international current affairs October 2022

 

అక్టోబర్ ఇంటర్నేషనల్ కరెంట్ ఎఫైర్స్  2022



క్రిమియా వంతెన పై భారీ పేలుడు

రష్యా ను క్రిమియాను కలిపే వంతెన పై భారీ పేలుడు సంభవించింది. దక్షిణ ఉక్రెయిన్ లో రష్యా బలగాలకు అవసరమైన యుద్ధ సామగ్రి రవాణా ఈ వంతెనపైనే సాగుతుంది, ఈ పెలుడు ఉక్రెయిన్ చర్యగా రష్యా భావిస్తుంది.

ఉక్రెయిన్ పై క్షిపణుల దాడి :

 ఉక్రెయిన్ - రష్యా యుద్ధం భీకరంగా  సాగుతుంది

సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులతో రష్యా దాడి చేస్తోంది.

క్రిమియా వంతెన ను పెల్చి నందుకు క్షిపణులతో దాడి చేస్తున్నట్లు  రష్యా ప్రకటించింది.


రష్యా విలీన రెఫరెండంను ఖండిస్తూ తీర్మాణం.

రష్యా విలీన రెఫరెండును ఖండిస్తు ఐక్యరాజ్య సమితి తీర్మాణం చేసింది.

 ఈ తీర్మాణం కి 145 దేశాలు అనుకూల ఓట్లు వేయగ రష్యా, బెలారస్, ఉత్తర కొరియా, సిరియా, నికరాగ్వా ఇలా 35 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి.

భారత్ తటస్థం :-

భారత్ ఈ ముసాయిదా తీర్మాణానికి తటస్థం అని ప్రకటించింది.

ఉక్రెయిన్, రష్యాలు చర్చల తో సమస్యను పరిష్కరించాలని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్ తెలిపారు.

రష్యా విలీన రెఫరెండం ఎమనగా 

ఉక్రెయిన్ లోని డోనెట్సక్, ఖెర్సన్, లూహాన్సక్, జపోరియం లను రష్యా రెఫరెండం ద్వారా తమ ప్రధాన భూ భాగంలో కలుపుకునేందుకు నిర్ణయం తీసుకుంది.

ఈ విలీనానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి తీర్మాణం చేసి ఆమోదించింది.


ఆస్ట్రేలియా వేదికగా ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అంటే డ్రైనేజీ.[ఐసీఐడి]


24 న ఇంటర్నేషనల్ కమిషన్ ఇన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ఐసీఐడి)

73 వ ఇంటర్నేషనల్ ఎగ్జికూటివ్ కౌన్సిల్ (ఐఈసి] ఆస్ట్రేలియా లోని అడి లైడ్ లో 3/అక్టోబర్ / 2022న ప్రారంభం అయ్యాయి.

ఆంధ్ర ప్రదేశ్ తరుపున ఈ కాంగ్రెస్ కు జలవనరుల శాఖ మంత్రి అంబంటి రా౦ బాబు నేతృత్వం లోని బృందం హాజరౌతుంది.

భారత్ వేదికగా 25వ ఐసిఐడి కాంగ్రెస్ 2023 లో  ఆంధ్ర ప్రదేశ్  విశాఖ పట్టణంలో నవంబర్ 1 నుంచి 8 వరకు నిర్వహించబడుతుంది.

ఈ సమావేశంలో 78 దేశాల ప్రతి నిధులు, శాస్త్రవేత్తలు పాల్గొంటారు.

జల భద్రత చేకూర్చడం, తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటలుసాగు చేసే అత్యాధునిక నీటి వినియోగ విధానాలను ఈ సమాఖ్య లో ప్రదర్శిస్తారు.


వీడియో గేమ్ ను అర్ధం చేసుకున్న ల్యాబ్ లోని మెదడు కణాలు

 ప్రయోగ శాలలో అభివృద్ధి చేసిన మెదడు కణాలు 1970 పొంగ్ కంప్యూటర్ వీడియోగేమ్ ను అర్ధం చేసుకుని ఆ గేమ్ కు అనుగుణంగా స్పందించాయి. 

పొంగ్ టెన్నిస్ క్రీడ లాంటింది.

ఆస్ట్రేలియాలోకి కార్టికల్ ల్యాబ్స్ శాస్త్రవేత్తలు కొత్తతరం బయోలాజికల్ కంప్యూటర్ చిప్స్ అభివృద్ధి కోసం మానవులు, ఎదగని ఎలుకల నుంచి దాదాపు 8,00,000 మెదడు కణాలను ల్యాబ్ లో పెంచుతూ ఈ ప్రయోగాన్నిచేశారు.

డిష్ బ్రెయిన్ గా పిలిచే ఈ మెదడు కణాల సముదాయం ను ఎలక్ట్రోడ్ వరుసలతోపై ఉంచినప్పుడు పోంగ్ వీడియోగేమ్ తగ్గట్టు స్పందించిందని పరిశోధకులలో ఒకరైన డాక్టర్ బ్రెడ్ కగాన్ తెలియ జేశారు.

ఇది కృత్రిమ జీవ మేధో పరిశోధనల్లో మొదటిది. ఈ తరహా పరిశోధనలు ప్రపంచ వ్యాప్తంగా ఇదే మొదటిది.

ఈ పరిశోధనలు మూర్చ, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం సమస్యలను మరింత అర్ధచేసుకునేందుకు, భవిష్యత్ ప్రయోగశాలలోనే కృత్రిమ మేథ శక్తి రూపకల్పనకు ఈ పరిశోధన ఫలితాలు మరింత గా ఉపయోగపడతాయి.

తదుపరి పరీక్షల్లో ఇథనాల్ సాయంతో మద్యం తాగిన మనిషి పనితీరు, ప్రవర్తనను గుర్తిస్తారని పరిశోధకులు తెలియజేశారు

ఈ పరిశోధన వివరాలు న్యూరాన్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.



రోహన్ బోపన్న జోడీ టైటిల్ సాధించారు


భారత టెన్నిస్ సీనియర్ స్టార్ రోహన్ బోపన్న తన కెరీర్‌లో 22వ డబుల్స్ టైటిల్  అవీవ్ ఎటిపి -250 టోర్నీ టైటిల్ సాధించారు.




అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ ఐ.హెచ్) కు :- ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా హర్మన్ ప్రీత్


అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ ఐ.హెచ్) కు :- ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా భారత హాకి వైస్ కెప్టెన్ హర్మన్

29.4 పాయిట్లతో ప్లేయర్  ఆఫ్ ద ఇయర్ గా హర్మన్ ప్రీత్ సింగ్ ఎన్నికయ్యారు.

గత సంవత్సరం కూడా ఇదే అవార్డుకు ఎన్నికయ్యారు

ఈ విధంగా వరుసగా ఎన్నికైన వారిలో హర్మన్ ప్రీత్ 4 గవ క్రీడాకారుడు




మనహక్కుల దూతగా, తొలి ఆసియా,తొలి భారతీయ, తొలి  దళిత మహిళ అశ్విని కె.పి.

ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ (యు.ఎన్.హెచ్.ఆ.సి)

తన ప్రత్యేక దూతగా  అశ్విని కె.పి ని నియమించింది.

ఈమె ఈ పదవి ? ఎన్నికైన (తొలి ఆసియా) తొలి భారతీయ, దళిత మహిళ. 

ఈ నియామకం కార్యకలాపాలను నమోదు చేయడం,జాతి వివక్ష, జాత్యహంకారం, దాని కార్యకలాపాలను నమోదు చేయడం,విదేశీయుల పట్ల ద్వేషం,

ఈ విషయాల పట్ల వివిధ దేశాలలో గల ధోరనుల గురించి స్వతంత్ర స్థాయిలో నివేదిస్తుంది.

అశ్విని కె.పి ప్రస్తుతం బెంగళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తుంది.


రోదసిలో లార్డ్ ఆఫ్ ద రింగ్స్ 

 జెమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా చిత్రీకరించిన చిత్రంలో రెండు నక్షత్రాలు ఒకదాని కొకటి దగ్గరగా చేరినప్పుడు వాటి వాయు ప్రవాహాల వల్ల ఏర్పడే అందరికి ధూళి వల్ల 17 వలయాలు కాంతి వంతంగా ఏర్పడుతున్నాయి.

ఈ నక్షత్రాలు భూమి నుండి 50 వేల కాంతి సంవత్సరాల దూరంలోఉన్నాయి. 

ఈ జంట తారలను వూల్ఫ్ - రామెట్ 140 గా వ్యవహరిస్తున్నారు.


తారల మరుభూమి గుర్తింపు.

వ్యోయోగాములు తొలిసారిగా పురాతన నక్షత్రాల తో కూడిన మరు భూమిని పాలపుంతలో ఒక మూలన గుర్తించారు.

లెక్కకు మిక్కిలి సంఖ్యలో మృత నక్షత్రాలు అక్కడున్నాయని ఇవి ఒక్కాక్కటిగా బ్లాక్ హోల్స్ కి మారుతున్నాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు

ఇవి మన పాలపుంత లోని ద్రవ్యరాశిలో మూడో వంతు ఇవి ఉన్నాయని శాస్త్ర వేత్తలు నిర్ధారించారు


మయన్మార్ ఉద్యమ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ కి మరో ఆరు సంవత్సరాల శిక్ష

మయన్మార్ ఉద్యమ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ కి 6 సంవత్సరాల జైలు శిక్ష పడింది. దీంతో ఆమెకు మొత్తం 26 సంవత్సరాల శిక్ష పడింది.

సైనిక  పాలకులు ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన సూకీ ప్రభుత్వాన్ని 2021 లో సైన్యం స్వాధీనం చేసుకొని ఆమెను, కీలక నేతలను జైలులో వేశారు.


నోబెల్ పురస్కారం 2022


రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం.

రసాయన శాస్త్ర విభాగ నోబెల్ పురస్కారం  కరోలిన్ ఆర్. బెర్టోజీ(అమెరికా), కె. బ్యారీ షార్ప్ లెస్(అమెరికా) మోర్టెన్ మెల్టాల్ (డెన్మార్క్) శాస్త్ర వేత్తలకు లభించింది.

క్లిక్ కెమిస్ట్రీ, బయో ఆర్థోగానల్ రియాక్షన్స్ లో చేసిన పరిశోధనలకు గాను నోబెల్ పురష్కార౦ లభించింది.

వీరు చేసిన ఈ పరిశోధనలు క్యాన్సర్ ఔషధం తయారీ, పాలిమర్స్ అధ్యయనం  మరియు  డిఎన్ ఏ మ్యాపింగ్ లో ఎంతగానో ఉపయోగపడతాయి.

ఈ అవార్డు గ్రహీతల బృందంలోని కె బ్యారీ షార్ప్ లెస్ 2001లో నోబెల్ బహుమతి పొందారు.

2 సార్లు నోబెల్ పొందిన వ్యక్తుల జాబితాలో 5 వ వ్యక్తి గా షార్ప్ రికార్డులలో నిలుస్తాడు.

కె బ్యారీ షార్ప్ లెస్ ప్రస్తుతం కాలిఫోర్నియా లోని స్క్రిప్స్ రిసర్చ్ సంస్థలో పరిశోధనలు చేస్తున్నారు.


ఇందులో మరొకరైన మోర్టెన్ మెల్టాల్ ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ కోపెన్ హగన్ లో పని చేస్తున్నారు.

క్లిక్ కెమిస్ట్రీలో విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తున్న కరోలిన్ ఆర్. బెర్టోజీ సాన్ ఫర్డ్ యూనివర్శిటీలో పనిచేస్తున్నారు.

ఆమె పరిశోధనలు క్లిక్ కెమిస్ట్రీ లో నవశకాన్ని ప్రారంభిస్తాయని నోబెల్ కమిటి ప్రసంసించింది.


పరిణామక్రమం, జన్యుక్రమ నమోదులో పరిశోధనలకు గాను వైద్యశాస్త్ర నోబెల్

మానవ పరిణామ క్రమంలో పరిశోధనలకు గాను వైద్యశాస్త్రంలో స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబోప్రతిష్టాత్మక వైద్యశాస్త్ర నోబెల్  బహుమతికి  ఎన్నికయ్యారు.


భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి ముగ్గురికి

భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి కి ముగ్గురు శాస్త్రవేత్తలు ఎన్నికయ్యారు.

క్వాంటం ఎంటాంగిల్మెంట్, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఫోటాన్ పై చేసిన పరిశోధనలో అలెన్ ఆస్పెక్ట్ (ఫ్రాన్స్), జాన్ ఎఫ్ క్లాసర్ (అమెరికా), అంటన్ జీలింగర్ (ఆస్ట్రియా) కు విడి విడిగా జరిపిన పరిశోధనలకు గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది నట్లు రాయల్ స్పీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.

ఈ క్యాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్  చేసిన పరిశోధనల వల్ల  సెన్సింగ్ టెక్నాలజీ లో విప్లవాత్మక మార్పులు  వస్తాయి.


నోబెల్ శాంతి బహుమతి : రష్యా, ఉక్రెయిన్ మానవ హక్కుల సంస్థలకు, అలెన్ బియాల్ యాస్కీకి


మానవ హక్కుల కోసం పోరాడు తున్న రష్యా, ఉక్రెయిన్ సంస్థలకు, అలెన్ బియాల్ యాస్కీ కి అత్యున్నత గౌరవం నోబెల్ కమిటి" ద్వారా దక్కింది.

ఇందులో బెలారస్ ఉద్యమ కారుడు అలెస్  బియాల్ యాస్కీ, రష్యా మానవ హక్కుల సంస్థ "మెమోరియల్” సంస్థకు, ఉక్రెయిన్ కు చెందిన “సెంటర్ ఫర్ సివిల్ లిబరీస్”  కు  సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ని నోబెల్ కమిటీ 7-10-2022 న ప్రకటించింది.

ప్రస్తుతం బియల్ యాస్కిన్ జైలులో ఉన్నారు.

సాహిత్యం లో ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నాకు నోబెల్ పురస్కారం.


అని ఎర్నా1999లో తన జీవితంలో జరిగిన స్వీయ అనుభవాన్ని నవలగా ఫ్రెంచ్ లో ఇవెన్మో పేరుతో రచించింది.

2000 వ సంవత్సరం లో ఈ నవల "హ్యాపెనింగ్ " పేరుతో ఇంగ్లీషులో అనువాదించబడింది.



ఆర్థిక నోబెల్ 2022 బ్యాంకులపై పరిశోధనలకు.


బ్యాంకులు అభివృద్ధి, బ్యాంకులపై పరిశోధనలకి గాను అమెరికా కు చెందిన బెన్ బెర్నాంకీ, డగ్లస్ డబ్ల్యూ, డైమండ్, ఫిలిప్ హెచ్- డైబేవిగ్ లకు సంయుక్తంగా ఆర్థిక్ నోబెల్ 2022 కి ఎన్నికయరు.

అమెరికా ఆర్థిక వ్యవస్థ కోసం  కృషి చేసినందుకు బెన్ బెర్నాంకీ కి ఆర్థిక నోబెల్ దక్కింది.


బెన్ బెర్నాంకీ అమెరిగా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ మాజీ ఛైర్మన్ అదేవిధంగా చి. అమెరికాకి చెందిన ఆర్థిక శాస్త్రవేత్తలు డగ్లస్ డబ్ల్యూ డైమండ్, ఫిలిప్ హెచ్. డైబేగ్ లకు బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలపై కీలక పరిశోధనలు చేసినందుకు ఆర్థికశాస్త్ర నోబెల్ దక్కింది.


నోబెల్ పురస్కారం 2022 గురించి పుార్తి సమాచారానికి click link పై క్లిక్ చేయండి




కామెంట్‌లు లేవు: