Trains(basic formula)

Note :

రైలు విషయంలో రైలు ప్రయాణించిన దురంను రైలు పొడవు తో కలిపి లెక్క కట్టవలెను

 రైలు ప్రయాణించిన దురం=దూరం + రైలు పొడవు

                                                   వేగం = దూరం /కాలం


రైలు ఒక చెట్టును/బిందువును /వస్తువును /మనిషిని దాటుటకు ప్రయాణించిన దూరం రైలు పొడవు తో సమానం. 


ఈక్రింది ప్రాథమిక ఫార్ములాలను అనుసరించి  రైలు పై వచ్చే సమస్యలను  సాధించవచ్చు.

వేగం = దూరం / కాలం 

కాలం = దూరం / వేగం

దూరం = వేగం × కాలం

రైలు వంతెన /  రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ ను దాటుట :


రైలు వంతెన లేదా రైల్వే స్టేషన్  ప్లాట్ ఫామ్ దాటినప్పుడు  రైలు ప్రయాణించిన దూరం రైలు పొడవు మరియు రైల్వే స్టేషన్ పొడవు/ వంతెన పొడవు మొత్తానికి సమానం


రైలు ప్రయాణించిన దూరం  = రైలు పొడవు + రైల్వే స్టేషన్ పొడవు (లేదా) వంతెన పొడవు


రైలు వంతెన లేదా రైల్వే స్టేషన్  ప్లాట్ ఫామ్ = X



రెండు రైళ్లు ఒకే దిశలో ప్రయాణిస్తూ ఒకదానిని మరొకటి దాటిన సందర్భంలో ;


S పొడవు గల  A అనే రైలు  U km/hr వేగంతో L మీటర్ల పొడవుగల మరొక రైలు V km/ hr వేగంతో  ఓకే దిశలో ప్రయాణిస్తున్న

 

B అనే రైలును దాటిన 


మొత్తం రైలు ప్రయాణించిన దూరం  = S + L

రైలు యొక్క సాపేక్ష వేగం = U - V


కాలం =  దూరం / వేగం = ( S + L) / (U-V)


T  = ( S + L) / (U-V)


 రెండు రైళ్లు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ ఒకదానిని మరొకటి దాటిన సందర్భంలో ;


S పొడవు గల  A అనే రైలు  U km/hr వేగంతో L మీటర్ల పొడవుగల V km/ hr వేగంతో వ్యతిరేక  దిశలో ప్రయాణిస్తున్న B అనే రైలును దాటిన 


మొత్తం రైలు ప్రయాణించిన దూరం  = S + L


రైలు యొక్క సాపేక్ష వేగం = U + V


కాలం =  దూరం / వేగం = ( S + L) / (U+V)


T  = ( S + L) / (U+V)

 


కామెంట్‌లు లేవు: