస్టర్ ఇరిగేళి అర్జున్ చేత కూడా ఓడిపోయాడు.

ఎయిమ్ చేస్ ఆన్లైన్ ర్యాపిడ్ అంతర్జాతీయ టోర్నీలో కార్ల్సన్ ఈ పరాజయం చవిచూశారు.


100 మీటర్ల హార్టిల్స్ లో జాతీయ రికార్డు నమోదు చేసిన జ్యోతి.


జాతీయ ఓపెన్ ఛాంపియన్ షిప్స్ మహిళల 100 మీటర్ల హార్టిల్స్ లో  ఆంధ్ర ప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యెర్రాజీ  12.82 సెకన్లు లో పూర్తి చేసి కొత్త జాతీయ రికార్డును సృష్టించింది.

ఈ టోర్నీలో ఈమె రైల్వే కు సారధ్యం వహిస్తుంది  ఛాంపియన్ షిప్ లో ఈమే స్వర్ణం కైవసం చేసుకుంది.

 

పియం- కిసాన్ సంవృద్ధి కేంద్రాలు.


పైలెట్ ప్రాజెక్ట్ గా గా అక్టోబర్ 17 న దేశ వ్యాప్తంగా 864 కేంద్రాలు ప్రారంభించారు.

ఆంధ్ర ప్రదేశ్ ఆర్బీకే ఇచ్చిన స్ఫూర్తితో నీతి ఆయోగ్, కేంద్ర బృందాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా

రైతులకు బహుళ ప్రయోజనాలు. అందించేందుకు గాను పియం కిసాన్ సంవృద్ధి కేంద్రాలు ప్రారంభించారు.

ఈ కేంద్రాలకు ఒకే డిజైన్,రంగులు ఉండేలా తీర్చిదిద్దుతుంది.

ఫైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 32కేంద్రాలనుప్రారంభిస్తారు.

 గ్రామస్థాయిలో 150 చ.అ విస్తీర్ణం, సబ్ డివిజన్ స్థాయిలో 200 చ.అ విస్తీర్ణం జిల్లా స్థాయిలో 2000 చ.అ

విస్తీర్ణంతో వీటి నిర్మాణం ఉంటుంది.

 

ఈ కేంద్రాలకు భూ సార పరీక్షలు, వ్యవసాయ మ్యాగజైన్లు, పంటసాగు ప్రణాళికలు, పంట మ్యాపులు,

సంక్షేమ

పథకాల వివరాల చార్టులు, స్కానింగ్ మిషన్లు, సాగు ప్రణాలికలు,వన్- నేషన్, వన్ ఫర్టిలైజర్ ఎరువుల

పంపిణీ వంటి వివిధ రైతు సంబంధ విషయాలు, ఏటీఎం లు,సోలార్ ప్యానట్లు హెల్ప్ డెస్క్ లు, కామన్

సర్వీసు సెంటర్లు అందుబాటు లో ఉంటాయి.

జీవ సేంద్రియ ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందులు, సూక్ష్మ పోషకాలు, వంటి వాటిని రైతు సరఫరా చేస్తారు. 


 ఆంధ్రప్రదేశ్ కు అరటి లీడర్ అవార్డు


ఆంధ్ర ప్రదేశ్ కు అరటి సాగులో మూడవ స్థానంలోను, ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉన్న ఈ తెలుగు

రాష్ట్రానికి అరటి లీడర్ అవార్డు వరించింది. 

ఇందులో పులి వెందుల, అనంతపురం క్లస్టర్లు అరటి ఎగురుతుల హబ్ గా నిలిచాయి.


స్థూల వృద్ది రేటు లో AP - ప్రథమ స్థానం


2021-22 లో ఏపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 11.43 శాతంగా ఉంది.

రెండవస్థానంలో, 11.06 వృద్ధి తో రాజస్థాన్,  తరువాత 11.0 4రేటుతో బీహార్ మూడవ స్థానం, తెలంగాణ

10. 88 తో నాలుగవ స్థానంలో ఉంది.


2022-23ఇయర్ఆఫ్ బనానా గా డాక్టర్ వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ౦

 

2022-23 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ బనానా గా డాక్టర్ వైఎస్ ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ౦ నిలిచింది.

ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ధృవీకరించారు.

పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం : అక్టోబర్ 21


టైగర్ ట్రయాంఫ్ విన్యాసాలు :

విశాఖ వేదికగా మూడు రోజుల పాటు  అక్టోబర్ 18- అక్టోబర్ 20 భారత్, అమెరికా,విపత్తు నిర్వహణ విన్నునాలు- టైగర్ ట్రయాంఫ్ విన్యాసాలు) జరిగాయి.

టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు (పులి విజయం మొట్ట మొదటి సారిగా అమెరికా, ఇండియా దళాలు 2019

నవంబర్ లో విశాఖ వేదికగానే నిర్వహించాయి.


 ఈ విన్యాసాలు ఇండో ఫసిఫిక్ తీర ప్రాంత బలోపేతానికి తోడ్పడం 

ఈ  విన్యాసంలో అమెరికా కి  చెందిన 500 మంది మెరైన్స్,సెయిలర్స్, ఎయిర్ మెన్ లు, భారత్ కి


సంబందించి ఆర్మీ, సెయిలర్స్ ఎయిర్ మెన్లు పాల్గొన్నారు


సమాజ సేవలో శివ్ నాడార్ మొదటి స్థానం 

ఎడెల్ గిల్ హూరన్ ఇండియా ఫిలాంత్రోఫీ లిస్ట్ -2022కి జాబితాలో రోజుకు 3కోట్లు. సంవత్సరానికి 1, 161 కోట్ల విరాళం తో మొదటి స్థానంలో శివానాడాల్ నిలిచారు.

గత 2 సంవత్సరాలలో అగ్రస్థానంలో ఉన్న విప్రో అజీమ్ ప్రేమ్ జీ  ఈ సంవత్సరం 484 కోట్లతో రెండవ స్థానంలో నిలిచారు.

 

దేశంలో రెండవ అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ రు 411 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నారు.

దేశంలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అధానీ 190 కోట్లతో 7వ స్థానంలో ఉన్నాడు.


బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా


విజయ వంతమైన “ అగ్ని ప్రైమ్ "  పరీక్ష

 ఒడిషా తీరం  అబ్దుల్ కలాం దీవిలోని మొబైల్ లాంచర్ నుంచి  ప్రయోగించిన క్లిపణి అగ్ని ప్రైమ్ పరీక్ష

విజయవంతమైంది.

21/10/2022 ఉదయం 9.45 గంటలకు ఈ పరీక్షలు ప్రారంభించారు.

1000 నుంచి 2000 కిలోమీటర్లు వెళ్ళ గలిగే ఘన ఇందనం కలిగిన మిస్సైల్ అగ్ని ప్రైమ్.

2021 డిసెంబర్ 18న కూడా అగ్ని ప్రైమ్ పరీక్షను చేపట్టారు

దేశీయంగా అభివృద్ధి చేసిన  కొత్త తర౦ మధ్య శ్రేణి బాలిస్టిక్ మిస్సైల్ అగ్ని ప్రైమ్ దీనిని డిఆర్ డివో అభివృద్ధి చేసింది దీనిని డిఆర్ డివో అభివృద్ధి చేసింది.


 సా౦కేంతికత కోసం డి. ఆర్. డివో, ఐ.ఐ.టి హైదరాబాద్ ఒప్పందం


దేశ రక్షణ రంగానికి అవసరమైన సా౦కేంతికత కోసం.డి. ఆర్. డివో, ఐ.ఐ.టి హైదరాబాద్ ఒప్పందం

కుదుర్చుకున్నాయి.

ఈ ఒప్పందంలో భాగంగా ఐ.ఐ.టి హైదరాబాద్ డీఆర్ డిఓ ఇండస్ట్రియల్ అకాడమి సెంటర్ ఆఫ్

ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు.చేసారు.


ఇందులో ప్రధానంగా ఏడు అంశాలపై పరిశోధనలు సాగుతాయి.

1) స్పేస్ అప్లికేషన్ టెక్నాలజి

2) హమింగ్ టెక్నాలజీ.

3 ఆడిటివ్ మ్యాన్ ఫాక్చరింగ్

4).క్షిపణులకు అవసరమైన ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్.

5) నానో ఆర్ని థోకో ఆఫ్టర్ టెక్నాలజీ.

6) రక్షణ రంగంలోని హైపర్ సోనిక్ విమానాలను అవసరమైన ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్

7) సీకర్


వంటి అంశాలపై పరిశోధనలు సాగుతాయి..


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు (ప్రోటోకాల్) గా రాఘవస్వామి

ఇప్పటి వరకు జాయింట్ రిజిస్టర్ గా పని చేస్తున్నా రాఘవస్వామిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు (ప్రోటోకాల్) గా నియమితులయ్యారు

రాఘవస్వామి పదోన్నతి ఉత్తర్వులను రిజిస్టార్ జనరల్ లక్ష్మణరావు విడుదల చేశారు.


ఇస్రో ఎల్వీ- ఎం3- ఎం2 ప్రయోగం విజయ వంతం.


సలీష్ థావన్ స్పేస్ సెంటర్ (ఎస్ డిఎసి) శ్రీహరికోట నుంచి ప్రయోగించిన

లాంచ్ వెహికల్ ఎం3-ఎం2 రాకెట్ ప్రయోగం విజయ వంతమైంది.

36 ఉపగ్రహాలను ప్రవేశ పెట్టి అంతరిక్ష వాణిజ్యాన్ని ఇస్రో ప్రారంభించింది.

 

ఈ రాకెట్ ను వాణిజ్యానికి వాడటం ఇదే ప్రథమం.

23 అక్టోబర్ రాత్రి 00 గంటల 7 నిమిషాల 40 సెకన్లకు (23 / అక్టోబర్ /2022 ఉదయం) స్పెస్ సెంటర్ రెండో

ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించారు.

ఒకే సారి  36 బ్రాడ్ బ్యాండ్ కమ్యునికేషన్ శాటిలైట్లని పోలార్ లోయర్ ఎర్త్ ఆర్బిట్ (ఎల్ ఈ ఓ) లో ప్రవేశ

పెట్టింది.

ఇస్రోకు చెందిన వాణిజ్యా విభాగం న్యూస్పెస్ ఇండియా తొలి వాణిజ్య ప్రాజెక్ట్ ఇది.

బ్రిటన్ కు చెందిన నెట్వర్క్ యాక్సస్ అపోసియెటెడ్ లిమిటెడ్,

భారతి ఎంటర్ ప్రెజెన్ భాగస్వాములుగా వన్ వెబ్ ఇండియా ఏర్పాటైంది.

వన్ వెబ్ లిమిటెడ్ అనేది వివిధ దేశాల ప్రభుత్వ, వ్యాపార సంస్థలకు అంతరిక్ష, ఇంటర్నెట్ సేవలు

అందిచే గ్లోబల్ కమ్యునికేషన్ నెట్ వర్క్ సంస్థ.


 ప్రయోగ వివరాలు

36 శాటిలైట్ల ను కక్షలోకి ప్రవేశపెట్టారు.

మొత్తం బరువు 5,796 కేజీలు.

 ఎక్కువ బరువు ను మోసుకెళ్ళిన భారతీయ తొలి రాకెట్ ప్రయోగం ఇది.

ఎల్ వీఎం 3ఎం2: తొలి వాణిజ్య రాకెట్ ప్రయోగం  

  

- ఈ రకం రాకెట్ తో లోయర్ ఎర్త్ ఆర్బిటాల్ లోకి ఉపగ్రహాలు పంపడం ఇదే ప్రథమం.

మార్చిన రాకెట్ పేరు

ఇప్పుడు పంపిన  రాకెట జిటివోకి పంపకుండా  ఎల్ఈవో లోకి పంపిన కారణంగా జీ ఎల్ ఎల్వీ - ఎంకే 3

గా ఉన్న రాకెట్ ను ఆధునీకరించి లాంచ్ వెహికల్ ఎం3 - ఎం2 గా నామకరణం

చేశారు.


జియోసింక్రోనస్ ట్రాన్స్ ఫర్ కక్ష్య (జీటీవో)  లోకి శాటిలైట్ పంపే రాకెట్ల నే  జీ ఎస్ ఎల్వీ గా పిలుస్తారు.

జియో సింక్రోనస్ ట్రాన్స్ ఫర్ కక్ష్య (జీటీఓ) లోకి 4,000కేజీలబరువును, ఎ ల్ ఈ ఓ లోకి దాదాపు

8000 కిలోల బరువును లాంచ్ వెహికల్ ఎం3. ఎం2 తీసుకెళ్ళగలదు.


18 లక్షల ప్రమిదలతో అయోధ్య

 దీపావలి దీపోత్స వంలో 18 లక్షల మట్టి ప్రమిదలను సరయు నది ఒడ్డున

రామ్ కి పైడి వద్ద 22 వేల మంది వాలంటీర్లతో  ప్రమిదలను వెలిగిస్తారు.

ఈ వేడుకకు ప్రధాని హాజరై రామాలయంలో పూజలు నిర్వహిస్తారు.


దక్షిణ భారత దేశంలో వందే భారత్ 5 వరైలు


 5వ వందే భారత్ ఎక్స్ ప్రెస్ దక్షిణ భారతదేశంలో ప్రారంభం అవుతుంది.

483 కిలోమీటర్ పొడవైన చెన్నై - బెంగళూరు మైసూర్ మార్గంలో

నవంబర్ 10న ఈ రైలు ప్రారంభం అవుతుంది.


శ్వాసతో నే కాన్సర్ ను గుర్తించే డిటెక్టర్ ను అభివృద్ధి చేసిన ఐఐటి రూర్కీ


శ్వాస ఆధారంగా  రొమ్ము కాన్సర్, ఊపిరితిత్తులు, నోటి కాన్సర్ ను గుర్తించే డిటెక్టరను ఐఐటి రూర్కీ శాస్త్ర

వేత్తలు అభివృద్ధి పరిచారు, కలరీ మెట్రి ద్వారా ఈ సాధనం పని చేస్తుంది,ఈ డివైస్ లో రంగు ఆధారంగా

వ్యాధిని నిర్ధారిస్తారు. గాఢత ఆధారంగా వివిధ రంగులు ఏర్పడతాయి.

ఈ సాధనాన్ని ప్రొఫెసర్ ఇంద్రాణి లాహిరి, ప్రొఫెసర్ పార్థా రాయ్, ప్రొఫెసర్ దిబ్రుపొ లాహిరి

రూపొందించారు.

డిటెక్టరను వాణిజ్య పరంగా అందుబాటులోకి తెచ్చేందుకు టాటా స్టీల్ తో ఐఐటి రూర్కీ ఒప్పందం

చేసుకుంది.

ఈ సాధనం తో కాన్సర్ ను తొలి దశ లోనే గుర్తించవచ్చు.


ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ శ్రీలంక రచయితకు.


2022 సంవత్సరానికి సంబంధించి ప్రతిష్టా తన బుకర్ ప్రైజ్ శ్రీలంక రచయిత షెహాన్ కరుణ తిలక కు

దక్కింది.


“ ది సెవెన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మీడియా ” రచనకు బుకర్ సాహిత్య పురస్కారం తో పాటు 50 వేల

పౌండ్లు బహుమతిగా గా అందుకున్నారు

17/10/2022 లండన్ బ్రిటన్ రాజు ఛార్లెస్ సతీమని కెమిల్లా ఈ బహుమతిని కరుణ తిలకకు

బహుకరించారు..

1992 తర్వాత శ్రీలంక జాతీయుడు ఈ బహుమతిని సాధించడం ఇది తాలిసారి


ఢిల్లీ వేదికగా 90వ ఇంటర్ పోల్ సదస్సు ప్రారంభం 

90 వ ఇంటర్ పోల్ సదస్సు ఢిల్లీ వేదికగా 18 / అక్టోబర్ /2022 న  ప్రధాని మోదీ ప్రారంభించారు

ఈ సదస్సుకు 195 దేశాల నుంచి హోం మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

పాకిస్తాన్ నుండి దేశ ఫెరల్ ఇన్వెస్టిగేషన్ ఎజెన్సీ (ఎస్.ఐ.ఎ) డైరెక్టర్ జనరల్ మొహసిన్ బట్ పాల్గొన్నారు.

ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా,

ఇంటర్ పోల్ అధ్యక్షులు అహ్మద్ నాజర్ అల్రైసి, సెక్రెటరి జనరల్ ఉర్గన్ స్టాక్ పాల్గొన్నారు.

ప్రధాని మోది సదస్సు లో ఉగ్రవాద చర్యలను మొత్తం



మానవత్వం పై దాడిగా పరిగణించి ప్రపంచం మొత్తం ప్రతి ఘటించాలని ఇప్పుడు ఉగ్రవాదం తీరు

మార్చి ఆన్లైన్ బాట కూడా పట్టిందని, ఉగ్రవాద౦ పై పోరాటంలో ఎంతో మంది వీరులను కోల్పోయమని

ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రెడ్ కార్నర్ నోటీసుల్లో వేగం పెరగాలి అని ఆయన కోరారు ప్రస్తుతం భారత్ నుంచి 780 రెడ్ కార్నర్

నోటీసులు ఉన్నాయి.

ఇందులో 205 సీబిఐ వాంటెడ్ నేరగాళ్ళు అని నేరగాళ్ళని ఇంటర్ పోల్ సభ్య దేశాల్లో అరెస్ట్

చేసేందుకు, వెనక్కు రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీస్ ఉపయోగపడుతుంది.

రెడ్ నోటిప్ భారత రెడ్ నోటీస్ లో అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం, అతని అనుచరుడు

చోటా షకీల్, ఉగ్రవాదులు హఫీజ్ సయిర్, మసూద్ అజర్ ఉన్నట్టు ప్రధాని తెలిపారు.

వీరితో పాటు ఆర్థిక నేరగాళ్ళయిన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి వారు ఉన్నారు.

దావుద్ పై మౌనం

భారత త విద్యాసం సృష్టించి పూరిత ఉన్న దావూద్, ఇతర ఉగ్రవాదుల భారత కు అప్పగింత పై పాకిస్తాన్

మౌనంగా ఉంది.


తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా తీర్మానం

ESA

ఐఐటీ వంటి విద్యా సంస్థల్లో బోధన మాధ్యమంగా హిందీని వాడాలన్న పార్ల మెంటరీ

కమిటి సిఫార్సును వ్యతిరేఖిస్తు తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేసింది.

రష్య- ఉక్రెయిన్ యుద్ధం :

రష్యా, ఆక్రమించిన ఖేర్సన్ ను ఉక్రేయిన్ పాక్షికంగా తమ

ఆధీనంలోకి తీసుకుంది.


జ్ఞానవాసి లింగాకృతి శిలకు కార్బన్ డేటింగ్ పిటిషన్ కొట్టివెత

కార్బన్ డేటింగ్ ప్రక్రియలలో శిల ధ్వంసం అయ్యే అవకాశం ఉన్నందున

జ్ఞానవాసి లింగాకృతి శిల కు కార్బని డేటింగ్ పిటిషన్ ను వారణాశి హైకోర్టు కొట్టి వేసింది.

తల్లి బిడ్డ ఆరోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమస్థానం


పిల్లలకు టీకాలు, గర్భిణీలకు చెకప్ లలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది.

కేంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన హెచ్.ఎం.ఐ.ఎస్ 2021-22 అనాలసిస్

రిపోర్టులో 13 అంశాలపై పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులు వెలువరిచారు

ఇమ్వునైజేషన్, గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వాసుపత్రులలో ప్రసవాలు వంటి అంశాలపై

పెద్ద రాష్ట్రాల జలితాతో ఆంధ్రప్రదేశ్ కు 1 వ ర్యాంకు సాధించగా తెలంగాణ 5, తమిళనాడుకు

11వ ర్యాంకు దక్కాయి.

గర్భిణులకు ప్రసవానికి ముందు నాలుగు ఏఎన్ సీ చెకప్ లు నిర్వహించడం లోను దేశంలోనే

నంబర్ 1 ర్యాంకు ఆంధ్రప్రదేశ్ కు

తరువాతి స్థానాలు వరుసగా కేరళ, మహారాష్ట్ర,తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి.

ఈ జాబితలో తెలంగాకు 13 వ  స్థానం దక్కింది.

ఆరోగ్య సేవకు సంబంధించి అన్ని  అంశాలపై పెద్ద రాష్ట్రాల జాబితాలో AP కి రెండవ స్థానం దక్కింది.

బెడ్ ఆక్యు పెన్సి రెండవ ర్యాంక్ శివరాంర్

గర్భిణులకు టెటానస్ టాక్సాయిడ్ ఇంజెక్షన్లు - రెండవ ర్యాంక్

ఇంటి దగ్గర డెలివరి స్కిల్ బర్త్ అటెండెంట్స్ - 3 వ ర్యాంక్ ఇనిస్టిట్యూషన్ డెలివరి 6 వ ర్యాంక్ 

బ్రిటన్ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి 

బ్రిటన్ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషిసునాక్ ఎన్నికయ్యారు.

ప్రధానిగా ఎన్నికైన తొలి శ్వేతేతరుడు, తొలి భారత సంతతి వ్యక్తి

బ్రిటన్ చరిత్రలో అతి చిన్న వయస్సులో ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి రిషిసునాక్


కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసిఐ) గూగుల్ కు జరిమానా

కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గూగుల్ కు వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు జరిమానా

విధించింది.

ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ విషయంలో అక్టోబర్ 20 న గూగుల్ కు

సీసిఐ 1,338 కోట్లు జరిమానా విధించింది.

ప్రస్తుతం ప్లే స్టోర్ విధానాలకు సంబంధించి అధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందన్న అభియోగాలపై

రు : 936 కోట్ల పెనాల్టి వేసింది.

భారతీయ మార్కెట్లో ఆన్లైన్ సెర్చ్ విషయంలో అసమంజస వ్యాపార

విధానాలు పాటిస్తోందంటు జరిమానా వేసింది

2018 ఫిబ్రవరి లో కూడా సీసిఐ గూగుల్ కు 136 కోట్లు జరిమానా విధించింది.


పి.వి సింధు ప్రపంచ 5వ ర్యాంక్

ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీ డబ్లూ ఎఫ్ ) ర్యాంకింగ్ లో పి.వి సింధు టాప్ - 5 వ ర్యాంక్ లో ఉంది.

పురుషుల సింగిల్స్ లో H.S ప్రణయ్ 12 వర్యాంక్, లక్ష్మిసెన్ 8వర్యాంక్, కిడాంబి శ్రీకాంత్ 11 వ స్థానంలో ఉన్నారు.

పురుషుల డబుల్‌లో సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడి 8 వ ర్యాంక్

లో ఉన్నారు.

యుఎస్ గ్రాండ్ ప్రి ఛాంప్ వెర్ స్టాపెన్

యు.ఎస్ గ్రాండ్ ప్రి లో ఫార్ములావన్ రెడ్ బుల్ డ్రైవర్ ముక్స్ వెర్ స్టాపెల్ మొదటి స్థానంలో నిలిచి టైటిల్

సాధించారు.

నాసా లోప్టిడ్ ప్రయెగం నవంబర్ - 1 న

అంగారక గ్రహం పై క్షేమంగా దిగడానికి వీలుగా నాసా లోప్టిడ్ ప్రయోగాన్ని నవంబర్ 1 న చేయదలచింది, ఫ్లయింగ్ సాసర్ వంటి భారీ హీట్ షీల్డ్ ను అంతరిక్షంలోకి ప్రయోగించిస్తారు.

దీనికి లో ఎర్త్ ఆర్బిట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ యవ్ ఇన్ఫ్లాటబుల్ డిసీలర్టర్ లోప్టిడ్ గా నామకరణం చేసింది.


హీట్ షీట్ ను లో-ఎర్త్ ఆర్బిటాల్ “అట్లాస్ - వి”ద్వారా ప్రయోగిస్తారు

భవిష్యత్ లో మార్స్ ఉపరితలం పై దిగేటప్పుడు అంతరిక్షనౌక వేగాన్ని తగ్గించి క్షేమంగా మార్స్ ఉపరితల౦ చేరడానికి ఉపయోగ పడుతుంది.

ప్రపంచ షూటింగ్ ఛాండియన్ షిప్

విశాఖ మెడ్ టెక్ జోన్ కేంద్రంలో టెలి రేడియలజీ సొల్యూషన్స్

విశాఖ మెడ్ టెక్ జోన్ కేంద్రంలో టెలి రేడియలజీ సొల్యూషన్స్" ను ప్రారంభించారు.

దేశ వ్యాప్తంగా ఆస్పత్రులు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలకు టెలి

రేడియాలజీ సేవలు అందిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఐరాసాలో భారతకు వ్యతిరేఖంగా చైనా

ఐక్యరాజ్యసమితి లో భారత్, అమెరికా సంయుక్తంగా పాకిస్తాన్ కు

చెందిన లష్కర్ నేత షహిర్ మహమ్మద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని చేసిన

ప్రతిపాదనను చైనా అడ్డుకుంది. నాలుగు నెలల్లో ఈ విధంగా అడ్డుకోవడం ఇది నాలుగవ సారి

కాంగ్రెస్ అధ్యక్షుడిగా మలికార్జున ఖార్గే

శశి థరూపై 84% ఓట్ల మెజారిటిలో కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కు రెడ్ క్రాస్ గోల్డ్  మెడల్.

రెడ్ క్రాస్ గోల్డ్ మెడల్ ను పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు బహుకరించింది.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐ ఆర్ సీఎస్) అధ్యక్షుడు విశ్వభూషన్ హరి చందన్

అవార్డును పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కు ప్రధానం చేశారు. 


విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ

446 కోట్లతో విశాఖ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన జరిగింది.


బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా 

బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామ చేశారు. ఎన్నికైనా 45 రోజుల అత్యల్ప కాలంలో ఈమె

రాజీనామ చేశారు.

ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఎన్నికయ్యే అవకాశం ఉంది.

 ఆర్థిక సవాళ్ళ దృష్యా లిజ్ట్రస్ రాజీనామా చేశారు.

దామోదరం సంజీవయ్య సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో మూడవ యూనిట్ ప్రారంభం 

ఆంధ్ర ప్రదేశ్ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లోని  శ్రీ దామోదరం సంజీవయ్య ధర్మల్

పవర్ స్టేషన్ (ఎస్ డీఎస్ టీపిఎస్ ) లో గల మొత్తం నాలుగు యూనిట్ల కు గాను ఇప్పటికే · స్టేజ్ -1 లో 800 మెగావాట్ల

సామర్థ్యంగల రెండు యూనిట్లు ప్రారంభం అవగా స్టేజ్ - 2 లోని 800 యూనిట్ల సామర్థ్యంగల మూడవ

యూనిట్ ను 5,082 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టారు.

"శౌర్య దివాస్" అక్టోబర్ -27

1947 అక్టోబర్ 27 న భారతసైన్యం ( 1 సిక్కు రెజిమెంట్ ) మొదటి సారిగా శ్రీనగర్ విమానాశ్రయంలో

భారత సైనికులు పాకిస్తాన్ సైనికులను కశ్మీర్ నుంచి తరిమి కొట్టడానికి దిగిన సందర్భంగా ప్రతి

సంవత్సరం అక్టోబర్ -27 ను “శౌర్య దివాస్ " గా జరుపుకుంటున్నాం.


ఉక్రెయిన్ పై అణ్యాయుధాలు ప్రయోగిచం: పుతిన్

 రష్యా,ఉక్రెయిన్ పై యుద్దం లో అణ్యాయుధాలు ప్రయోగించరని పుతిన్ ప్రకటించారు.

రాజకీయపరంగా,సైనిక పరంగా  రష్యాకు అణ్యాయుధాలు ప్రయోగిచే అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

గాట్విక్ పక్షి : ప్రపంచ రికార్డు

 ఐదు నెలల గాట్విక్ పక్షి ప్రపంచ రికార్డును నమోదు చేసింది.

11 రోజులలో 13,558.72 కిలో మీటర్లు ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించింది.

అమెరికా- అలస్కా నుంచి ఆస్ట్రేలియా - ఈశాన్య టాస్మానియా ద్వీపం లోని అన్సాన్స్ బే వరకు ఎక్కడా

ఆగకుండగ ప్రయాణించి మిగతా పక్షుల కంటే ఎక్కువ దూరం ప్రయాణించింది.

గాట్ విక్ పక్షి శాస్త్రీయ నామం లిసా ల్యాపోనికా. 5G శాటిలైట్ ట్యాగ్ ద్వారా ఈ పక్షులను ట్రాక్ చేశారు.

(234684) I.D NUMBER గల ఈ పక్షి 2021 ఇప్పటి వరకు 4 BBRW ( 13,050 కిల్ మీటర్ల) రికార్డును

బద్దలు కొట్టింది.

వరల్డ్ బ్రెయిన్ స్టోక్ డే అక్టోబర్ - 29

 ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O). బ్రెయిన్ స్టోక్ పై అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం

అక్టోబర్ - 29 న వరల్డ్ బ్రెయిన్ స్టోక్ డే గా నిర్వ హిస్తున్నారు.

కరాచీ - పెషా వర్ రైలు మార్గం ని నిర్మిస్తున్నా చైనా.

 చైనా 10 బిలియన్ డాలర్లతో పాకిస్తాన్ లోని కరాచీ, పెషావర్ నగరాలను కలుపుతూ రైలు మార్గంను

నిర్మించ బోతుంది.

ఇరు దేశాలు దీనికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్  (సీపెక్) లో ఈ రైలు మార్గం ముఖ్యమైనది.

జిన్ పిగ్ ప్రకటించిన బెల్ట్ అండ్ ఇనీషియేటివ్ లో సీపెక్" ఒక భాగం.

ఫిట్ ఫర్ 55 - ప్యాకేజీ

 ఫిట్ ఫర్ 55 ప్యాకేజీ లో భాగంగా 2030 నుంచి పెట్రోల్, డీజిల్ కార్లు, వ్యాన్ల తయరీపై నిషేదం విధించాలని

యూరోపియన్ యూనియన్ భావిస్తుంది.

యూరోపియన్ యూనియన్ 2030 నాటికి వాహనాల హరిత వాయువుల ఉద్గారం 55% శాతానికి తగ్గించి

2035 నాటికి వంద శాతం  లక్ష్యాన్ని చేరుకోవాలని మరియు 2050 నాటికి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్

వాహనాలను ఉత్ఫత్తి చేయాలనియూరోపియన్ యూనియన్ భావిస్తుంది. అయితే దీనికి ఈయు పార్లమెంట్, సభ్యదేశాలు ఆమోదం తెలపాలి.

 గుజరాత్ లో, ముచ్చునది వంతెన పై ఘటన

గుజరాత్ యోర్బీ జిల్లాలోని యోర్బీ పట్టనం లోని మచ్చు నది పై కేబుల్ బ్రిడ్జి తెగడంతో 91

మంది మృతి చెందారు.

140 సంవత్సరాల బ్రిడ్జి ని ఇటీవల మరమత్తులు చేసి పునః ప్రారంభించిన 4రోజులలో ఈ బ్రిడి కూలి

పోయింది.


దేశంలోనే తొలి డార్క్ స్కై రిజర్వు : లద్దాక్ సమీపంలోని హాన్డేలో

 హాన్డేలో గల ఇండియన్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ(ఎఏడి) బేస్ క్యాంప్ లో అంతరిక్ష టూరిజం

ప్రోత్సహించడం కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, లద్ధాక్ అటానమస్ హిల్ డెవలప్

మెంట్ కౌన్సిల్ (ఎల్ ఏ హెచ్ డీసీ), కేంద్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా దేశంలోనే తొలి  డార్క్ స్కై రిజర్వును రూపొందించారు.

అక్టోబర్ 21 న వర్చువల్ విధానంలో లెఫ్టినెంట్ గవర్నర్ రాధా కృష్ణ ముధుర దీనిని ప్రారుభించారు.

ఈ ప్రాంత గ్రామాలకి చెందిన 24 మంది అంతరిక్ష రాయబారులను ఎంపిక చేసి వారి సహాకారంతో 8 అంగుళాల డోబ్సానియన్ టెలిస్కోపుల ద్వారా పర్యాటకులు

అంతరిక్షాన్ని వీక్షించే ఏర్పాట్లు చేశారు.

లద్దాక్ నుండి 300కిలోమీటర్ల దూరంలో చాంగ్ తాంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిసర ప్రాంతం

లోని ఐదు గ్రాముల పరివాహకం హన్టే ప్రాంతం.

 

దేశ రక్షక భటులందరికి ఒకే యూనిఫాం

దేశ రక్షక భటులందరికి ఒకే దేశం - ఒకే యూనిఫాం భావన పై ఆలోచించాలని ప్రధాని మోడి రాష్ట

ప్రభుత్వాలకు సూచించారు

జన్యు మార్పిడి అవాలు ప్రమాదకరం : స్వదేశీ జాగరణ్ మంచ్.

జన్యు మార్పిడి అవాలు ప్రమాదకరం అని ఆర్.యస్.యస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్

కేంద్రానికి లేఖ రాసింది.

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం

 ఉత్తర కొరియ రెండు తక్కువ శ్రేణి బాలిస్టిక్ మిసైళ్ళను ప్రయోగించింది.

 ఇది అమెరికా హెచ్చరికలకు విరుద్దం అని అమెరికా మరొక సారి ఉత్తర కొరియను హెచ్చరించింది.

ఆదిత్య - ఎల్ -1 ప్రయోగం  తో సౌర గోళం పై అధ్యయనం,

సౌర గోళం పై అధ్యయనం సౌరగోళ వాతా వరణ పరిస్థితుల అధ్యయనానికి ఆదిత్య ఎల్-1

ను జనవరి 2025 న ప్రవేశపెట్టి అవకాశం ఉంది.

 పిఎస్ ఎల్వీ 56 ద్వారా ప్రయోగించే అవకాశం ఉన్నట్టు శాస్త్రవేత్తలు తెలియ జేశారు.

సౌర గోళం పై ఏర్పడే సౌర గాలులు, జ్యాలలు, రేణువులను గురించి అధ్యయనం కు ఆదిత్య ఎల్-1

సహకరిస్తుంది.

ఆదితం ఎల్-1 ఉప గ్రహాన్ని బెంగుళూరు లోని ప్రొఫెసర్ యూ ఆర్ రావు స్పేస్ సెంటర్

లోని శాస్రవేత్త సుబ్ర మణియన్ నేత్రుత్వం లో రూపుదిద్దు కుంటుంది.

డాక్టర్ కె. శంకర్ సుబ్రమణ్యన్ ఆస్ట్రోశాట్, చంద్రయాన్-1, చంద్రయాన్ - 2 మిషన్లలో పనిచేశారు.

ఆదిత్య ఎల్-1 ను ఈ విధంగా ప్రవేశ పెడతారు

ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని  పి ఎస్ ఎల్వీ సీ56 ద్వారా ఆదిత్య - ఎల్-1 ను ప్రయోగిస్తారు.

మొదట ఉపగ్రహాన్ని జియె ట్రాన్స్ ఫల్ ఆర్బిట్ లోకి ప్రవేశ పెట్టాక భూమికి 15 లక్షల కిలోమీటర్ల

దూరంలోని లాగ్రేంజియన్ బిందువు -1 లోకి ప౦పిస్తారు లాగ్రేంజియన్ బిందువు -1 లోకి

పంపడానికి 177 రోజులు పడుతుంది.

ఆదిత్య -ఎల్-1 నిర్మాణం 

 ఆదిత్య ఎల్ -1 బరువు 1,475 కిలోల బరువు వుంటుంది.

ఈ బరువులో పెలోడ్స్ బరువు 244 కిలోల మాత్రమే మిగిలిన

1231 కిలోల బరువు అందులో గల ద్రవ ఇంధనం కలిగి ఉంటుంది.

ఈ ఉపగ్రహంలో ఆరు  పేలోడ్స్ యాస్ పెక్స్, వెల్సి, సోలెక్స్, సూట్, హెలియోస్, పాపా లను అమర్చుతారు.

సూర్యగోళం

సూర్యునిలో పై భాగం కరోనా దానిలో దాదాపు పదిలక్షల డిగ్రీల కెల్విన్ వరకు, అంతర్భాగంలో

ఉష్ణోగ్రత ఆరువేల కలిస్ డిగ్రీల కెల్విన్ వరకు ఉంటుంది.

అయితే కొంత కాలంగా సౌరతుఫానులు, కరోణా ఉష్ణోగ్రత పెరిగిపోతుంది దీనికి గల కారణాన్ని తెలుసుకోవడంలో ఈప్రయోగం ఉపయోగపడుతుంది.

అప్పడా వైస్ ఛైర్మెన్ వడ్డి రఘురాం.


గుజరాత్ వేదికగా. ఇండియా అర్బన్ హౌసింగ్ కాంక్లేవ్.

ఇండియన్ అర్బన్ హౌసింగ్ కాంక్లేవ్ 2022 గుజరాత్ రాష్ట్రం  రాజ్ కోట్ లో 19 అక్టోబర్ 2022 న

ప్రారంభం అయింది,ఈ సదస్సును కేంద్ర మంత్రి హరదీప్ సింగ్ పూరి ప్రారం భించారు

 ఈ సదస్సు  కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ ఆధ్యర్యంలో 21 అక్టోబర్ వరకు నిర్వహించబడుతుంది.