November national current affairs

 నవంబర్ - కరెంట్ అఫైర్స్

 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు కాంస్య పతకం లభించింది

ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ తరఫున ఆడుతున్న మహమ్మద్ ముసా ముద్దీన్ ఉజ్బెకిస్తాన్ (సెరీక్) 57 కేజీల విభాగంలో గెలిచి కాంస్య పతకం కైవసం చేసుకున్నారు.

 ఇతను తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారుడు.

ట్విట్టర్ బ్లూ టిక్ అమ్మకానికి ఉంచినట్టు ట్విట్టర్ కొత్త యజమాని “Elon Mask” ప్రకటించారు.

దీనికి గాను నెలకు “8 డాలర్లు”చెల్లించవలసిందిగా ప్రకటించారు.

ఆసియా కాంటినెంటల్ చెస్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు రజత పథకాలు.

గ్రాండ్ మాస్టర్ హర్ష భరత్ కోటి, మహిళా గ్రాండ్ మాస్టర్ (డబ్ల్యు జీఎం) నూతక్కి ప్రియాంక ఆసియా కాంటినెంటల్ చెస్ ఛాంపియన్ షిప్ లో భారత కు రజత పతకాలు సాధించారు.

హర్ష భారత్ కోటి తెలంగాణాకు చెందిన వ్యక్తి కాగా ,  నూతక్కి ప్రియాంక ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళ.

ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కి ఆస్ట్రేలియా “హెరిటేజ్ అవార్డు”      

ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కి ఆస్ట్రేలియా “హెరిటేజ్ అవార్డు” లభించింది. 

కాటన్ బ్యారేజ్ ధవళేశ్వరం తూర్పు గోదావరి జిల్లా  ధవళేశ్వరం లో  గోదావరి నదిపై కలదు.

ఆక్వా ఎక్స్ ఇండియా : భీమవరం వేదిక గా

పశ్చిమ గోదావరి భీమవరం వేదిక గా నవంబర్ 4,5,6 తేదీల్లో ఆక్వా ఎక్స్ ఇండియా 2022 జరుగుతుంది.

ఆక్వా రైతులతో పాటు ఈ రంగంలో ప్రతి విభాగం వ్యక్తులు ఒకే వేదికపై తీసుకు రావాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు.

దేశంలో ఆక్వా రంగంలో ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.

తొలి ఓటర్ నేగీ కన్నుమూత :

 స్వాతంత్య్రం అనంతరం భారతదేశ తొలి ఓటర్ గా రికార్డులలో నమోదు అయిన శ్యామ్ శరణ్ నేగీ 

మరణించారు.

 106 సంవత్సరాల నేగి 34 సార్లు  ఓటు వేసిన అరుదైన ఘనత సాధించారు.

 నేగి హిమాచల్ రాష్ట్రం, కిన్నార్ జిల్లా, కల్పా గ్రామంలో జన్మించారు.

వాతావరణ సమాచారం కోసం బెలూన్ల ఫ్లయింగ్ టాటా ఇనిస్టిట్యూట్  ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ - హైదరాబాద్

నవంబర్ 21-26 మధ్య బెలూన్లను ఎగురవేస్తారు. ఇందులో 800 కిలోల టెలిస్కోపును

ఉంచి భూ ఉపరితలం నుంచి 30 నుంచి 42 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి ఆ తర్వాత బెలూన్ల నుండి విడిపోయి పారాచూట్ సాయంతో కిందికి దిగుతాయి.

ఇవి హైదరాబాద్ నుండి 350 కిలోమీటర్ల పరిధిలో భూమిని చేరవచ్చు

ఈ ప్రక్రియ సాయ౦ తో వాతావరణ సమాచారాన్ని తెలుసుకొనవచ్చు.

సీజేఐ విచారణ లైవ్:-

భారత ప్రధాన ధర్మాసనం లో సీజేఐ జస్టిస్ యు.యు. లలిత్ గారి చివరి సారి జరిగే విచారణ ప్రత్యక్ష ప్రసారం చేశారు.

జస్టిన్ లలిత్ గారు 8/11/2022 పదవీ విరమణ చేస్తారు.

తదుపరి సి.జె.ఐ గా జస్టిన్ - డీవై చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరిస్తారు.

బాడ్మింటన్ : సౌదీ అరేబియా జాతీయ క్రీడ లో

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ చంద్రచూడ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా 9/11/2022 న జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్ర చూడ్ ప్రమాణ స్వీకారం చేశారు.

రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రమాణ స్వీకారం చేయించారు.

జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబర్ 10 దాకా రెండు సంవత్సరాల వరకు  పదవిలో కొనసాగుతారు..

 16 వ సిజెఐ గా (1978 నుంచి 1985 దాకా) 7 సంవత్సరాలు బాధ్యతలు నిర్వర్తించిన జస్టిస్ వై.వి చంద్రచూడ్ కుమారుడు జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ 

దేశంలో అత్యధిక కాలం సిజెఐ గా బాధ్యతలు నిర్వహించిన 16వ సీజేఐ జస్టిస్ వై. వి చంద్రచూడ్,

దేశ చరిత్రలో తండ్రి, కుమారులు ఇద్దరు సీజేఐ లు కావడం ఇదే ప్రథమం.

త్రిపుర తాత్కాలిక సీజేగా జస్టిన్ అమర్ నాథ్ గౌడ్ : 

త్రిపుర హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా జస్టిస్ తోడుపు నూరి అమర్ నాథ్ గౌడ్ నియమితులయ్యారు.

నీరవ్ ను భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ అంగీకారం.

మనీ లాండరింగ్, పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ॥ 13,000 కోట్ల రుణం తీసుకుని మోసగించిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్ కు అప్పగించేందుకు లండన్ హైకోర్టు అంగీకరించింది

భారత్ అన్యాయం, అణచివేత గురిచేస్తున్నట్లు  భావించలేదని, మరియు ఆత్మ హత్య ప్రమాదం

కారణంగా అప్పగింత ను నిరోధించలేం అని లండన్ హైకోర్టు తెలియజేసింది.

నీరవ్ మోదీ మానసిక సమస్యలతో బాధ పడుతున్న భారత్ కు అప్పగించవద్దని లండన్ కోర్టును ఆశ్రయించారు, అయితే లండన్ కోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరించి మనీలాండరింగ్ ఫై విచారణ కొరకు భారతకు అప్పగించేందుకు సుముఖత తెలుపుతుంది.

ప్రపంచంలో అతి ఎత్తెన శివుడి విగ్రహం : విశ్వాస స్వరూపం

రాజస్థాన్లోని ఉదయ్ పూర్ సమీప ప్రాంతం నాథ్ ద్వార వద్ద ప్రపంచం లోనే అతి ఎత్తైన శివుడి విగ్రహం విశ్వాస స్వరూపం ను ఏర్పాటు చేశారు, ఈ విశ్వాస స్వరూపం  ఎత్తు 369 అడుగులు.

ఈ శివుడు విగ్రహాన్ని తతే పదమ్ సంస్థానం రూపొందించింది.

3,000 టన్నుల ఉక్కు, ఇనుము, 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటు వినియోగించి విగ్రహాన్ని తయారు చేశారు, 2012లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించారు ఇది పూర్తవడానికి 12 సంవత్సరాలు పట్టింది.

 దీనిని రాజస్థాన్ ముఖ్యమంత్రి  అశోక గెహ్లాట్ ప్రారంభించారు.

సిఈ 20 ఇంజన్ పరిక్ష విజయవంతం.

ఎల్ వీఎం 3. ఎం3 రాకెట్ ప్రయోగానికి సంబంధించి క్రయోజనిక్ దశలో ఉపయొగపడే కొత్త ఇంజన్ ను (సీఈ -20) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తమిళనాడు మహేంద్రగిరి లోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (ఐపీ ఆర్ సీ) తో నిర్వహించిన పరిక్ష విజయవంతం అయింది.

వన్ వెబ్ కు చెందిన మరొక ప్రయోగం

2023  జనవరి లేదా ఫిబ్రవరిలో ఎల్ వీ ఎం3-ఎం3 రాకెట్ ద్వారా ప్రయోగించాలి. ఈ ఉపగ్రహం కి తక్కువ దూరంలో కక్ష్యలు ఉండడంతో క్రయోజనిక్ దశలో నింపే 25 టన్నుల ఇంధనం లో 5టన్నుల భారాన్ని, ఖర్చును తగ్గించేందుకు సిఈ -20 నూతన క్రయోజనిక్ ఇంజన్ను డిజైన్ చేశారు. దీనిని ఎల్ వీఎం 3 రాకెట్ కోసం. రూపొందించారు.

ఈ ప్రయోగంతో జీఎస్ ఎల్వీ మార్క్ 2 రాకెట్ ప్రయోగాలకు సీఈ 12·5, జీఎస్ ఎల్ వీ  మార్క్ 3 రాకెట్

ప్రయోగాలకు సీఈ - 25,ఎల్ వీ ఎం 3  వాణిజ్యప్రయోగాలకు సీఈ - 20 అనే మూడు రకాల క్రయోజనిక్ ఇంజన్లు అందు బాటు లోకి వచ్చాయి.

జిఎస్ ఎల్ వీ మార్క్ 2 : భూమి నుండి తక్కువ ఎత్తులో కక్ష్యలు 

జిఎస్ ఎల్ వీ మార్క్ 3 :భూమి నుండి ఎక్కువ ఎత్తులో కక్ష్యలు

ఎల్ వీ ఎం : వాణిజ్య ప్రయోగాలకు

ఎన్జీరంగా వర్శిటీకి వ్యవసాయ డ్రోన్ పైలెట్ శిక్షణకు డీజి.సిఏ అనుమతి

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజిసిఎ), ఎన్జీరంగా వ్యవసాయ వర్శిటీకి డ్రోన్ పైలట్ల శిక్షణకు

అనుమతిని ఇచ్చింది.

దేశం లోనే ఈ లైసెన్సు పొందిన తొలి వర్శిటి ఎన్జీరంగా వ్యవసాయ వర్శిటీ.

ఫిఫా వరల్డ్ కప్ 2022

గల్ఫ్ ఖతర్ లో నవంబర్ 2022 ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం అయింది,32 జట్లలో ఈ ఫుట్ బాల్ వరల్డ్ కప్ ప్రారంభం అవుతుంది.

ఇప్పటి వరకు అన్ని ఫిఫా ప్రపంచ కప్ ఆడిన దేశం బ్రెజిల్

జర్మనీ 18 వరల్డ్ కప్పులు ఆడిన దేశంగా 2వస్థానం స్థానంలో ఉంది.

అర్జెంటినా 13 వరల్డ్కప్పులు ఆడిన దేశంగా 3 వ స్థానంలో ఉంది.

జన్యుమార్పిడి. ఆవాలపై సుప్రీంకోర్టు స్టే.

జన్యు మార్పిడి. ఆవాలపై సుప్రీం కోర్టు స్టే  విధించింది. 

మానవహక్కుల కార్యకర్త అరుణా రోడ్రిగ్స్ వేసిన పిటిషన్ కారణంగా సుప్రీం స్టే విధించింది.

నో యువర్ కస్టమర్

ఫేక్ ఐడీ కనెక్షన్ లు, సైబర్ నేరాలను అరికట్టేందుకు నో యువర్ కస్టమర్ పేరిట మరియు కాలర్ ఐడి కాలర్ పెరుతో మాత్రమే కాల్ వచ్చే విధంగా నో యువర్ కస్టమర్ పెరుతో టెలి కమ్యునికేషన్ వ్యవస్థ చర్యలు తీసుకుంటుంది.

ఎస్ ఐ ఎఫ్ టీ ఆక్యా ల్యాబ్ కు అంతర్జాతీయ గుర్తింపు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ  (స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ) (ఎస్ ఐ ఎఫ్ టీ)

రాష్ట్ర మత్స్య ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ లోని ల్యాబ్ కు అమెరికా కు చెందిన అరిజోనా యూనివర్సిటి రింగ్

టెస్ట్ లో ప్రతిభ కనబరిచింది.

రొయ్యలలో తెల్లమచ్చల వ్యాధి, ఎంట్రీ సైటో జూన్ హైపాటోపనై (ఈ హెచ్ పి) వ్యాధి కారకాలను నిర్ణీత కాల వ్యవధిలో అత్యంత సమర్థవంతంగా పరిక్షించి గుర్తించగలగడంలో ఎస్ ఐ ఎఫ్ టీలోని ఆక్వా ల్యాబ్ సమర్థవంతంగా నిర్వహించింది.

జపాన్ వేదికగా 30 వ మలబార్ యుద్ధ విన్యాసాలు

జపాన్ వేదిక గా నవంబర్ 10 న 30 వ మలబార్ యుద్ద విన్యాసాలు ప్రారంభమయ్యాయి.

ఈ విన్యాసాలను భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియం నౌకాదళాలు పాల్గొన్నాయి.

ఈ విన్యాసం నవంబర్  10 న ప్రారంభమై 15 న ముగుస్తాయి.

ఇండో పసిఫిక్ జలాలలో స్వేఛ్చ, ఓపెన్ న్యావిగేషన్ వ్యవస్థలను పరిరక్షించడం ఈ విన్యాసాల ఉద్దేశం.

ఈ విన్యాసంలో భారత నావికాదళం, యునైటెడ్ స్టేట్స్ నేవి (యు ఎస్ ఎన్), జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జేఎం ఎస్ డీఎఫ్), రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్ ఎ ఎన్) నౌకాదళం సంయుక్తంగా యుద్ధ విన్యాసాలను ప్రదర్శిస్తున్నాయి.

ఈ విన్యాసాలలో యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ ఆపరేషన్స్, క్రాస్ డెక్ ల్యాండింగ్స్, సిమ్యాన్ షిప్ విన్యాసాలు ప్రదర్శిస్తారు.

జపాన్ లోని యెకోసా సాగర తీరంలో ఈ విన్యాసాలు జరుగుతాయి.

ఈ విన్యాసాల లో భారత్ తరుపున కమోర్తా, శివాలిక్ యుద్ధ నౌకలు పాల్గొంటాయి.

మలబార్ యుద్ధ విన్యాసాల చరిత్ర

భారత్ - అమెరికా నౌకాదళాలు. 1992 లో సంయుక్తంగా సముద్ర జలాల్లో స్వేచ్చ, ఓపెన్ నేవిగేషన్ వ్యవస్థల ను రక్షించడం కోసం మలబార్ విన్యాసాలను ప్రారంభించాయి.

1992 నుంచి ప్రతి సంవత్సరం ఈ విన్యాసాలు కొన సాగుతున్నాయి.

2015 మలబార్ విన్యాసాలలోకి మూడవ దేశమైన జపాన్ చేరింది. 2020 లో రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ చేరడంతో 4 దేశాలు మలబార్ విన్యాసాలను నిర్వహిస్తున్నాయి.

ఈ నాలుగు  క్యాడ్ దేశాలు (భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) తో పాటు ఇతర దేశాలు  ఈ విన్యాసాలలో

పాలు పంచంకున్నా ఆహ్వానిస్తామని తెలియ జేశాయి.

బెంగళూరి వ్యవస్థాపకుడి 108 అడుగుల విగ్రహం

 బెంగళూరు నగర వ్యవస్థాపకుడు నాధ ప్రభు కెంపే గౌడ 108 అడుగుల విగ్రహాన్ని బెంగళూరు కెంపే గౌడ అంతర్జాతీయ విమనాశ్రయంలో  ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

218 టన్నుల బరువు గల కంట ఈ  కంచు విగ్రహాన్ని ప్రముఖ శిల్పి, పద్మభూషన్ రామ్ పాంజీ సుతార్ రూపొందించారు.

“భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలు” ప్రారంభం.

భారత్ గౌరవ పథకంలో భాగంగా భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును ప్రధాని మోదీ గారు. 11/11/2022 న ప్రారంభించారు.

రైల్వే శాఖ, కర్ణాటక ప్రభుత్వం సంయుక్తంగా ఈ రైలును నిర్వహిస్తారు. 

రాజీవ్ గాంధీ హత్యకేసు దోషుల విడుదల -

రాజీవ్ హత్య  కేసులో 30 సంవత్సరాలు గా శిక్ష అనుభవిస్తున్న దోషులను విడుదల చేయాలని సుప్రీం ఆదేశించింది.

దేశంలో మొట్ట మొదటి ప్రవేట్ సంస్థ రాకెట్ "విక్రమ్ - ఎన్”

దేశంలో మొట్ట మొదటి ప్రవేట్ రాకెట్ విక్రమ్-ఎన్ ను స్కైరూట్ సంస్థ రూపొందించింది.

అంకుర (స్టార్టప్) సంస్థ అయిన స్కైరూట్ ఏరో స్పేస్ యొక్క  రాకెట్ “ విక్రమ్ ఎన్" నవంబర్ 18 న

ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరి కోట ఇస్రో లాంచ్ పాడ్ నుంచి ఉదయం 11.30 కి ప్రయోగించారు.

ప్రారంభ మిషన్ లో రెండు భారతీయ, ఒక విదేశీ ఉపగ్రహాన్ని మొత్తం మూడు ఉపగ్రహాలను విక్రమ్-ఎన్ తీసుకెలుతుంది.

స్కెరూట్ ఏరో స్పెస్ హైదరాబాద్ కి చెందిన స్టార్టప్ సంస్థ.

ఈ సంస్థను విశాఖ కు చెందిన నాగ భారత్, హైదరాబాద్ కు చెందిన చందన్ పవన్ కుమార్ అనే ఇద్దరు తెలుగుయువకులు ప్రారంభించారు.

నాగభూషన్ ఈ సంస్థకు C.EO గా వ్యవహరిస్తున్నారు.

ఇస్రో యొక్క ఫ్లైట్ టెర్నినేషన్ సిస్టమ్ అగ్నికుల్ కాస్మోస్ కు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)  ప్రవేటు స్పెస్ సంస్థల ను ప్రోత్సహించేందుకు ప్రవేట్ సంస్థలకు విడి భాగాలను అందించి ప్రవేటు రాకెట్ ప్రయోగాలను పెంపొందించేందు కు ప్రోత్స హిస్తుంది.

చెన్నై లో స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ కు ఇన్ స్పేస్ మద్దతుతో ఫ్లైట్ టెర్నినేషన్ సిస్టమ్ (ఎఫ్ టీఎస్) ను అందజేసింది.

విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్, ఇన్ స్పేస్ బృందాలు. అగ్నికుల్ సంస్థకు చెందిన ప్రయోగ వాహనం అగ్నిబాన్ లో ఇంటర్ ఫేసింగ్, హ్యాండ్లింగ్ సిస్టమ్ లను ఉపయోగించడం కోసం అధికారికంగా అప్పగించింది.

భారత్ నిర్మిస్తోన్న ప్రవేటు లాంచింగ్ వెహికిల్స్‌కి ప్రోత్సాహకంగా రాకెట్ విడిభాగాలు అందించడం, ఫ్లైట్

టెర్నినేషన్ సిస్టం ను అందించడం దేశంలో ఇదే తొలిసారి.

దేశీయ మొట్టమొదటి ప్రవేట్ రాకెట్ నవంబర్ 18న ఉదయం 11.30 లకు నింగిలోకి విక్రమ్ - ఎన్ ప్రయోగించబడింది.

తిరుపతి జిల్లా సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించారు. 

ఈ రాకెట్ ద్వారా 3 అతి చిన్న పెలోడ్స్ ను స్పేస్ లోకి తీసుకెళ్లారు.

ఈ పెలోడ్స్ భూమి నుండి 100 నుంచి 120 కిలోమీటర్ల దూరంలో గల సబ్ ఆర్బిటాల్ నుంచి వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయి.

స్కైరూట్ ఎరోస్పేస్ సంస్థ రూపొందించిన 8 రాకెట్లు డాక్టర్ విక్రమ్ సారాబాయ్ పేరుతో విక్రమ్ - ఎన్ అనే పేరును నామకరణం చేశారు.

రాకెట్ బరువు 545 కేజీలు, ఆరు మీటర్ల ఎత్తు కలదు.

ఈ రాకెట్ ద్వారా స్పేస్ కిడ్జ్ అనే ఎరోస్పేస్ స్టార్టప్ సంస్థ యొక్క ఫన్ - శాట్ ను (2-5 kg) కక్షలోకి పంపారు.

ఐఐటి విద్యార్థులు, అమెరికా, సింగపూర్, ఇండోనేషియా విద్యార్థులు సంయుక్తంగా రూపొందించారు.

ఎన్. స్పేస్ టెక్(ఆంధ్రప్రదేశ్), ఆర్మేనియాకి చెందిన బజూమ్ క్వుస్పేస్ రీసెర్చ్ ల్యాబ్ కు చెందిన పెలోడ్లను ఈ రాకెట్ తీసుకెల్లింది.

జాతీయ అవార్డు పొందిన నిట్ అధ్యాపకుడు సందీప్.

2021-29 సంవత్సరానికి ఇంజనీరింగ్ విభాగంలో ఉత్తమ ప్రతిభా, పరిశోధనలకు ఇనిస్టిటూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా, (ఐఈ ఐ) 35 సంవత్సరాలలోపు ఇంజనీరింగ్ విభాగ శాస్త్ర వేత్తలకు జాతీయ ఉత్తమ  యువజన ఇంజనీరింగ్ అవార్డును  ఏపీ నీట్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఉద్దంటి సందీప్ అందుకున్నారు.

మధ్య ప్రదేశ్ లోని బలపూర్లో జరిగిన 37వ ఎలక్ట్రికల్ జాతీయ సమావేశంలో ఈ పురస్కారాన్ని మధ్య ప్రదేశ్ గవర్నర్ ముగు భాయ్ పటేల్ గారు సందీప్ కు బహుకరించారు.

బలవంతపు మత మార్పిడులు తీవ్రపరిణామం : సుప్రీం కోర్టు.

బలవంతపు మత మార్పిడులు, తీవ్రమైన అంశంగా అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

మోసపూరిత, భయపెట్టి, భాధపెట్టి, ప్రలోభపెట్టి చేసే మత

మార్పిడులను తీవ్రమైన అంశంగా భావించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుఆదేశించింది.

ఇది దేశ శాంతి భద్రత, సామరస్యానికి విఘాతం కలిగించే అంశం మరియు ఈ ప్రభావం ఇష్ట పూర్వక మతాన్ని స్వీకరించే వారిపై ఉంటుందని సుప్రీం వెల్లడించింది.

నవంబర్ - 17.

ప్రపంచ మూర్చ అవగాహణ దినోత్సవం.

బెంగాల్ గవర్నర్ గా ఆనంద్ బోస్

బెంగాల్ గవర్నర్ గా పని చేసిన ధన్ ఖడ్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం తో,

 ఆ రాష్ట్రానికి మణిపూర్ గవర్నర్  గణేషన్  తాత్కలిక గవర్నర్ గా పని చేస్తున్నారు.

అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా సివీ ఆనంద్ బోస్ ను నియమిస్తూ రాష్ట్ర పతి భవన్ నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఐ.ఎన్.ఎస్ సుకన్య కృష్ణ పట్టణానికి

నేవీ డే సందర్భంగా ఐ.ఎన్.ఎస్ సుకన్య కృష్ణ పట్టనానికి అధాని పోర్టులో దేశ ప్రజల అవగాహణ కోసం ప్రదర్శనకు ఉంచారు.

ప్రపంచంలో అతి ఎత్తెన శివుడి విగ్రహం : విశ్వాస స్వరూపం

రాజస్థాన్లోని ఉదయ్ పూర్ సమీప ప్రాంతం నాథ్ ద్వార వద్ద ప్రపంచం లోనే అతి ఎత్తైన శివుడి విగ్రహం విశ్వాస స్వరూపం ను ఏర్పాటు చేశారు, ఈ విశ్వాస స్వరూపం  ఎత్తు 369 అడుగులు.

ఈ శివుడు విగ్రహాన్ని తతే పదమ్ సంస్థానం రూపొందించింది.

3,000 టన్నుల ఉక్కు, ఇనుము, 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటు వినియోగించి విగ్రహాన్ని తయారు చేశారు, 2012లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించారు ఇది పూర్తవడానికి 12 సంవత్సరాలు పట్టింది.

 దీనిని రాజస్థాన్ ముఖ్యమంత్రి  అశోక గెహ్లాట్ ప్రారంభించారు.

సిఈ 20 ఇంజన్ పరిక్ష విజయవంతం.

ఎల్ వీఎం 3. ఎం3 రాకెట్ ప్రయోగానికి సంబంధించి క్రయోజనిక్ దశలో ఉపయొగపడే కొత్త ఇంజన్ ను (సీఈ -20) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తమిళనాడు మహేంద్రగిరి లోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (ఐపీ ఆర్ సీ) తో నిర్వహించిన పరిక్ష విజయవంతం అయింది.

వన్ వెబ్ కు చెందిన మరొక ప్రయోగం

2023  జనవరి లేదా ఫిబ్రవరిలో ఎల్ వీ ఎం3-ఎం3 రాకెట్ ద్వారా ప్రయోగించాలి. ఈ ఉపగ్రహం కి తక్కువ దూరంలో కక్ష్యలు ఉండడంతో క్రయోజనిక్ దశలో నింపే 25 టన్నుల ఇంధనం లో 5టన్నుల భారాన్ని, ఖర్చును తగ్గించేందుకు సిఈ -20 నూతన క్రయోజనిక్ ఇంజన్ను డిజైన్ చేశారు. దీనిని ఎల్ వీఎం 3 రాకెట్ కోసం. రూపొందించారు.

ఈ ప్రయోగంతో జీఎస్ ఎల్వీ మార్క్ 2 రాకెట్ ప్రయోగాలకు సీఈ 12·5, జీఎస్ ఎల్ వీ  మార్క్ 3 రాకెట్

ప్రయోగాలకు సీఈ - 25,ఎల్ వీ ఎం 3  వాణిజ్యప్రయోగాలకు సీఈ - 20 అనే మూడు రకాల క్రయోజనిక్ ఇంజన్లు అందు బాటు లోకి వచ్చాయి.

జిఎస్ ఎల్ వీ మార్క్ 2 : భూమి నుండి తక్కువ ఎత్తులో కక్ష్యలు 

జిఎస్ ఎల్ వీ మార్క్ 3 :భూమి నుండి ఎక్కువ ఎత్తులో కక్ష్యలు

ఎల్ వీ ఎం : వాణిజ్య ప్రయోగాలకు

ఐక్యరాజ్య సమితి భద్రతామండలి కౌంటర్  టెర్రరిజం కమిటీ సమావేశం

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కౌంటర్ - టెర్రరిజం కమిటి (సీటిసీ) సమావేశం ఢిల్లీలో జరుగుతుంది

ఆంధ్ర ప్రదేశ్ బోధనాసుపత్రులలో కాంప్రెహెన్సివ్ క్యాన్సర్ కేర్ క్యాన్సర్ రోగులకు వైద్యం అందించడం కోసం. ప్రభుత్వ భోధన ఆసుపత్రులలో కాంప్రెహెన్సివ్ క్యాన్సర్ కేర్ ను ప్రారంభించింది.

దీనికోసం తొలి దశలలో 119.58 కోట్లతో 7ఆసుపత్రులలో కాంప్రెహెన్సివ్ క్యాన్సర్ కేర్ ను ప్రారంభించింది.

అనంతపురం, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకులం, కాకినాడ, చినకాకాని లో  క్యాన్సర్ చికిత్సా సంబంధ పరికరాలు ఏర్పాటు చేస్తారు.

ఇందులో భాగంగా ఆపరేషన్ థియెటర్లు, పాథాలజి యనిట్లు, లినాక్  క్యాన్సర్ చికిత్సకు అవసరమైనఏర్పాట్లు చేస్తారు.

ఎన్జీరంగా వర్శిటీకి వ్యవసాయ డ్రోన్ పైలెట్ శిక్షణకు డీజి.సిఏ అనుమతి

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజిసిఎ), ఎన్జీరంగా వ్యవసాయ వర్శిటీకి డ్రోన్ పైలట్ల శిక్షణకు

అనుమతిని ఇచ్చింది.

దేశం లోనే ఈ లైసెన్సు పొందిన తొలి వర్శిటి ఎన్జీరంగా వ్యవసాయ వర్శిటీ.

ఇండియా అగ్రి బిజినెస్ అవార్డు : ఆంధ్ర ప్రదేశ్ సీడ్ కు

ఆంధ్ర ప్రదేశ్ విత్తన అభివృద్ధి సంస్థల సేవలకి గాను ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ గుర్తించి యొక్క

విత్తనాల పంపిణి విభాగంలో ఇండియా అగ్రి బిజినెస్ అవార్డు కి ఎంపికైంది.

ఏపి సిడ్స్ మే వేజింగ్ డైరెక్టర్ శేఖర్ బాబు అవార్డును స్వీకరించనున్నారు.

అంతరిక్షం లో పునరుత్పత్తి అధ్యయనానికి కోతులను పంపుతున్న చైనా

అంతరిక్షంలో పునరుత్పత్తి అధ్యయనానికి చైనా కోతులను పంపుతుంది.

చైనా నిర్మించుకున్న స్పేస్ స్టేషన్  తియాంగాంగ్ లోని వెంటియన్ మాడ్యుల్ లోకి కోతులను పంపి ఈ పరిశోధనలు చేస్తారు.

విద్యలో ఆంధ్రప్రదేశ్ కు లెవల్ -2 ర్యాంక్

కేంద్ర విద్యాశాఖ పాఠశాల విద్యా, అక్షరాస్యత విభాగం (పి.జి.ఐ) విడుదల చేసిన విభాగాల్లో ఆంధ్ర ప్రదేశ్ లెవల్ -2 సాధించింది.

విద్యా ప్రయాణాల కల్పనలో ప్రథమ స్థానంలో గల ఏడు రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది.

ఇందులో ఆంధ్రప్రదేశ్ తో పాటు కేరళ, పంజాబ్, చండీఘర్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ లు 

లెవల్ 2 లో నిలిచాయి. అయితే ఏ రాష్ట్రము లెవల్-1 కు చేరుకోలేదు. 

1000 పాయింట్లకు గాను 900 - 950 పాయిట్లు గల రాష్ట్రాలు లెవల్ -2 లో ఉంటాయి. 900 -950 పాయింట్లకు పైనగల రాష్ట్రాలు లెవల్ -1 లో ఉంటాయి 

వివిధ అంశాల వారిగా ఈ పాయింట్లు నిర్ణయిస్తారు 

ఆంధ్ర ప్రదేశ్ పాయింట్ల వివరాలు :

లెర్నింగ్ అవుట్ కమ్ క్యాలిటి  = 154/180

విద్యార్థుల ఎన్ రోల్ మెంట్ రేషియో = 77/80

మాలిక సదుపాయాలు = 127/150

సమానత్యం = 210/250

యజమాణ్యం = 334/360

ఈ నివేదక 20-21 విద్యాసంవత్స రానికి,

2017 - 2019 -వరకు లెవర్-6 లో ఆంధ్ర ప్రదేశ్ ఉన్నది.

జన్యుమార్పిడి. ఆవాలపై సుప్రీంకోర్టు స్టే.

జన్యు మార్పిడి. ఆవాలపై సుప్రీం కోర్టు స్టే  విధించింది. 

మానవహక్కుల కార్యకర్త అరుణా రోడ్రిగ్స్ వేసిన పిటిషన్ కారణంగా సుప్రీం స్టే విధించింది.

నో యువర్ కస్టమర్

ఫేక్ ఐడీ కనెక్షన్ లు, సైబర్ నేరాలను అరికట్టేందుకు నో యువర్ కస్టమర్ పేరిట మరియు కాలర్ ఐడి కాలర్ పెరుతో మాత్రమే కాల్ వచ్చే విధంగా నో యువర్ కస్టమర్ పెరుతో టెలి కమ్యునికేషన్ వ్యవస్థ చర్యలు తీసుకుంటుంది.

ఎస్ ఐ ఎఫ్ టీ ఆక్యా ల్యాబ్ కు అంతర్జాతీయ గుర్తింపు.

రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ  (స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ) (ఎస్ ఐ ఎఫ్ టీ)

రాష్ట్ర మత్స్య ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ లోని ల్యాబ్ కు అమెరికా కు చెందిన అరిజోనా యూనివర్సిటి రింగ్

టెస్ట్ లో ప్రతిభ కనబరిచింది.

రొయ్యలలో తెల్లమచ్చల వ్యాధి, ఎంట్రీ సైటో జూన్ హైపాటోపనై (ఈ హెచ్ పి) వ్యాధి కారకాలను నిర్ణీత కాల వ్యవధిలో అత్యంత సమర్థవంతంగా పరిక్షించి గుర్తించగలగడంలో ఎస్ ఐ ఎఫ్ టీలోని ఆక్వా ల్యాబ్ సమర్థవంతంగా నిర్వహించింది.

జపాన్ వేదికగా 30 వ మలబార్ యుద్ధ విన్యాసాలు

జపాన్ వేదిక గా 30 వ మలబార్ యుద్ద విన్యాసాలు ప్రారంభమయ్యాయి.

నవంబర్ 10 న

ఈ విన్యాసాలను భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియం నౌకాదళాలు పాల్గొన్నాయి.

ఈ విన్యాసం నవంబర్  10 న ప్రారంభమై 15 న ముగుస్తాయి.

ఇండో పసిఫిక్ జలాలలో స్వేఛ్చ, ఓపెన్ న్యావిగేషన్ వ్యవస్థలను పరిరక్షించడం ఈ విన్యాసాల ఉద్దేశం.

ఈ విన్యాసంలో భారత నావికాదళం, యునైటెడ్ స్టేట్స్ నేవి (యు ఎస్ ఎన్), జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జేఎం ఎస్ డీఎఫ్), రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్ ఎ ఎన్) నౌకాదళం సంయుక్తంగా యుద్ధ విన్యాసాలను ప్రదర్శిస్తున్నాయి.

ఈ విన్యాసాలలో యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ ఆపరేషన్స్, క్రాస్ డెక్ ల్యాండింగ్స్, సిమ్యాన్ షిప్ విన్యాసాలు ప్రదర్శిస్తారు.

జపాన్ లోని యెకోసా సాగర తీరంలో ఈ విన్యాసాలు జరుగుతాయి.

ఈ విన్యాసాల లో భారత్ తరుపున కమోర్తా, శివాలిక్ యుద్ధ నౌకలు పాల్గొంటాయి.

మలబార్ యుద్ధ విన్యాసాల చరిత్ర

భారత్ - అమెరికా నౌకాదళాలు. 1992 లో సంయుక్తంగా సముద్ర జలాల్లో స్వేచ్చ, ఓపెన్ నేవిగేషన్ వ్యవస్థల ను రక్షించడం కోసం మలబార్ విన్యాసాలను ప్రారంభించాయి.

1992 నుంచి ప్రతి సంవత్సరం ఈ విన్యాసాలు కొన సాగుతున్నాయి.

2015 మలబార్ విన్యాసాలలోకి మూడవ దేశమైన జపాన్ చేరింది. 2020 లో రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ చేరడంతో 4 దేశాలు మలబార్ విన్యాసాలను నిర్వహిస్తున్నాయి.

ఈ నాలుగు  క్యాడ్ దేశాలు (భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) తో పాటు ఇతర దేశాలు  ఈ విన్యాసాలలో

పాలు పంచంకున్నా ఆహ్వానిస్తామని తెలియ జేశాయి.

బెంగళూరి వ్యవస్థాపకుడి 108 అడుగుల విగ్రహం

 బెంగళూరు నగర వ్యవస్థాపకుడు నాధ ప్రభు కెంపే గౌడ 108 అడుగుల విగ్రహాన్ని బెంగళూరు కెంపే గౌడ అంతర్జాతీయ విమనాశ్రయంలో  ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

218 టన్నుల బరువు గల కంట ఈ  కంచు విగ్రహాన్ని ప్రముఖ శిల్పి, పద్మభూషన్ రామ్ పాంజీ సుతార్ రూపొందించారు.

“భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలు” ప్రారంభం.

భారత్ గౌరవ పథకంలో భాగంగా భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును ప్రధాని మోదీ గారు. 11/11/2022 న ప్రారంభించారు.

రైల్వే శాఖ, కర్ణాటక ప్రభుత్వం సంయుక్తంగా ఈ రైలును నిర్వహిస్తారు. 

రాజీవ్ గాంధీ హత్యకేసు దోషుల విడుదల -

రాజీవ్ హత్య  కేసులో 30 సంవత్సరాలు గా శిక్ష అనుభవిస్తున్న దోషులను విడుదల చేయాలని సుప్రీం ఆదేశించింది.

దేశంలో మొట్ట మొదటి ప్రవేట్ సంస్థ రాకెట్ "విక్రమ్ - ఎన్”

దేశంలో మొట్ట మొదటి ప్రవేట్ రాకెట్ విక్రమ్-ఎన్ ను స్కైరూట్ సంస్థ రూపొందించింది.

అంకుర (స్టార్టప్) సంస్థ అయిన స్కైరూట్ ఏరో స్పేస్ యొక్క  రాకెట్ “ విక్రమ్ ఎన్" నవంబర్ 18 న

ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరి కోట ఇస్రో లాంచ్ పాడ్ నుంచి ఉదయం 11.30 కి ప్రయోగించారు.

ప్రారంభ మిషన్ లో రెండు భారతీయ, ఒక విదేశీ ఉపగ్రహాన్ని మొత్తం మూడు ఉపగ్రహాలను విక్రమ్-ఎన్ తీసుకెలుతుంది.

స్కెరూట్ ఏరో స్పెస్ హైదరాబాద్ కి చెందిన స్టార్టప్ సంస్థ.

ఈ సంస్థను విశాఖ కు చెందిన నాగ భారత్, హైదరాబాద్ కు చెందిన చందన్ పవన్ కుమార్ అనే ఇద్దరు తెలుగుయువకులు ప్రారంభించారు.

నాగభూషన్ ఈ సంస్థకు C.EO గా వ్యవహరిస్తున్నారు.

ఇస్రో యొక్క ఫ్లైట్ టెర్నినేషన్ సిస్టమ్ అగ్నికుల్ కాస్మోస్ కు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)  ప్రవేటు స్పెస్ సంస్థల ను ప్రోత్సహించేందుకు ప్రవేట్ సంస్థలకు విడి భాగాలను అందించి ప్రవేటు రాకెట్ ప్రయోగాలను పెంపొందించేందు కు ప్రోత్స హిస్తుంది.

చెన్నై లో స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ కు ఇన్ స్పేస్ మద్దతుతో ఫ్లైట్ టెర్నినేషన్ సిస్టమ్ (ఎఫ్ టీఎస్) ను అందజేసింది.

విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్, ఇన్ స్పేస్ బృందాలు. అగ్నికుల్ సంస్థకు చెందిన ప్రయోగ వాహనం అగ్నిబాన్ లో ఇంటర్ ఫేసింగ్, హ్యాండ్లింగ్ సిస్టమ్ లను ఉపయోగించడం కోసం అధికారికంగా అప్పగించింది.

భారత్ నిర్మిస్తోన్న ప్రవేటు లాంచింగ్ వెహికిల్స్‌కి ప్రోత్సాహకంగా రాకెట్ విడిభాగాలు అందించడం, ఫ్లైట్

టెర్నినేషన్ సిస్టం ను అందించడం దేశంలో ఇదే తొలిసారి.

దేశీయ మొట్టమొదటి ప్రవేట్ రాకెట్ నవంబర్ 18న ఉదయం 11.30 లకు నింగిలోకి విక్రమ్ - ఎన్ ప్రయోగించబడింది.

తిరుపతి జిల్లా సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించారు. 

ఈ రాకెట్ ద్వారా 3 అతి చిన్న పెలోడ్స్ స్పేస్ లోకి తీసుకెళ్లారు.

ఈ పెలోడ్స్ భూమి నుండి 100 నుంచి 120 కిలోమీటర్ల దూరంలో గల సబ్ ఆర్బిటాల్ నుంచి వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయి.

సైబరూట్ ఎర్ స్పేస్ సంస్థ రూపొందించిన 8 రాకెటు డాక్టర్ విక్రమ్ సారాబాయ్ పేరుతో విక్రమ్ - ఎన్

అనే పేరును నామకరణం చేశారు.

రాకెట్ బరువు 545 కేజీలు, ఆరు మీటర్ల ఎత్తు కలదు.

ఈ రాకెట్ ద్వారా స్పేస్ కిడ్జ్ అనే ఎరోస్పేస్ స్టార్టప్ సంస్థ యొక్క ఫన్ - శాట్ ను (2-5 kg) కక్షలోకి పంపారు

ఐఐటి విద్యార్థులు, అమెరికా, సింగపూర్, ఇండోనేషియా విద్యార్థులు సంయుక్తంగా రూపొందించారు.

ఎన్. స్పేస్ టెక్(ఆంధ్రప్రదేశ్), ఆర్మేనియాకి చెందిన బజూమ్ క్వుస్పేస్ రీసెర్చ్ ల్యాబ్ కు చెందిన పెలోడ్లను ఈ రాకెట్ తీసుకెల్లింది.

జాతీయ అవార్డు పొందిన నిట్ అధ్యాపకుడు సందీప్.

2021-29 సంవత్సరానికి ఇంజనీరింగ్ విభాగంలో ఉత్తమ ప్రతిభా, పరిశోధనలకు ఇనిస్టిటూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా, (ఐఈ ఐ) 35 సంవత్సరాలలోపు ఇంజనీరింగ్ విభాగ శాస్త్ర వేత్తలకు జాతీయ ఉత్తమ  యువజన ఇంజనీరింగ్ అవార్డును  ఏపీ నీట్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఉద్దంటి సందీప్ అందుకున్నారు.

మధ్య ప్రదేశ్ లోని బలపూర్లో జరిగిన 37వ ఎలక్ట్రికల్ జాతీయ సమావేశంలో ఈ పురస్కారాన్ని మధ్య ప్రదేశ్ గవర్నర్ ముగు భాయ్ పటేల్ గారు సందీప్ కు బహుకరించారు.

ఢిల్లీ వేదిక గా టెర్రర్ ఫండింగ్ పై అంతర్జాతీయ సదస్సు

టెర్రరిజం కి  సంబంధించి ఫండింగ్ ను అడ్డుకునేందుకు జరిగే మూడవ అంతర్జాతీయ సదస్సుకు ఢిల్లీ వేదిక కానుంది.

ఉగ్రవాదాని కి ఆర్థిక సాయాన్ని అడ్డుకోవడం, దేశాల మధ్య అవగాహన పెంపొందించే లక్ష్యాలతో ఈ సమావేశం జరుగుతుంది.

నొ మని ఫర్ టెర్రర్ " అంశం పై నవంబర్ 18, 19 తేదీల్లో 75 దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సదస్సులు చర్చలు జరుగుతాయి.

ఇన్వెస్ట్ మెంట్ బజార్.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్వెస్ట్ మెంట్ బజార్ ను 23 నవంబర్లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈ ఈ)

ఆద్వర్యంలో జరుగునున్నట్టు బీఈ ఈ  డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే తెలియజేశారు.

ఇంధన సామర్థ్యం ను పెంచడం కోసం ఈ సదస్సు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్

(ఏపీ ఎస్ ఈ సీఎం) ఆధ్వర్యంలో జరుగుతుంది.

G-20 శిఖరాగ్ర సమావేశం కోసం బాలికి మోది.

G20 శిఖరాగ్ర సమావేశం కోసం ఇండోనేషియా బాలికి చేరుకున్న ప్రధాని మోదీ.

విదేశీ విద్య అభ్యసన కోసం అమెరికా వెళ్తున్నా ఎక్కువ శాతం భారతీయులే : ఓపెన్ డోర్ సంస్థ

ఓపెన్ డోర్ సంస్థ 2022 నివేదికలో విద్య ను

అభ్యసించడానికి  అమెరికా వస్తున్న విద్యార్థులలో 21% భారతీయులేనని వెల్లడించింది.

ఆస్ట్రేలియా ఖండంలోనే అతిపెద్ద  పర్వతాన్ని అధిరోహించిన ఉమేష్ ఆచంట

ఆస్ట్రేలియా ఖండంలోనే అతిపెద్ద పర్వతమైన మౌంట్ కోజిస్కోను తూర్పుగోదావరి జిల్లా రాజ మహేంద్రవరం నగరానికి చెందిన టెన్నిస్ క్రీడా కారుడు, పర్వతారోహకుడు ఉమేష్ ఆచంట అధిరోహించారు.

బలవంతపు మత మార్పిడులు తీవ్రపరిణామం : సుప్రీం కోర్టు.

బలవంతపు మత మార్పిడులు, తీవ్రమైన అంశంగా అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

మోసపూరిత, భయపెట్టి, భాధపెట్టి, ప్రలోభపెట్టి చేసే మత

మార్పిడులను తీవ్రమైన అంశంగా భావించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుఆదేశించింది.

ఇది దేశ శాంతి భద్రత, సామరస్యానికి విఘాతం కలిగించే అంశం మరియు ఈ ప్రభావం ఇష్ట పూర్వక మతాన్ని స్వీకరించే వారిపై ఉంటుందని సుప్రీం వెల్లడించింది.

తెలుగు సినీ కధానాయకుడు మరణించారు.

తెలుగు సినిమా కథానాయకుడు సూపర్ స్టార్ కృష్ణ 15/11/22

ఉదయం  మరణించారు.

నవంబర్ - 17.

ప్రపంచ మూర్చ అవగాహణ దినోత్సవం.

నిక్సీ కేంద్రాలు విశాఖ, విజయవాడలో

నేషనల్ ఇంటర్నెట్ ఎక్ఛేంజీ ఆఫ్ ఇండియా (నిక్సీ) కేంద్రాలు విశాఖ, విజయవాడలో ఏర్పాటు చేయనున్నారు.

అమెరికా మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్ల మెజారిటి.

అమెరికా మధ్యంతర ఎన్నికలలో ప్రతిపక్ష రిపబ్లికన్లు మెజారిటి సాధించారు.

బెంగాల్ గవర్నర్ గా ఆనంద్ బోస్

బెంగాల్ గవర్నర్ గా పని చేసిన ధన్ ఖడ్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం తో,

 ఆ రాష్ట్రానికి మణిపూర్ గవర్నర్  గణేషన్  తాత్కలిక గవర్నర్ గా పని చేస్తున్నారు.

అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా సివీ ఆనంద్ బోస్ ను నియమిస్తూ రాష్ట్ర పతి భవన్ నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఐ.ఎన్.ఎస్ సుకన్య కృష్ణ పట్టణానికి

నేవీ డే సందర్భంగా ఐ.ఎన్.ఎస్ సుకన్య కృష్ణ పట్టనానికి

అధాని పోర్టులో దేశప్రజల అవగాహణ కోసం ప్రదర్శనకు ఉంచారు.

మలేరియా నివారణకు అలి స్పోరివిర్.

జవహార్ లాల్ యూనివర్సిటీ "సెంటర్ ఫర్ మాలిక్యూలార్ మెడిసిన్” పరిశోధకులు క్లోరోక్విన్ - రెసిస్టెంట్,

ఆర్ట్ మెసినిన్ రెసిస్టెంట్ మలేరియా కారకాలను అంత మొందించుటకు అలిస్పోరివిర్ ను కనిపెట్టారు

అవయవ మార్పిడి ప్రక్రియలో ఉపయోగించే సైక్లోస్పోరిన్-ఎ డ్రగ్ లో మార్పులు చేసి అలిప్పోరివిర్ ను

సృష్టించారు.

క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన తర్వాత అలిస్పోరివిర్ అందుబాటు లోకి వస్తుంది.

2021 లో మొట్ట మొదటి యాంటీ మలేరియా టీకా "మస్కిరిక్స్” కు డబ్ల్యూ .హెచ్. ఓ ఆమోదించింది.

"మస్కిరిక్స్” మొట్ట మొదటి యాంటీ మలేరియా టీకా !

COP-27 సదస్సు  "షెర్మ్ -ఎల్. షేక్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్”

వాతావరణ మార్పుల కారణంగా నష్ట పోయిన పేద దేశాలకోసం పరిహార నిధిని ఏర్పాటు చేయాలని

CoP - 27 సదస్సు నిర్ణయించింది. దీనిని  "షెర్మ్ -ఎల్. షేక్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్” గా వర్ణిస్తున్నారు.

శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించాలని కాప్-27 లో భారత్ పిలుపునిచ్చింది.

కాప్ -27 ఒకరోజు ఆలస్యంగా నవంబర్ -19 న ముగిసింది.

పి.యస్.ఎల్వీ సి - 54

పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పి.ఎస్.ఎల్.వి) సీ 54 ఉపగ్రహ నౌకను .తిరుపతి సతీస్ ధావన్ స్పేస్

సెంటర్ (షార్) నుంచి నవంబర 26 ఉదయం 11.56 గంటలకు ప్రయోగించనున్నారు.

ఈ ఉపగ్రహం ద్వారా భారతకు చెందిన ఓషన్ శాట్ -3 (ఈవో ఎస్ -06 ] మరియు తైబోల్ట్- 1, తైబోల్ట్- 2,

ఆనంద్, ఇండియా- భూటాన్ దేశాలు సంయుక్తంగా రూపొందించిన  అకా ఎ.ఎన్.ఎస్ -2 బీ, స్విట్జర్లాండ్

కు చెందిన ఆస్ట్రో కాస్ట్- 2 పేరుతో 4 ఉపగ్రహాలు కలిపి మొత్తం తొమ్మిది ఉపగ్రహాలు ఈ పిఎస్ ఎల్వీ సీ-54.

ద్వారా కక్ష లోకి ప్రవేశింపబడతాయి.

ఇండియా ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 గా చిరంజీవి

ఇండియా ఫిలిం పర్సనాటిటీ ఆఫ్ ద తెలుగు చలన చిత్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి ని ఎంపికచేసినట్టు

కేంద్ర సమాచార,ప్రసార శాఖ మంత్రి రాకూర్  ప్రకటించారు :

మాతృ భాషలో శాస్త్ర, సాంకేతిక పదాల అర్థాలు సిఎస్ టీటీ వెబ్సైట్ లో

 కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టర్మినాలజి ((సీ.ఎస్.టీ.టి) శాస్త్ర, సాంకేతిక, పదాలను

వెబ్సైట్, ఆప్ ద్వారా  అందుబాటులో ఉంచనుంది.

మెడిసిన్, లింగ్విస్టిక్స్, పబ్లిక్ పాలసి, ఫైనాన్స్, అగ్రి కల్చర్, ఇంజనీరింగ్ అంశాలకు సంబంధించిన

30,0,0000 పదాలను అందుబాటులో ఉంచనుంది.

ఏకాంస్ Shabd.education.gov.nic వెబ్సైట్ పదాలు అందుబాటులో ఉంటాయి.

కేంద్రం సీఎస్ టిటిని 1960 లో ఏర్పాటు చేసింది.

అరుణ్ గోయల్ కేంద్ర ఎన్నికల కమిషనర్ (ఈసీ) గా

 అరుణ్ గోయల్. నవంబర్ 21 న భాద్యతలు స్వీకరించారు.అరుణ్ గోయల్ 1985 పంజాబ్ కేడర్ రిటైర్డ్

ఐ. ఏ .ఎస్ అధికారి.

దీనికి ముందు గోయల్. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ కార్య దర్శిగా పనిచేశారు. 

అత్యవసర ఔషధాల జూబితాలో కరోనరీ స్టెంట్లు 

కరోనరీ స్టెంట్లను అత్యవసర ఔషధాల జాతీయ జాలితా ఎన్ఎల్ ఈ ఎం-2028 Jef కేంద్ర ఆరోగ్య శాఖ

చేర్చింది.

గగన్ యాన్ కోసం ప్యార చూట్ల పరిక్ష విజయవంతంఇస్రో, డిఆర్ డిపోతే కలిసి అంతరిక్ష యానవ సహిత

అంతరిక్ష కార్యక్రమం గగల్ యానా కోసం రూపొందించింన పార చట ప్రయోగం విజయవంతం అయింది.

చంద్రని దగ్గరకు నాసా ఓరియాన్.

నాసా ప్రయోగించిన ఓరియాన్ చంద్రున్ని చేరింది.

ఈ ఓరియన్ చంద్రుని వెనుక భాగం 128 కిలోమీటర్ల దగ్గరకి చేరింది.

ఆర్టెమిస్ రాకెట్ ద్వారా ఓరియానాను నాసా ప్రయోగించింది.

ఒరియాన్ లో మనుషులను పోలిన డమ్మీలను పంపారు.

చంద్రునిపై ఒరియన్ దిగకుండా దాదాపు వారం పాటు కక్ష్యలోనే గడుపుతుంది. 

అనంతరం డిసెంబర్11 న భూమి పైకి తిరిగి వస్తుంది.

ఐరాసా ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ " గా పూర్ణిమా

ఆతరించి పోతున్న హర్గిలా అనే పక్షి జాతిని కాపాడేందుకు చేస్తున్న కృషికి పూర్ణిమా దేవి బర్మన్ కు

ఐక్యరాజ్య సమితి ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు 2022 లభించింది.

ఈ పక్షి జాతిని కోసం “హర్గిలా ఆర్మీ” పేరుతో మహిళా గ్రూప్ ను తయారు చేశారు.

అటవీ జీవశాస్త్ర వేత్త అయిన పూర్ణిమా దేవి రెండు దశాబ్దాలుగా ఈ పక్షుల కోసం కృషి చేస్తుంది.

యునైటెడ్ నేషన్స్  ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రాం (యూఎన్ఎస్ఈజీ) ఈ అవార్డును పూర్ణిమా దేవి బర్మన్,

యూకే కి చెందిన పార్ధ దాస్ గుప్తా,పెరూ, లెబనాన్, కామెరున్ దేశాల ఉద్యమకాలకు ఈ అవార్డును

ప్రకటించింది. ఈ అవార్డును “గ్రీన్ ఆస్కార్” గా పిలుస్తారు.

పూర్ణిమ దేవి బర్మన్ అస్సాం రాష్ట్రానికి చెందిన మహిళ.

అంతరించిపోతున్న అరుదైన జాతుల బాధ్యతను చేపడుతున్న జూపార్కులు

తిరుపతి, జూ పార్కు -అడవి కోడి.

 విశాఖ పట్నం జూపార్కు : వైల్డ్ డాగ్.

. హైదరాబాద్ జూ పార్కు :మౌస్ డీర్. 

కేంద్ర జంతు సాధికారసంస్థ ఆతరించుపోతున్న ఈ జాతులను రక్షించే బాధ్యత వీటికి అప్పగించింది.

సుప్రీం కోర్టులో మరో 4 బెంచ్ లు.

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు లో మరో 4. బెంచ్ లు ఏర్పాటు చేశారు.

పన్నులు, భూసేకరణ, క్రిమినల్, వాహన ప్రమాదాలు క్లెయిమ్ ల విచారణ పై 4 బెంచ్ లను

సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది.

పండ్ల ఉత్పత్తిలో ఏపి మొదటిస్థానం

బత్తాయి, మామిడి, అరటి, బొప్పాయి పండ్ల ఉత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.

 రెండోస్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో ఉత్తర ప్రదేశ్ లు నిలిచాయి.

సుప్రీం కోర్టు ఆర్టీఐ పోర్టల్ ప్రారంభం

సమాచార హక్కు చట్టం (ఆర్జీఐ] పోర్టల్ ను సుప్రీంకోర్టు ప్రారంభించింది.

ఆర్టీఐ దరఖాస్తు ఫీజు ను మాస్టర్ /వీసా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ

ద్వారా చెల్లించ వచ్చు.

జయప్రదకు ఎన్టీఆర్ చలన చిత్ర పురస్కారం

ప్రముఖ నటి జయప్రదకు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం లభించింది.

యశ్యంత్ రావ్ చవాన్ జాతీయ అవార్డుకు విప్రో వ్యవస్థాపక చైర్మెన్ "అజీం ప్రేమ్ జీ

విప్రో వ్యవస్థాపక ఛైర్మెన్  అజీం ప్రేమ్ జీ ప్రతిష్టాత్మక యశ్యంత్ రావ్ చవాన్ జాతీయ అవార్డ్ కు

ఎంపికయ్యారు.

సీ సైడ్ సమ్మిట్ ఏపీ మెడ్ టెక్ జోన్ లో

ఏపీ మెడ్ టెక్ జోన్ విశాఖ వేదికగా “టిపుల్ ఎస్ హాలిడేస్” పేరుతో సీసైడ్ స్టార్టప్ సమ్మిట్ {అంతర్జాతీయ

సదస్సు} ను  ఫిబ్రవరి 12 నుంచి 18 వరకు నిర్వహిస్తుంది.

400 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరౌతారు.

రిటైల్ ఈ రూపాయి  డిసెంబర్ -1 నుండి.

హోల్‌సెల్ ఈ రుపాయి పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవడంతో డిజిటల్ రిటైల్ ఈ రూపాయి డిసెంబర్

1 నుండి 4 నగరాలలో పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుంది-

ఎయిర్ ఇండియా లో విస్తారా విలీనం

ఎయిర్ ఇండియాలోకి విస్తారా విలీనం అయింది.

 టాటా గ్రూప్ లో  ప్రస్తుతం ఎయిర్ ఇండియా , ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్,ఎయిర్ ఎషియా ఇండియా,

విస్తారా నాలుగు విమాన సంస్థలు ఉన్నాయి.

విస్తారా విలీనంతో సింగపూర్ ఎయిర్ లైన్స్ కు 25.1 శాతం వాటా ఎయిర్ ఇండియా లో దక్కుతుంది.

విస్తారాలో 51 శాతం టాటా గ్రూప్ కు, 49 శాతం సింగపూర్ ఎయిర్ లెన్స్ కు వాటాలు ఉన్నాయి.

“ధారావి" ప్రాజెక్టు అధాని గ్రూప్సుకు

“ధారావి" ప్రాజెక్టు అధాని గ్రూప్సుకు లభించింది.

ధారావిలో 2.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి నివసిస్తున్న వారికి గృహనిర్మాణ సౌకర్యాల ను

కల్పిస్తూ మొదట 5,069 కోట్లతో 6.5 లక్షల మందికి వసతులు పూర్తి చేయాలి.

ఈ ప్రాజెక్టు 20,000 కోట్ల తో 7 సంవత్స రాలలో   పూర్తి కానుంది. ఇందులో మిగిలిన స్థలంలో ని గృహాలను

అధిక ధరలకు విక్రయించుకోవచ్చు, వాణిజ్య స్థలం కూడా సంస్థకు అందుబాటులో ఉంటుంది.

ఏ ఏ ఏఐ ప్రెసిడెంట్ గా ప్రశాంత్ కుమార్.

అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియోషన్ ఆఫ్ ఇండియా (ఏ ఏ ఏఐ) ప్రెసిడెంట్ గా ప్రశాంత్ కుమార్

ఎన్నికయ్యారు. 

ప్రశాంత్ కుమార్ గ్రూప్ ఎం మీడియా (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ దక్షిణాసియా సీఈవో గా ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన అభివృద్ధి సంస్థ (రెడ్కో ] అవార్డులు

తెలంగాణ రాష్ట్రంలో ఇంధన పొదుపు పురస్కారాలను రెడ్కో ప్రధానం చేసింది.

వివిధ విభాగాలలో వివిధ సంస్థలు ఈ అవార్డులు పొందాయి.

ఇండస్ట్రీ విభాగం 

ఐటిసి : స్పేషల్ అవార్డు. 

మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్: గోల్డ్ అవార్డు.

గ్రాన్యులెస్ ఇండియా లిమిటెడ్ : సిల్వర్ అవార్డు 

ఎడ్యుకేషనల్ బిల్డింగ్ విభాగం.

వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ : గోల్డ్ అవార్డు.

విక్టోరియా మెమోరియల్ రెసిడెన్నియల్ స్కూల్ : సిల్వర్ అవార్డు,

ప్రభుత్వ బిల్డింగ్ విభాగం.

సంచాల భవన్ కం గోల్డ్ అవార్డు.!

లేఖ భవన్ సిల్వర్.

 కమర్షియల్ బిల్డింగ్ విభాగం.

జీఎంఆర్ : హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు : స్పెషల్. అవార్డు.

విప్రో లిమిటెడ్ : గోల్డ్ అవార్డు

రైల్వే స్టేషన్ బిల్డింగ్ విభాగం:

కాచిగూడ : గోల్డ్ అవార్డు.

సికింద్రాబాద్ : సిల్కర్ 

ట్రాన్స్ పోర్ట్ లో

జనగాం డిపోకు : గోల్డ్

ఫలక్ నామం డిపో : సిల్వర్.

నల్లగొండ మున్సిపాలిటి : గోల్డ్

జి హెచ్ ఎంసీకి : సిల్కర్ అవార్డు,

తెలుగు చలన చిత్ర నటుడు కైకాల సత్యనారాయణ మరణించారు.

తెలుగు చలన చిత్ర నటుడు కైకాల సత్యనారాయణ మరణించారు

23/12/2022 వేకువ జామున మరణించారు.

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచన్ అరెస్ట్.

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో ఎండీ చందా కొచర్ ను  సీబీఐ అరెస్ట్ చేసింది.

వీడియో కాన్ గ్రూప్ కు రుణాల్లో అవకతవకలు, మోసం ఆరోపనల కారణంగా అమెను అరెస్ట్ చ చేశారు.

 ఆమె భర్త దీపక్ కొచర్ను కూడా సీబీని అరెస్ట్ చేసింది.

తెలుగు చలన చిత్ర సీనియర్ నటుడు చలపతిరావు 25/12/2022 న మరణించారు.

వాయు తలం నుంచి బ్రహ్మోస్  ప్రయోగం విజయవంతం.

వాయు తలం నుంచి బ్రహ్మోస్ 

సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన బ్రహ్మాస్ క్షిపణి 400 మీటర్ల దూరంలో గల లక్ష్యాన్ని

ఛేదించింది.

బ్రహ్మాస్ గగన తలం నుండి  ఖచ్చితత్వంతో లక్ష్యాల ను  చేదించింది.

ఈ  ప్రయోగం తో వాయుతల లక్ష్యాల ను  చేదించడంలో వాయు సేనకు తమ సామర్ధ్యం పెరిగినట్టే.

హైవేపై విమాణాల ట్రయల్ రన్ విజయవంతం.

అత్యవసర పరిస్థితులలో జాతీయ రహదారులను, రన్ వేలుగా మార్చడం కోసం చేసిన తొలి ట్రయల్ రన్

విజయవంతం అయింది.

బాపట్ల జిల్లా కోరిశ పాడు సమీపంలోని హైవేపై విమాణాల తొలి  ట్రయల్ రన్ విజయురంతం అయింది.

ఈ ట్రయల్ రన్ పిచ్చుకల గుడిపాడు. రేణింగవరం గ్రామాల పొద్ద 16వ నంబర్ హైవే పై  4.1వ

కిలో మీటర్ల పొడవు, 33  మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసిన రన్ వేపై జరిగింది.

ఏర్పాటు చేసింది

సదరన్ ఎయిర్ కమాండ్. ఆద్వర్యంలో ఈ ట్రయల్ రన్ జరిగింది.

2021-22 స్థిరధరల ఆధారంగా రాష్ట్రాల జీఎస్ డీపీల  శాతం 

ఆంధ్రప్రదేశ్ = 11.43

.రాజస్థాన్ = 11.04

బీహార్ = 10.98

తెలంగాణ = 10.88

ఒడిశా = 10.19

మధ్య ప్రదేశ్ = 10.12 

హరియాణా =  9.80

కర్ణాటక =9.47

త్రిపుర = 8.69

సిక్కిం = 8.57

హిమాచల్ ప్రదేశ్ = 8.35

మేఘాలయ =  8·19

జార్ఘండ్  = 8.15

తమిళనాడు. = 7.99

కెరళ = 7.10

పంజాబ్. = 6.94

ఉత్తరాఖండ్ = 6.13

ఉత్తర ప్రదేశ్ = 4.24

కామెంట్‌లు లేవు: