ఆంధ్రప్రదేశ్ మాతృమరణాల నియంత్రనలో నాలుగవ స్థానం.
ఆంధ్ర ప్రదేశ్ సుస్థిరాభి వృద్ధి లక్ష్యాలలో భాగంగా మాతృ మరణాలను 2030 నాటికి 70 కి తగ్గించాలని లక్ష్యంగా ఏర్పరచుకుంది.
అయితే ఇప్పుడు 45 మాతృమరణాలతో ఆ లక్ష్యాన్ని పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ 2022 లోనే సాధించింది.
ఇందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు ఎంతగానో దోహాదపడ్డాయి.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు
* ఇన్ స్టిట్యూషన్ డెలివరీస్ ను (ఆస్పత్రుల్లో ప్రసవాలు) ను ప్రోత్సహించడం
* గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు [మాంటీ నేటల్ చెకప్స్ ] ( బిడ్డ ఎదుగుదల, తల్లి ఆరోగ్య పరీక్షలు)
* హైరిస్క్ గర్బిణీలను గుర్తించడం వారికి సురక్షిత ప్రసవాలు.
* పౌష్టిక ఆహారంతో రక్తహీనతను నివారించడం.
* వైద్యుల అందుబాటు పెంపొందించడంతో ఆంధ్రప్రదేశ్ ఈ లాక్ష్యాన్ని సాధించింది.
ఆంధ్ర ప్రదేశ్ పార్వతీపుర మన్యంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకి పరిపాలన అనుమతి
జిల్లా పునర్విభజనలో భాగంగా పార్వతీపుర మన్యం జిల్లా ఏర్పడింది.
అయితే ఈ జిల్లాకి మెడికల్ కాలేజీ లేక పోవడంతో ప్రభుత్వం 600 కోట్ల మెడికల్ కాలేజీని ఏర్పాటుకు పరిపాలన అనుమతిని ప్రభుత్వం మంజూరు చేసింది.
వైద్య విద్యా సంచాలకులకు కేంద్రానికి ప్రతిపాదన పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ 12 ఖేలో ఇండియా కేంద్రాలు : శాప్
ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఎండీ ఎన్. ప్రభాకర్ కొత్తగా 12 ఖేలో ఇండియ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇప్పటికి రాష్ట్రంలో 13 ఖేలో ఇండియా కేంద్రాలు ఉన్నాయి,రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల కోసం 12 ఖేలో ఇండియా కేంద్రాలకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది.
కొత్త కేంద్రాలు
ఖేలో ఇండియా కేంద్రం - ప్రాధాన్యత ఇచ్చే ఆట
అనకాపల్లి - బాక్సింగ్
భీమవరం - రైఫిల్ షూటింగ్
పార్వతీపురం - వెయిట్ లిఫ్టింగ్
రాజమహేంద్ర వరం - ఫుట్ బాల్
మచిలీ పట్నం - స్విమ్మింగ్
పుట్టపర్తి - జూడో
పాడేరు - రెజ్లింగ్
నంద్యాల - హాకి
రాయచోటి - ఫెన్సింగ్
చిత్తూరు - ఫెన్సింగ్
నల్లమల అడవుల్లో 350 సంవత్సరాల నాటి పురాతన బావి
నల్లమల అడవులలో 300 సంవత్సరాల నాటి పురాతన భావిని గుర్తించారు.
ఇది ఒంగోలు నుంచి నుంచి 109 కిలో మీటర్ల దూరంలో గల మైలచర్ల అటవీ గ్రామం లో ఉంది.
దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్ర ప్రదేశ్ కు మూడవ స్థానం
దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్ర ప్రదేశ్ దేశంలో మూడవ స్థానంలో నిలిచింది.
ఈ జాబితాని కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ప్రకటించింది.
తమిళనాడు1 వస్థానం, ఉత్తర ప్రదేశ్ 2 వస్థానం ఆంధ్రప్రదేశ్3వస్థానం, కర్ణాటకల 4వస్థానం, మహారాష్ట్ర 5వస్థానంలో ఉన్నాయి.
ఈ సంజీవని లో ఏపీ కి మొదటి స్థానం
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఉచిత టెలిమెడిసిన్ సర్వీస్ (ఈ -సంజీవని) ను
వినియోగించుకున్న వారిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మొదటి స్థానంలో ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులకు మోటర్ వాహనాలు
వికలాంగుల దినోత్సవం డిసెంబర్ - 3 న అర్హులైన విభిన్న ప్రతిభా వంతులకు మోటర్ వాహనాల పంపిణీ ప్రక్రియని ప్రారంభించారు.
ఏపి విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల సహాయ సంస్థ ఆద్వర్యంలో ఈ పంపిణీ ప్రక్రియ సాగుతుంది.
విశాఖ వేదికగా జీ-20 సదస్సులు
G-20 కూటమికి భారత్ ప్రస్తుతం అధ్యక్ష దేశంగా (1డిసెంబర్ 2022 నుంచి 30 నవంబర్ 2023 వరకు)
వ్యవహరిస్తున్నసందర్భంగా విశాఖ వేదికగా కొన్ని G - 20 సమావేశాలు జరుగుతాయి.
అధ్యక్ష హోదాలో ఉన్నంత కాలం G - 20 కి సంబంధించి దాదాపు 200 సదస్సులు 200 సదస్సులు భారతదేశం లో జరుగుతాయి.
ఇందులో దాదాపు 37 సమావేశాలు, సదస్సులు ఆంధ్ర ప్రదేశ్ విశాఖ నగరం వేదికగా జరుగుతాయి.
ఆంధ్ర ప్రదేశ్ కి జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు.
ఆంధ్ర ప్రదేశ్ కి జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు లభించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి టెన్నిస్ అకాడమీ ప్రారంభం.
గుంటూరు లోని బీఆర్ స్టేడియంలో అంతర్జా తీయ కోచింగ్ సామర్థ్యం, ఆధునిక, మాలిక వసతులతో టెన్నిస్ అకాడమిని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఏర్పాటు చేసింది.
బైజూన్ కంటెంట్ తో ట్యాబ్ లను అందజేసిన ప్రభుత్వం
బైజూన్ కంటెంట్ తో 1400 కోట్లతో 4.60 లక్షల విద్యార్థులు, 60 వేల ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ట్యాబ్ లు అందించింది.
8వ తరగతి విద్యార్థులకు ఈ ట్యాబ్ లను అందించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖకు అవార్డులు
అగ్రికల్చర్ టుడే గ్రూపు ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖకు బెస్ట్ పాలసీ లీడర్ షిప్ అవార్డు - 2022 ను రాష్ట్ర వ్యవసాయ శాఖ కు ప్రధానం చేసింది.
డాక్టర్ వైఎస్సార్ ఉద్యానవర్శిటి కి పరిశోధనల ప్రతిభాకు, ఉత్తమ విద్యాప్రమాణాలు పాటించినందుకు లీడర్ షిప్ అవార్డును అగ్రికల్చర్ టుడే గ్రూప్ నుండి పొందింది.
నావికా దళ దినోత్సవం - డిసెంబర్ 4
డిసెంబర్ 4 నావికాదళ దినోత్సవం గా జరుపుకుంటారు.
2022 నావికాదళ దినోత్సవాన్ని తూర్పునావికాదళ కేంద్రం విశాఖలో డిసెంబర్ 4 న నిర్వహించారు.
నావికాద దినోత్సావ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపతీ ముర్ము గారు, ముఖ్య అతిధిగా విశాఖ ఆర్కే బీచ్ కు విచ్చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ
ప్రభుత్వ పాఠశాలపై ను సీబీఎస్ఈ సిలబస్ అమలు మొదట పైలెట్ ప్రాజెక్టుగా 1000 పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి