వయస్సు లెక్కలు (BASIC)

 AGE APTITUDE PROBLEMS ( వయస్సు )


వయస్సుల లెక్కల విషయం లో X అనుకోవడం ఒక వరం మనం సాధారణంగా చిన్నప్పుడు లెక్కలలో తెలియని విషయాన్ని x అనుకొందాం , అన్న విషయం చూసుంటాము. 

ఇక్కడ X అనుకొవడం నా దృష్టిలో x -ధియరి (సిద్దాంతం)  


x సిద్దాంతం వయస్సు సమస్యలను సాధించుటకుఎంతగాక ఉయెంగ పడుతుంది

అయితె ఇచ్చిన వ్యక్తులలో ఎవరి వయస్సు x అనుకోవాలో ఎన్నిక చేసుకోవడమే ముఖ్యం సరైన వ్యక్తిని ఎన్నుకుంటే సమస్యని సులభంగా సాధిచవచ్చు సరికాని వ్యక్తిని ఎన్నుకుంటే సమస్య ఇంగా సమస్యగా మారుతుంది.

వయస్సు లెక్కల కంటే ముందు సరాసరి, శాతం కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత వయస్సు లెక్కలు సులభంగా అర్థం అవుతాయి

వీలైనంత ఎక్కువ సమస్యలు చూడడం, సాధించడం వల్ల ఈ పరిస్థితి అనుభవం అవుతుంది. 


కొన్ని ఉదాహరణలు చూదాం.


ఉదాహరణ 1


Aవయస్సు Bవయస్సుకంటే  a/b రెట్లు ఎక్కువగా ఉంటే 


సందర్భం 1


B ప్రస్తుత వయస్సు N అయితె


A వయస్సు:= a/b * N అవుతుంది.


సందర్భం 2


A  ప్రస్తుత వయస్సు N అయితె

B ప్రస్తుత వయస్సు:=  b / a * N అవుతుంది.


ఉదాహరణ 2


N సంవత్సరాల క్రితం  A వయస్సు R  అయిన mసంవత్సరాల తర్వాత A వయస్సు, ప్రస్తుత వయస్సు కి

a/b రెట్లు అయిన A ప్రస్తుత వయస్సు ఎంత? 


 N సంవర్సరాల క్రితం A  వయస్సు = R

A ప్రస్తుత వయస్సు = x ' అనుకొనుము

X = R +N —---- 1

m సంవత్సరాల తర్మాత A వయస్సు = a/b x  (or) a/b (R+N)

Or

A ప్రస్తుత వయస్సు = [ a / b (R+N) - m ]

ఈ విధంగా ఉంటుంది. కాని వయస్సు లెక్కలు చేయుటకు ఎటువంటి ఫార్ములా అవసరం ఉండదు.

పై ఉదావరం అన్ని మిమ్మల్ని ఎగ్జామ్ లో ఏవిధంగా కన్ఫిజ్ చేస్తారోతెలియచెప్పడం కోసమే. 

వయస్సు లెక్కలు చేయుటకు x సిద్దాంతం సరిపోతుంది.


ఉదాహరణలు


రవి ప్రస్తుత వయస్సు: 20 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత రవి వయసు రవి సోదరుడి వయస్సు: లో ⅔ వ వంతు అయిన రవి సోదరుడి వయస్సు ఎంత ?


రవి ప్రస్తుత వయస్సు: =  20 సంవత్సరాలు

4 సంవత్సరాల తర్వాత రవి వయస్సు: 20+4 = 24 సంవత్సరాలు.

4 సంవత్సరాల తర్వాత రవి సోదడి వయస్సు = X  అనుకోనుము

24 సంవత్సరాలు. = ⅔ x 

X = 24 * 3 / 2

X = 36

4 సంవత్సరాల తర్వాత రవి సోదరుడి వయస్సు = :36

రవి సోదరుడి  ప్రస్తుత వయస్సు = 36 - 4 = 32


క్రిష్ణ ప్రస్తుత వయస్సు, 35 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం  కిరణ్ వయస్సులో 3/2 వ వంతు అయిన కిరణ్  ప్రస్తుత వయస్సు ఎంత ?


5 సం॥క్రితం కిరణ్ వయస్సు =  X అనుకోనుము

5 సం॥క్రితం క్రిష్ణ వయస్సు =35 - 5 = 30 

3/2x = 30 సంవత్సరాలు 

X =  ⅔ 30 = 20

X = 20

ప్రస్తుతం కిరణ్ వయస్సు =  X + 5 = 25 సంవత్సరాలు


ప్రస్తుతం కిరణ్ వయస్సు = 25 సంవత్సరాలు