జాతీయ క్రీడా పురస్కారాలు - 2022
ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు టెన్నిస్ స్టార్ : శరత్ కమల్ కు
దేశ అత్యున్నత క్రీడా పూరస్కారం "ధ్యాన్ చంద్ ఖేల్ రత్న" అవార్డును టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ ఆచంట శరత్ కామల్ అందుకున్నారు.
తమిళనాడుకు చెందిన అంచంట శరత్ కమల్ 2022 లో కామన్వెల్త్ గేమ్ లో పురుషుల సింగిల్స్, టీమ్, మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పధకాలు సాధించారు
5. కామన్వెల్త్ క్రీడల్లో మొత్తం 13 పఠకాలు సాధించారు.
శరత్ కమల్ 4 సార్లు బలంపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.
ఆసియా క్రీడల్లో 2 కాంష్యాలు, ఆసియా ఛాంపియన్ షిప్ లో 2 కాంష్యాలను శరత్ కమల్ సాధించారు.
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారి చేతుల మీదుగా శరత్ కమల్ ఈ అవార్డును అందుకున్నారు.
అర్జున అవార్డు - 2022
2022 సంవత్సరానికి గాను మొత్తం 25 మంది అర్జున అవార్డుకు ఎన్నికయ్యారు,
క్రీడాకారులు - ఆట - రాష్ట్రం
బాక్సర్ నిఖత్ జరీన్ - బ్యాక్సింగ్ - తెలంగాణ.
(ప్రపంచ ఛాంపియన్)
ఆకుల శ్రీజ -టేబుల్ టెన్నిస్ - తెలంగాణ.
హెచ్ఎస్ ప్రణయ్ - షట్లర్
లక్ష్మన్ - షట్లర్- ఉత్తరఖండ్
సీమా పూనియా -అథ్లెట్లు - హర్యాణా
అవినాశ్ సాబ్లే- అథ్లెట్లు - మహారాష్ట్ర
ఇలవెనిల్ - షూటర్ -
ప్రజ్ఞా నంద - చెస్ ప్లేయర్ - తమిళనాడు
ఎల్డోస్ పౌల్ - అథ్లెట్లు
అమిత్ పంగల్ - బాక్సింగ్ - హర్యాణా
భక్తి కులకర్ణి - చెస్ ప్లేయర్ - గోవా
దీప్ గ్రేస్ ఇక్కా- హాకీ - ఒడిస్సా
సుశీలా దేవి లిక్నాబాయ్ - జూడో - మణిపూర్
సాక్షి కుమారి- కబడ్డి
నయణ్ మోని సైకియ - Lawn Bowl - అస్సాం
సాగర్ కైలాష్ - మల్ల కంబ
వికాష్ థాకూర్ - వెయిట్ లిఫ్టింగ్ - హిమాచల్ ప్రదేశ్
అన్సుమాలిక్ - వ్రెస్టిలింగ్ - హర్యాణా
సరిత మోర్ - వ్రెస్టిలింగ్ - హర్యాణా
ప్రవీణ్ కుమార్ - Wushu - హర్యాణా
మనసి గ్రిష్ - బ్యాట్ మెంటన్ - గుజరాత్
చంద్ర జోషి - బ్యాట్ మెంటన్ - గుజరాత్
తరుణ్ దిలాన్ - బ్యాట్ మెంటన్ - హర్యాణా
స్వప్నిల్ సంజయ్ పాటిల్ - స్విమ్మింగ్ -
జయ రాత్ ఛాగన్ - బ్యాట్ మెంటన్ - తమిళనాడు
జర్లిన్ అనిక - బ్యాట్ మెంటన్ - తమిళనాడు
ఓం ప్రకాష్ మినర్వాల్ - షూటింగ్ - రాజస్థాన్.
ద్రోణాచార్య అవార్డు - 2022 : దినేశ్ లాడ్.
క్రికెటర్లకు అత్యుత్తమ శిక్షణను ఇచ్చినందుకు గాను ద్రోణాచార్య. 2022 అవార్డు దినేశ్ లాండ్ ను వరించింది. రోహిత్ శర్మ లాంటి అత్యుత్తమ క్రికెట్ ఆటగాడికి కూడా దినేశ్ లాడ్ శిక్షణను ఇచ్చారు.
రిజిస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా :- మాతృమరణాల నియంత్రన నివేదిక.
మాతృమరణాలను లక్షమందిని పరిగణ లోకి తీసుకుని, అత్యుత్తమంగా నియంత్రించిన విధానం ఆధారంగా రిజిష్టార్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదికను రూపొందించింది.
ఇందులో అతితక్కువ మంది మరణాలు, లక్షమందికి గాను 19 మంది మరణాలలో కేరళ మొదటిస్థానం, 33 మందితో మహారాష్ట్ర రెండవ స్థానం , 43 మందితో మూడవ స్థానంలో తెలంగాణ, 45 మందితో ఆంధ్రప్రదేశ్
నాలుగవ స్థానంలో నిలిచింది.
గత సంవత్సరం 80 కి పైగా మరణాలు ఉన్న మహారాష్ట్ర అనుహ్యంగా 33కి తగ్గించింది.
అత్యధికంగా 195 మంది మరణాలతో అస్సాం, 173 మరణాలతో మధ్య ప్రదేశ్, 167 మరణాలతో ఉత్తర ప్రదేశాలు చివరి మూడు స్థానాలలో నిలిచాయి.
వివిధ రాష్ట్రాలు మాతా మరణాలు.
కేరళ 19
మహారాష్ట్ర 33
తెలంగాణ 43
ఆంధ్రప్రదేశ్ 45
తమిళనాడు 54
గుజరాత్ 57
కర్ణాటక 69
బీహార్ 118
ఒడిశా 119
ఉత్తర ప్రదేశ్ 167
మధ్య ప్రదేశ్ =173
అస్సాం = 195
అత్యంత ఖరీదైన నగరాలు:- న్యూయార్క్, సింగపూర్.
లండన్ కు చెందిన ఎకానమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ (EIU] అత్యంత ఖరీదైన 172 నగరాల జాబితాను రూపొందించింది.
ఇందులో అత్యంత ఖరీదైన నగరాలు జాబితాలో మొదటి స్థానంలో న్యూయర్క్, సింగపూర్ నిలిచాయి.
లివింగ్ కాస్ట్ ను ఆధారం చేసుకుని నగరాల ఎకనామిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ ప్రపంచంలోనే ఖరీదైన నగరాల జాబితా ని రూపొందించాయి,
2021 తో పోల్చినప్పుడు ఈ నగరాలలో జీవన వ్యయం 8.4% పెరిగింది. ఆసియా దేశాలలో జీవన వ్యయం[లివింగ్ కాస్ట్] 4.5% పెరిగింది.
నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా, వైద్య చికిత్సలు వ్యయాలను అనుసరించి ఈ జాబితాను రూపొందించారు.
భారత్ లో ఖరీదైన నగరాలు.
మనదేశంలో బెంగుళూరు ఖరీదైనా నగరం కాగా ప్రపంచ వ్యాప్తంగా 161 వ స్థానంలో నిలిచింది.
చెన్నై (164), అహమ్మదాబాద్ (165) వ స్థానంలో నిలిచాయి.
ప్రపంచంలో 10 అత్యంత ఖరీదైన నగరాల జాబిత
1 .అమెరికా - న్యూయార్క్
1 .సింగపూర్ - సింగపూర్.
3 .ఇజ్రాయిల్ - టెల్ అవీవ్
4 .చైనా- హాంకాంగ్
4 . అమెరికా - లాస్ ఎంజెల్స్
6 .స్విట్జర్లాండ్ - జ్యూరిచ్
7 .స్విట్జర్లాండ్ - జెనీవా
8 .అమెరికా - శాన్ ఫ్రాన్సిస్కో
9 . ప్రాన్స్ - ప్యారిస్
10 .డెన్మార్క్ - కోపెన్ హాగెన్
10 . ఆస్ట్రేలియ - సిడ్నీ
ఇందులో మొదటి, నాలుగవ, పదవ స్థానాలను 2 నగరాలు పంచుకున్నాయి.
ప్రపంచ చౌక నగరాలు.
గరాలు ఈ జాబితాలో చిట్టచివరణ సిరియా రాజధాని డమాస్కస్
(172) వ స్థానంలోను, లిబియు దేశం (ట్రిపోలి 171 వ స్థానంత నిలిచాయి. ఇవి ఈ జాబితాలో ప్రపంచంలోకెల్ల చౌకైన నగరాలు.
భారతదేశం నగరాలు కూడా తక్కువ జీవన వ్యయం కలిగిన నగరాలుగా నిలిచాయి.
ఉభకాయనికి ప్రకటనలే కారణం ! ‘లోకల్ సర్కిల్స్ సర్వె’
లోకల్ సర్కిల్స్' సర్వె ఉభ కాయనికి ప్రకటలు కారణం అని 304 జిల్లాల్లో చేసిన లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడించింది,
ఈ సర్వే ప్రకటనల కారణంగా ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై పిల్లలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న కారణంగా ఇవి ఊభకాయం మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయని ఈ సర్వే ద్వారావెల్లడించింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయం తరలింపు.
కృష్ణ జిల్లా ఈడ్పుగల్లులో గల రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయాన్ని
గుంటూరు జిల్లా కుంచన పల్లికి తరలించారు.
5/12/2022 నుంచి కుంచన పల్లి కార్యాలయం నుండి కార్యకలాపాలు మొదలయ్యాయి.
భారతమాల పరియోజన ప్రాజెక్ట్ లో భాగంగా బెంగళూరు - విజయవాడ హైవే
భారత మాల ప్రాజెక్ట్ లో భాగంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు 19,200 కోట్ల అంచనా వ్యయంతో 342 కి.మీర్ల ఆరు వరుసల రోడ్డు మార్గాన్ని బెంగళూరు,విజయవాడ మధ్య నిర్మిస్తుంది.
ఇది ఆంధ్ర ప్రదేశ్ లో మొట్ట మొదటి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే ,జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (NHAI) ఆద్వర్యంలో 2025 వాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయదలచారు.
ఈ హైవే మార్గం బెంగళూరు నుండి కందికొండ (పుట్టపర్తి జిల్లా), పులివెందుల (వైఎస్సార్ జిల్లా) మల్లెపల్లి వంగపాడు (నెల్లూరు), అద్దంకి (ప్రకాశం జిల్లా ) తరువాత మేరమెట్ల దగ్గర జాతీయ రహదారి 16 కి అనుసంధానం అవుతుంది.
గతిశక్తి లో భాగంగా కడప - రేణి గుంట మధ్య ఎన్ హెచ్- 716
గతిశక్తి ప్రాజెక్టు లో భాగంగా రహదారి [N.H.716] ను నిర్మించాలని కేంద్ర రవాణా - జాతీయ రహదారుల అభివృద్ది శాఖ తెలిపింది.
షోలాపూర్- చెన్నై ఎకనామిక్ కారిడార్ లో భాగంగా ఈ రహదారిని నిర్మిస్తారు, 1,500 . 11 కోట్లతో 120 కిలోమీటర్ల వరకు NH-716 ను రూపొందిస్తారు.
ఇది నాలుగు వరుసల రోడ్డు మార్గం.
రాన్సమ్ వేర్ దాడి.
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) యొక్క ఢిల్లీలోని తమ
కార్యాలయ సర్వర్ల పై రాన్సమ్ వేర్ సైబర్ దాడి జరిగింది
ఈ దాడికి అధిక మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్టు సంస్థ తెలిపింది.
అత్యధిక డేటా చౌర్యం జరుగుతున్న దేశాలలో భారత్ 6వ స్థానం లో ఉంది.
భారతదేశ తొలి గోల్డ్ ఏటీఎం : హైదరాబాద్ బేగం పేటలో
గోల్డ్ సిక్కా కంపెనీ భారత దేశంలో తోలి గోల్డ్ ఏటీఎం ను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బేగంపేటలో ఏర్పాటు చేసింది.
బేగంపేటలోని అశోకా రఘుపతి ఛాంబర్స్ లోని గోల్డ్ సిక్కా సంస్థ కార్యాలయంలో ఈ గోల్డ్ ఎటీఎంను ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితా లక్ష్మా రెడ్డి ఈ గోల్స్ ఎటియం ను ప్రారంభించారు.
అజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా : లైవ్ ఫెరింగ్ సిస్టమ్
అజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భారత నావికాదళం ఆధునిక సాంకేతికతతో “లైవ్ ఫైరింగ్ సిస్టం”ను రూపొందించింది. ఈ నిట్టాను సెయిలర్స్ లో ఫైరింగ్ సికిల్సన్న పెంపొందించడంకోసం రూపొందించారు.
విశాఖా కేంద్రంగా తూర్పు నావికా దళంలో రూపొందించిన లైవ్ ఫైరింగ్ సిస్టం ను ఈ ఎన్ సీ చీఫ్ వైస్ అడ్మిరల్ బిస్మత్ దాస్ గుప్తా ప్రారంభించారు.
పర్యావరణ పరిరక్షణలో భారత్ కు - 8 వస్తానం
పర్యావరణ పరిరక్షణ, భూతాప నివారణ లో 63 దేశాల జాబితాలో భారత్ కు 8వ స్థానం దక్కింది.
ఇందులో ఆర్థిక శక్తులైన అమెరికా 52 వ స్థానం, చైనా 51వ స్థానంలో ఉన్నాయి.
ఈ సంజీవని లో ఏపీ కి మొదటి స్థానం
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఉచిత టెలిమెడిసిన్ సర్వీస్ (ఈ సంజీవని) ను వినియోగించుకున్న వారిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మొదటి స్థానంలో ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది.
ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లోఆప్ విజయం
దేశ రాజధాని ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. 15 తరువాత బీజేపి తమ అధికారాన్ని ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కోల్పోయింది. 250 వార్డుల్లో అప్ కు 134, బీజేపికి 104, కాంగ్రేస్ కు 9 వార్డులు దక్కాయి.
ఢిల్లీ మున్సిపల్ లో తొలి ట్రాన్స్ జెండర్ కార్పొరేటర్ గా బాబీ కిన్నర్, ఎన్నికయ్యారు.
జీ-20-కూటమి
జీ-20 కూటమి లో 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ భాగస్వామి గా ఉంది.
జీ-20 కూటమి 1999 లో ఏర్పడింది. ఈ కూటమి మొదటి శిఖరాగ్ర సమావేశం 2008లో వాషింగ్టన్ డిసీలో జరిగింది. దీని లక్ష్యం ఆసియ ఆర్థిక సంక్షోభం " నుంచి బయటపడడం.
2016లో చైనాలో జీ-20 శిఖరాగ్ర సమావేశం జరిగింది. లక్ష్యం సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ "
ఓ ఎన్ జి సి ఛైర్మెన్ గా అరుణ్ కుమార్ సింగ్
ఓ ఎన్ జీ సి చైర్మెన్ గా అరుణ్ కుమార్ సింగ్ నియమితులయ్యారు.
గతంలో ఈయన చమురు రిఫైలింగ్, మార్కెటింగ్ సంస్థ బిపీసిఎల్ ఛైర్మెన్ గా పనిచేసి పదవి విరమణ చేసారు.
రిటైరైన వ్యక్తి దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థకు చైర్మెన్ గా నియమించడం ఇది తొలిసారి.
అరుణ్ కుమార్ సింగ్ మూడు సంవత్సరాల కాలం ఈ సంస్థకు ఛైర్మన్ గా వ్యవహరిస్తారు.
రెపోరేటు 6.25 శాతానికి పెరిగింది.
సుప్రీం కోర్టు మెబైల్ యాప్ అంద్రాయిడ్ వర్షన్ 2.0 ప్రారంభం
దేశ అత్యు న్నత ధర్మాసనం అంద్రాయిడ్ యాప్ 2.0 ను ప్రారంభించింది ఈ యాప్ ద్వారా విచారణలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఈ యాప్ గుగూల్ ప్లెస్టోర్ లో అందుబాటు లో ఉంటుంది.
మరోకవారంలో ఐఓఎస్ యాప్ కూడా విడుదల అవుతుందని న్యాయస్థానం తెలియజేసింది.
ఫోర్ట్ 100 శక్తి వంత మహిళల జాబితాలో 6 గురు భారతీయ మహిళలు.
100 శక్తి వంతమైన మహిళల జాబితాలో 6 గురు భారతీయ మహిళలకు చోటు దక్కింది.
1 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ (ర్యాంక్ 36)
2.బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్ పర్సన్ కిరణ్ మజుధాల్ షా (ర్యాంక్ 72)
3. నైకా వ్యవస్థాపరాలు ఫల్గుగ నాయర్ (ర్యాంక్ 89)
4 హెచ్ సీఎల్చైర్ పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా ( ర్యాంక్ 53)
5 సెబీ ఛైర్ పర్సన్ మాధవీ పూరి (ర్యాంక్ 54)
6 స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్ పర్సన్ సోమా మోండాల్ ( ర్యాంక్ 67)
ఈ జాబితాలో ఉన్నారు.
గుజరాత్ లో బీజేపి ప్రభుత్వం
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 182 సీట్ల కు గాను 156 సీట్లను బీజేపి గెలిచి గుజరాత్ లో
వరుసగా ఏడ వసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
హిమచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం
హిమచల్ అసెంబ్లీ ఎన్నికలలో 68 సీట్లకుగాను 40 సీట్లను సాధించి ప్రభుత్వాన్ని కైవసం చేసుకుంది.
మిస్టర్ ఇండియా విజేత : తనుబుద్ధి సాయిభరద్వాజరెడ్డి
మిస్టర్ ఇండియా తను బుద్ధి సాయి భరద్వాజ రెడ్డి విజేతగా నిలిచారు.
ఈ పోటి డిసెంబర్ -1 న ఒడిశా రాష్ట్రం పూరి పట్టనంలో జరిగింది.
మిస్టర్ యూనివర్స్ రేసులో సాయి భరద్వాజ రెడ్డి
మిస్టర్ ఇండియ సాయి భరద్వాజ రెడ్డి మిస్టర్ యూనివర్స్ కోసం పోటి పడుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన సాయి భరద్వాజ రెడ్డి ఇండోనేషియా బాలి లో మార్చి 12 నుండి 21 వరకు జరిగే
మిస్టర్ యూనివర్స్ టూరిజమ్ - 2023° పోటీల్లో మన దేశం తరుపున పాల్గొంటారు.
ఆంధ్ర ప్రదేశ్ ఆతిధ్యం లో ఏకలవ్య జాతీయ క్రీడలు,
2019 మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోపల ఏకలవ్య క్రీడలు జరిగాయి.
డిసెంబర్ 17 నుండి 22 వరకు ఈ క్రీడలు జరుగుతాయి.
సర్కారీ స్కూళ్ళలోను సీబీఎస్ఈ
సర్కారీ స్కూళ్ళలో సీబీఎస్ఈ సిలబస్ ను ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8వ తరగతి నుండి ప్రారంభిస్తున్నారు
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు
హిమాచల్ ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు నియమించబడ్డారు.
ప్రస్తుత హిమచల్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అల్లెకర్ ప్రమాణస్వీకారం చేయించారు.
రాష్ట్రానికి తొలి ఉపముఖ్య మంత్రిగా ముకేశ్ అగ్నిహోత్రి నియమించబడ్డారు. హిమచల్ ప్రదేశ్ లోకాంగ్రెస్ పార్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.
గుజరాత్ ముఖ్య మంత్రిగా భూపేంద్ర పటేల్
గుజరాత్ సిఎంగా భూపేంద్ర పటేల్ ఎన్నికయ్యారు,గుజరాత్ లో భారతీయ జనతా పార్టి 7 వ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.
భూమిని చేరిన ఓరియాన్
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా డిసెంబర్ ప్రయోగించిన ఓరియాన్ క్యాప్సుల్ 11/ డిసెంబర్ /22 న భూమికి క్షేమంగా చేరింది.
చంద్రుడి చుట్టు 25 రోజుల పాటు ప్రదక్షిణలు చేసి మెక్సికో లోని బజా ద్వీపకల్పంలోని పసిఫిక్ సముద్ర తీరంలోభూమికి క్షేమంగా చేరింది.
భారతదేశ మొట్టమొదటి జీవ వైవిధ్య వంతెన బాబా సాహెబ్ ఠాక్రె సమృద్ది మహామార్గ్
నాగపూర్- ముంబై మధ్య నిర్మించిన బాబా సాహెబ్ ఠాక్రె సమృద్ది మహామార్గ్ భారతదేశ మొట్ట మొదటి జీవ వైవిద్య (ఎకో ) వంతెన,
701 కి.మీ పొడవైన ఈ మార్గం ప్రస్తుతం మొదటి దశలో 520 కి.మీ లు పూర్తి చేశారు.ఎంతనాలు 17 ఈ మార్గం మొత్తం ఓవర్ ప్రాసెస్ " తొమ్మిది గ్రీన్ “ వంతెనలు, 17 అండర్ పాసెస్ వంతెనలు నిర్మించారు.
జంతువులు, వన్య ప్రాణులు నిర్భయంగా సంచరించడానికి ఈ వంతెనలు ఉపయోగ పడతాయి.
భారత వాయుసేన గరుడ్ కమెండో ఫోర్స్ లోకి మహిలు
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క గరుడ్ కమెండో ఫోర్స్ " లో మహిళా సైనిక అధికారులను చేర్చడం కోసం అనువుతినిచ్చింది.
లింగ సమానత్వం(జెండర్ ఇక్వాలిటి) కోసం భారతీయ వాయు సేనసేన ఈనిర్ణయం తీసుకుంది.
IAF (భారత వాయు సేన) గరుడ కమెండో ఫోర్స్ ను 2004 లో ప్రారంభంఅయింది.
గరుడ కమెండో శిక్షణ 72 వారాల పాటు ఉంటుంది.
ఘజియాబాద్ కౌంటర్ ఇన్ సర్జెన్సీ అండ్ జంగిల్ వార్ఫెర్ స్కూల్ (సిఐ జె డబ్ల్యు ఎస్) లో శిక్షణలు
తీసుకుంటారు.
భారత సైన్య ప్రత్యేక విభాగాలలో గరుడ కమాండోలే ఎక్కువ కాలం శిక్షణలు తీసుకునే దళం.
భారత్, చైనా జవాన్ల ఘర్షణ
అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది.
అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో వాస్తవాధీన రేఖ (ఎల్ఎసీ) వద్ద యాంగ్ త్సే సమీపంలో ఈ ఘర్షణ మొదలైంది.
2020 - జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తరువాత మరోసారి ఈ ఘటన జరిగింది.
స్పేస్ ఎక్స్ "చంద్రయాన్ లో భారత నటుడు “దీప్ జోషి”
ఎలెన్ మస్క్ స్పేస్ ఎక్స్ డియర్ మూన్ పేరుతో తొలి వాణిజ్య అంతరిక్షయాత్ర లో భారత నటుడు లభించింది.
జపాన్ కుబేరుడు యాసాకు మజావా వీటికి సంబంధి౦చిన అన్ని టికెట్లను కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా ధరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు అవకాశం కల్పిస్తున్నారు.
పుంగనూరు ఆవుల పరిరక్షణకు గాను ప్రతిష్టాత్మక “బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు "
పలమనేరు లోని పుంగనూరు పరిశోధనా కేంద్రానికి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు - 2022 లభించింది
డిసెంబర్ -23 కిసాన్ దివాస్ సందర్భంగా న్యూఢిల్లీలో ఈ అవార్డును ప్రధానం చేస్తారు.
అంతరించి పోతున్న జాతుల పరిర్మాణకు కృషి చేసే సంస్థలకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ప్రతి సంవత్సరం ఈ అవార్డును ప్రధానం చేస్తుంది.
పుంగనూరు జాతి ఆవుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది.
భారత వాయు సెనలోకి మహిళా ఫైటర్లు
అమృత్ సర్ కు చెందిన సహజ్ ప్రీత్ కౌర్, పంజాబ్ కి చెందిన కోమల్ ప్రీత్ కౌర్ లు భారత వాయు సేనలోకి మహిళా ఫైటర్లుగా ఎంపికయ్యారు.
హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో (ఏఎఫ్ఏ) శిక్షణలలో 22 మంది మహిళల్లో ఈ ఇద్దరు మహిళలు ఎంపికయ్యారు.
ఇండియా లీడర్ షిప్ అవార్డు ఎన్డీపీసీ సిఎస్సారు కి
సింహాద్రి ఎస్టీ పీసీ సీఎస్సార్ విభాగానికి గిరిజన ప్రాంతాల్లో విద్యను ప్రోత్స హించినందుకు గాను ప్రతిష్టాల్మీక ఇండియ లీడర్ షిప్ -2022 అవార్డు లభించింది.
అంతర్జాతీయ మహిళా హాకి టోర్నిలో- భారత్ విజెత.
నేషన్స్ కప్ అంతర్జాతీయ మహిళా హాకి టర్నిలో ఫైనల్లో స్పెయిన్ జట్టుపై విజయం సాధించి భారత్ విజేతగా నిలిచింది .
స్పైయిన్ అతిధ్యంగా తోలి సారిగా నిర్వహించిన ఈ టోర్నీలో సవితా పూనియా భారత్ జుట్టుకు సారర్యం వహించింది.
మిసెస్ వరల్డ్ గా సర్గమ్ కౌశల్ .
63 దేశాలలకు చెందిన మహిళల తో పోటి పడి మిసెస్ వరల్డ్ గా సర్గమ్ కౌశల్ కిరిటాన్ని దక్కించు కున్నారు.
సర్గమ్ కౌశల్ ముంబై కి చెందిన మహిళ.
అమెరికాలో జరిగిన పోటీల్లో ఆమె ఈ కిరిటాన్ని కైవశం చేసుకున్నారు.
అగ్ని- 5 పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అగ్ని -5 పరీక్ష విజయవంతం అయింది.
2012 లో తొలిసారి అగ్ని 5 ను ప్రయోగించారు. ఇప్పటి వరకు 9 సార్లు అగ్ని 5 ను ప్రయోగించారు.
అణ్వస్త్రాలను మోసుకెల్ల గల సామర్థ్యం అగ్ని-5 క్షిపణికి ఉంది.
5,400 కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని చేధించ గల సామర్థ్యం అగ్ని - 5 సొంతం.
ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్.
డిసెంబర్ 15 న అగ్ని -5 ను ప్రయోగించారు
సన్ వే సిట్ గెస్ ఓపెన్ అంతర్జాతీయ బ్లిట్జ్ చెస్ ఛాంపియషిప్ లో రాజా రిత్విక్
తెలంగాణ చెస్ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్ స్పేయిన్ ఆతిధ్యంగా జరిగిన సన్ వే సిట్ గెస్ ఓపెన్ అంతర్జాతీయ బ్లిట్జ్ చెస్ ఛాంపియషిప్ లో ఛాంపియన్ గా నిలిచారు.
విమెన్స్ లీడర్స్ ఫోరం -2022 - అవార్డు గ్రహిత : సాహితీ కొండపల్లి
విమెన్ లీడర్ అవార్డ్ ఇన్ లీడర్ షిప్ విభాగంలో విమెన్స్ లీడర్స్ ఫోరం - 2022 అవార్డును
క్రెటీరి యన్ ఎడ్జ్ కంపెనీ డైరెక్టర్ సాహితీ కొండపల్లిని వరించింది
క్రెటిరియన్ ఎడ్జ్ కంపెనీ వైద్య పరికరాలు, మందులు ( మెడికల్ డివైసెస్ అండ్ ఫార్మాసిటిక్స్) కు సంబంధించి రెగ్యులేటరీ రైటింగ్ ను నిర్వహించే కంపెనీ.
ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియన్ కంపెనీ ఎక్సలెన్స్ అవార్డ్ : శ్రీను టెక్నాలజీ కంపెని.
ఇంటర్నేషనల్ అచీవర్స్ కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ కు చెందిన శ్రీను
టెక్నాలజీ కంపెనీకి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియన్ కంపెనీ ఎక్సలెన్స్ అవార్డ్ పొందింది.
ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా న్యూఢిల్లీ లో ఈ కాన్ఫరెన్స్ జరిగింది.
ప్రపంచ బ్లిట్జ్ చేస్ ఛాంపియన్ షిప్ లో రజత౦ నెగ్గిన కొనేరు హంపి
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్, భారత మహిళా చెస్ క్రీడాకారిని కోనేరు హంపి ప్రపంచ బ్లిట్జ్ చేస్ ఛాంపియన్ షిప్ లో రజత పతకం సాధించారు.
ఉత్కర్స్ 2.0 ఆవిష్కరణ
ఆర్. బి.ఐ 2023-25 సంవత్సరానికి సంబంధించి పాటించవలసిన, మధ్యకాలిక వ్యూహా ప్రణాళిక ఉత్కర్స్ - 2.0 ను రిజర్వుబ్యాంకు 30/12/20 22 న ప్రారంభించింది.
ఉత్కర్స్ - 2.0 ను ఆర్-బి.ఐ గవర్నర్ శక్తి కాంత దాస్ ఆవిష్కరించారు.
ఉత్కర్స్ 2.0 లో డెటా విశేషం కోసం ఆర్టిఫిసిమల్ ఇంటిలిజెన్స్, మిషన్ లర్నింగ్ (ఎఐ) లను ఉపయోగించారు. ఉత్కర్స్-1.0 2019 - 22 మధ్య అమలు చేశారు.
ఎన్ డీటీవి ఆధాని సొంతం
న్యూఢిల్లీ టెలివిజన్ (ND TV) ని అధాని సంస్థలు కొనుగోలు చేశారు. ND TVవ్యవస్థాపకులు, ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ ల వాటాలను కొనుగోలు చేయడం వల్ల అదానీ గ్రూపు వాటా 64.71 శాతానికి చేరింది. దీంతో ND TV అదానీ గ్రూపు కు పూర్తి స్థాయిగా దక్కింది.