project tiger and tiger resevers in india

 ప్రాజెక్ట్ టైగర్

1973 ఏప్రిల్ 1 న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ "ప్రాజెక్ట్ టైగర్" అంతరించి పోతున్న పులుల ను సంరక్షించేందుకు జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో ప్రారంభించారు.

టైగర్ ప్రాజెక్ట్ కు కైలాష్ సంఖలం మొదటి డైరెక్టర్ జనరల్ గా వ్యవ హరించారు. ఆయన ను టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పిలుస్తారు

వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఆమలు లోకి వచ్చింది దీని ప్రకారం 1973 లో ప్రాజెక్ట్ టైగర్ ను ప్రారంభించారు

నేషనల్ టైగర్ కంజర్వేషన్ అధారిటిని 2005 లోప్రారంభించారు.దీని ప్రకారం పులులను సెడ్యూల్ 1 లో చేర్చారు.

IUCN లో టైగర్ ఎన్ డెంజర్ లిస్టులో ఉంది.

50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న టైగర్ ప్రాజెక్ట్.

"ప్రాజెక్ట్ టైగర్" 1 ఏప్రిల్ 2023 కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది

9 టైగర్ రిజర్వు ఫారెస్టులతో 9 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించ బడింది. 

ప్రస్తుతం (73 వేల చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం) 53 టైగర్ రిజర్వు ఫారెస్టులకు విస్తరించింది.


1973లో జరిగిన మొదటి పులుల గణనతో 1827 పులులు  ఉన్నట్టు నిర్ధారించారు. 

ప్రస్తుతం ప్రస్తుతం 2018 గణన ప్రకారం పులుల సంఖ్య 2,967 కి పెరిగింది.

ప్రపంచంలోని పులుల జనాభాలో 70% మన దేశంలోనే ఉన్నాయి.

పులుల సంరక్షణలో భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది.

1973 లో టైగర్ ప్రాజెక్ట్ బడ్జెట్ 4కోట్లు కాగా, ప్రస్తుతం దీని బడ్జెట్ రు 500 కోట్లు.

దేశంలో రాజస్థాన్లోని సరిస్కాటైగర్ రిజర్వులో పులులు పూర్తిగా అంతరించిపోయాయి.

మిగిలిన పులుల సంరక్షణ ప్రాజెక్టులలో వీటి సంఖ్య పెరిగి ప్రస్తుత గణాంకాల ప్రకారం వీటి సంఖ్య 3167 కి చేరింది.

ఇంటర్నేషల్ టైగర్ దినోత్సవం -జులై - 29

జులై - 29, 2010లో రష్యా లో జరిగిన సెంట్ పీటర్స్ సమావేశం లో ఈ రోజును అంతర్జాతీయ టైగర్ దినోత్సవంగా జరుపుకుంటున్నట్టు నిర్ణయించారు.

భారతదేశంలో ఆసియా టైగర్ శాస్త్రీయ నామం - పాంథారా టైగ్రిస్ టైగ్రిస్

టైగర్ రిజర్వు 

పులుల సంఖ్య తగ్గిపోతున్న కారణంగా వాటిని రక్షించడం కోసం ప్రాజెక్ట్ టైగర్ లో భాగంగా టైగర్ రిజర్వులను ఏర్పాటు చేశారు ఇవి పులులను పెంచడానికి, రక్షించడానికి రిజర్వు చేసిన ప్రాంతం.

టైగర్ రిజర్వులను జాతీయ ఉధ్యానవనం లేదా వన్య ప్రాణుల అభయారణ్యం అని పిలుస్తారు, 

పులుల సంరక్షణ కోసం 1973లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రాజెక్ట్ టైగర్ ను ప్రారంభించారు.

ఇందులో భాగంగా 9 టైగర్ రిజర్వు లను మొదట ప్రారంభించారు.

భారత దేశం లో మొట్ట మెదటి టైగర్ రిజర్వు గా జిమ్ కార్బెట్ నేషనల్ పార్కును ప్రారంభించారు. ఈ రిజర్వు ఉత్తరాఖండ్ లో ఉంది.

భారత అతిపెద్ద టైగర్ రిజర్వు  నాగర్జునా సాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వు

మనదేశంలో అతి  చిన్న టైగర్ రిజర్వు - బోర్ టైగర్ రిజర్వు -  మహారాష్ట్ర 

నీలగిరి బయోస్సియర్ లో నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు భాగంగా ఉంది

మనదేశంలో మధ్యప్రదేశ్ ను టైగర్ స్టేట్ గా పిలుస్తారు

53వ టైగర్ రిజర్వు - రాణిపూర్ టైగర్ రిజర్వు - ఉత్తర ప్రదేశ్


భారత దేశం లో వివిధ రాష్ట్రాలలో గల టైగర్ రిజర్వులు

మధ్యప్రదేశ్

కన్హా టైగర్ రిజర్వ్ 

ఇంద్ర ప్రియదర్శిని పెంచ్ టైగర్ రిజర్వ్  

బాంధవ్ ఘర్ టైగర్ 

పన్నా టైగర్ రిజర్వ్ 

సాత్పురా టైగర్ రిజర్వ్

సంజయ్ ధుబ్రి టైగర్ రిజర్వ్ 


మహారాష్ట్ర 

మెల్టాట్ టైగర్ రిజర్వ్ 

తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ 

సహ్యాద్రి టైగర్ రిజర్వ్

బోర్ టైగర్ రిజర్వ్ 

పెంచ్ టైగర్ రిజర్వ్ 


తమిళనాడు

శ్రీ విల్లి పుత్తూరు మేఘమలై టైగర్ రిజర్వ్ 

అన్నామలై టైగర్ రిజర్వ్ 

ముదుమలై టైగర్ రిజర్వ్ 

సత్యమంగళం టైగర్ రిజర్వ్ 


రాజస్థాన్

సరిస్కా టైగర్ రిజర్వ్  

రణతంబోర్ టైగర్ రిజర్వ్ 

ముకుందరా హిల్స్ టైగర్ రిజర్వ్ 

రామ్ ఘర్ టైగర్ రిజర్వ్


ఛత్తీస్ ఘఢ్

వడంటే సీతానది టైగర్ రిజర్వ్ 

ఆచనకుమార్ టైగర్ రిజర్వ్

ఇంద్రావతి టైగర్ రిజర్వ్

 గురు ఘాసిదాస్ టైగర్ రిజర్వ్


అస్సాం

నామేరి టైగర్ రిజర్వ్ 

కజిరంగా టైగర్ రిజర్వ్

మానస్ టైగర్ రిజర్వ్

ఉరంగ్ టైగర్ రిజర్వ్


కర్ణాటక

నాగర్ హోల్ టైగర్ రిజర్వ్ 

భద్ర టైగర్ రిజర్వ్

బిలిగిరి రంగనాథ టైగర్ రిజర్వ్ 

దండేలి / కాళీ టైగర్ రిజర్వ్ 

బందిపుర్ టైగర్ రిజర్వ్


ఉత్తర ప్రదేశ్

దుద్వా టైగర్ రిజర్వ్ 

పిలిభిత్ టైగర్ రిజర్వ్

రాణిపూర్ టైగర్ రిజర్వు 


అరుణాచల్ ప్రదేశ్

నామ్ దఫా టైగర్ రిజర్వ్ 

పక్కే టైగర్ రిజర్వ్ 

కంలాంగ్ టైగర్ రిజర్వ్


ఉత్తరాఖండ్

రాజాజీ టైగర్ రిజర్వ్  

జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు 

కళగర్హ్ టైగర్ రిజర్వ్


కేరళ

పెరంబికులం టైగర్ రిజర్వ్ 

పెరియార్ టైగర్ రిజర్వ్ కేరళ 


తెలంగాణ

 కవ్వల్ టైగర్ రిజర్వ్  

 అమరాబాద్ టైగర్ రిజర్వ్


ఒడిశా

సిమిలీపాల్ టైగర్ రిజర్వ్ 

సత్కోసియా టైగర్ రిజర్వ్ 


పశ్చిమ బెంగాల్

సుందర్బన్ టైగర్ రిజర్వ్  

బక్స టైగర్ రిజర్వ్ 


ఆంధ్రప్రదేశ్

నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ 


 జార్ఖండ్

 పాలము టైగర్ రిజర్వ్  


బిహార్

వాల్మికి టైగర్ రిజర్వ్  


మిజోరం

డంప టైగర్ రిజర్వ్  


టైగర్ సెన్సెక్

ప్రతి నాలుగు సంవత్సరాలకుఒకసారి జాతీయ స్ధాయిలో పులుల సంఖ్యను లేక్కిస్తారు. దీనిని టైగర్ సెన్సెస్ అంటారు

టైగర్ సెన్సెస్ ను నాలుగు సంవత్సరాలకు ఒకసారి విడుదల చేస్తారు.


2018గణాంకాల ప్రకారం వివిధ దేశాలలో పులుల సంఖ్య

భారతదేశం -2,967, రష్యా - 433, నేపాల్ - 355, థాయ్ ల్యాండ్ - 149, ఇండోనేషియ - 371, మలేషియ - 120,బంగ్లాదేశ్ - 106, భూటాన్ - 103, చైనా - 55, మయన్మార్ - 22,

భారతదేశంలో గణణ ల ప్రకారం పులుల సంఖ్య.

2006 - 1411,

2010 - 1706,

2014 - 2226,

2018 - 2967, 

2023 - 3167.

2023 - ఏప్రిల్ లో విడుదల చేసిన గణణలో పులుల సంఖ్య 3167 గా లెక్క కట్టారు. నాలుగు సంవత్సరాలలో 200 పులులు పెరిగాయి. పులులను ప్రస్తుతం అత్యాధునిక కెమెరాలను ఉపయోగించి లెక్కిస్తున్నారు.

పులులు సంచరించే ప్రాంతాలను గుర్తించి కెమెరాలను ఎక్కువగా ఏర్పాటు చేసి పులుల సంఖ్యను లెక్కిస్తున్నట్టు జాతీయ పులుల సంరక్షణ అధారిటి అధికారులు తెలిపారు.

అడవులలో చెట్లకు ఇరువైపులా కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల పులులతో పాటు ఇతర జంతువుల వివరాలు కూడా తెలుస్తున్నాయి.

మనదేశ పులుల గణన గిన్నిస్ రికార్డును సాధించింది.

కెమెరాల సహాయంతో భారీగా వన్య ప్రాణుల గణన చేసిన తొలి దేశంగా భారత్ గిన్నిస్ రికార్డుల కెక్కింది.

2018-2019 పులుల గణణ తో ఇది ప్రారంభం అయింది

2018-2019 పులుల గణణ ప్రపంచం లోనే అత్యంత సమగ్రమైనదిగా పెర్కొన్నారు.


కామెంట్‌లు లేవు: