అక్టోబర్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ ఎఫైర్స్ 2022
ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్ మెంట్ కు సి.యం జగన్ ఆమోదం.
ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్ మెంట్ గడువు 2023 మార్చి 31 వరకు పొడగింపునకు ఆమోదం తెలిపినట్టు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి తెలియజేశారు.
మెడికల్ రీయింబర్స్ మెంట్ గడువు జులై 31 న ముగిసింది దీనిని మార్చి 31 2023 వరకు ప్రభుత్వం పొడిగించింది.
ఆంధ్రప్రదేశ్ లో ఏకలవ్య జాతీయ క్రీడలు
3వ జాతీయ ఏకలవ్య క్రీడలను విజయవాడ, గుంటూరు, ఏ.ఎన్ . యూ వేదికలుగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) పోటీలను నిర్వహిస్తున్నారు.
ఈ పోటీల కోసం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం , గుంటూరుబీ.ఆర్ స్టేడియం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, లయేలా కాలేజీ గ్రౌండ్స్ క్రీడా వేదికలుగా ఎన్నికయ్యాయి
గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో శాప్ ఈ జాతీయ టోర్నీని నిర్వహిస్తుంది.
న్యూ కోచింగ్ కాంప్లెక్స్ కు ఐ. ఎస్ .ఓ (ISO)సర్టిఫికెట్లు.
వాల్తేర్ రైల్వే డివిజన్ పరిదిలోని న్యూ కోచింగ్ కాంప్లెక్స్ కు ఐ. ఎస్ .ఓ (ISO)సర్టిఫికెట్లు,లభించాయి.
ఉత్తమ నిర్వహణ, భద్రత కు సర్టిఫికెట్లు, లభించాయి.
దివ్యాంగుల రిజర్వేషన్ ను 3 నుండి 4 శాతం పెంచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ13/10/22 ఉత్తర్వులు జారీచేశారు.
ఈ రిజర్వేషన్ పెంపునకు అనుగుణంగా ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ - 1996 లో సవరణలు చేయనున్నట్లు తెలిపారు.
వికలాంగుల హక్కుల చట్టం - 2016 లో సెక్షన్ 34 ప్రకారం
2020 ఫిబ్రవరి 19 న మహిళా శిశు సంక్షేమ,వికలాంగుల సంక్షేమశాఖ
, ప్రభుత్వ నియామకాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జర్మనీ, నార్వే అంబాసిడర్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నఅజాకా అమృత్ మహాత్సవ్ లో భాగంగా "అమృత్ సరోవర్” పథకంలో ఆంధ్ర ప్రదేశ్ 3 వ స్థానంలో నిలిచింది.
ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త నీటి చెరువుల తవ్వకం, పాత చెరువుల పునరుద్ధరణ, పునర్జీవం, వంటి కార్యక్రమాలను చేపట్టింది.
జర్మనీ, నార్వే అంబాసిడర్ల బృదం ఈ కార్యక్రమాలను పరిశీలించడం తో పాటు, భూగర్భ జలాలను పెంచడంలో ప్రభుత్వం చేపట్టిన పతకాలను కూడా పరిశీలించనున్నారు.
ఈ-ఫామ్ యప్ ను ప్రారంభించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.
రైతులకు ఆర్థికంగా లాభం కూర్చేందుకు,దళారీల మోసాలను అరికట్టేందుకు, రైతులు తమ పంటను అమ్ముకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ఫామ్ అప్లికేషన్ ను ప్రారంభించింది.
లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ఎందుకు : A .P హైకోర్ట్.
విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉన్న ప్పుడు ప్రవేటీకరణ ఎందుకని కేంద్రాన్ని హైకోర్ట్ ప్రశ్నించింది.
కేంద్రానికి హైకోర్టు ప్రశ్న స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉన్న సంస్థ ప్రవేటీకరన పై పున: పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.
నిర్వాసితులకు స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాల కల్పన పై దాఖలైన వ్యాజ్యం లో
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది.
ప్రవేటీకరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తు మాజీ IPS అధికారి లక్ష్మీనారాయణ హైకోర్టు లో పిల్ దాఖలు చేశారు.
ఈ విషయం పైనే మరో వ్యక్తి సువర్ణ రాజు కూడా పిల్ దాఖలు చేశారు.
ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్ మెంట్ అథారిటీ (ఆప్సడా).
ఏపీ ఆక్వా రంగ అభివృద్ధి కోసం ఆక్వా కల్చర్ డెవలప్ మెంట్ అథారిటీ (ఆప్సడా) చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చింది.
ఆక్వా రంగ కార్యకలాపాలు అన్ని ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.
ఫిడ్ ధరలు పెంచినా, రొయ్యల ధరలు తగ్గించినా అప్సడా చట్టం ప్రకారం చర్యలు తీసుకో భాడతామని ప్రభుత్వం తెలిపింది.
అవినీతి పరుల నిరోధానికి 14400.
అవినీతి నిరోధానికి 14400.యాప్ ను ప్రభుత్వం తీసుకు వచ్చిన ఏసీబీ మొబైల్ యాప్ ను 14400
అవినీతి పరుల ను నిరోధించేందుకు సామాన్యుడి ఆస్త్రంగా మారింది.
పైలెట్ ప్రాజెక్టుగా 14400 ఇది విజయవంతం కావడంతో దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం ప్రవేశ పెట్టింది
అవినీతి పరులపై ఈ ఆప్ ద్వారా విడియోలు, ఆడియో క్లిప్పులతో సహా పిర్యాధులు,చేయవచ్చు
ఆర్బికే సేవల సాంకేతికత ఇథియోపియ కి
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఇథియోపియా బృందం ఆర్బికే, సాంకేతికత, ల్యాబ్ టు ఫీల్డ్ కాన్సెప్ట్ ను ఇథియోపియా వ్యవసాయశాఖ మంత్రి అభినందించారు.
ప్రపంచం లో ఎక్కడా అమలు చేయని విధానాలను సాంకేతికత ఆర్బికే లో అమలు చేయడం అద్భుతం అన్నారు.
ఆర్టీకే సాంకేతికత ను తమ దేశంలో ఏర్పాటు చేయుటకు ప్రభుత్వ సహకారాన్ని ఆయన కోరారు.
యూ ఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ఆంధ్రప్రదేశ్ పర్యటన.
ఇటీవల యూ.ఎస్ కాన్సుల్ జనరల్ గా ఎన్నికైన జెన్నిఫర్ లార్సన్ బృందం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ పర్యటన కు వచ్చిన సందర్భంలో కలిసిన ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల వేదికగా చేసుకోమని కోరారు.
ఈ పర్యటనలో జీడీపి గ్రోత్ రేటు లో రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని ఆమె ప్రశంశించారు.
రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ తోను జెన్నిఫర్ లార్సన్ బృందం భేటీ అయ్యారు.
రాష్ట్రంలో ఆర్షణీయ పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని గవర్నర్ సూచించారు.
పరిశ్రమల కోసం ఏపీ ఐఐసీ బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఒప్పందం.
బ్యాంక్ ఆఫ్ బరోడా తో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తలకు ఉపయోగపడేలా ఏపీ ఐఐసీ ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందం పై ఏపీ ఐఐసీ ఎండీ భరత్ గుప్తా బ్యాంక్ ఆఫ్ బరోజు చీఫ్ జనరల్ మేనేజర్, జోనల్ హెడ్ మన్మోహన్ గుప్తాలు ఈ ఒప్పందం లో పాల్గొన్నారు.
ఆర్బికే సేవల సాంకేతికత ఇథియోపియ కి.
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఇథియోపియా బృందం ఆర్బికే, సాంకేతికత, ల్యాబ్ టు ఫీల్డ్ కాన్సెప్ట్ ను ఇథియోపియా వ్యవసాయశాఖ మంత్రి అభినందించారు.
ప్రపంచం లో ఎక్కడా అమలు చేయని విధానాలను సాంకేతికత ఆర్బికే లో అమలు చేయడం అద్భుతం అన్నారు.
ఆర్టీకే సాంకేతికత ను తమ దేశంలో ఏర్పాటు చేయుటకు ప్రభుత్వ సహకారాన్ని ఆయన కోరారు.
యూ ఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ఆంధ్రప్రదేశ్ పర్యటన.
ఇటీవల యూ.ఎస్ కాన్సుల్ జనరల్ గా ఎన్నికైన జెన్నిఫర్ లార్సన్ బృందం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ పర్యటన కు వచ్చిన సందర్భంలో కలిసిన ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల వేదికగా చేసుకోమని కోరారు.
ఈ పర్యటనలో జీడీపి గ్రోత్ రేటు లో రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని ఆమె ప్రశంశించారు.
రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ తోను జెన్నిఫర్ లార్సన్ బృందం భేటీ అయ్యారు.
రాష్ట్రంలో ఆర్షణీయ పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని గవర్నర్ సూచించారు.
ఆంధ్ర ప్రదేశ్ ఎం.బీ. బి.యస్, బీ.డి.యస్, బి-కేటగిరి సీట్లపై ఉత్తర్వులు:-
బి. కోటగిరి సీట్ల లో 85% సీట్లను రాష్ట్ర విదార్థులకు కేటాయిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ అభ్యసన, పరివర్తన సహాయ పథకం (సాల్ట్ ) .
ఉపాధ్యాయులలో వృత్తి పరంగా నైపుణ్యాలు పెంచడం కోసం అభ్యసన, పరివర్తన సహాయ పథకాల్ని (సాల్ట్)
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించి అమలులో భాగంగా సర్వేను పాఠశాల విద్యాశాఖ ప్రారంభించింది.
ఆరోగ్య శ్రీ చికిత్సలు పెంపు.
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ లో ప్రస్తుతం ఉన్న 2,4246 చికిత్స విధానాలు ఉండగా
మరో 808 విధానాలను చెర్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చికిత్సల సంఖ్య 3,254 కి పెంచింది.
రాయసీమ పరిశ్రమల కోసం నీటి తరలింపు ప్రాజెక్టు,
కర్నూలు ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుకు శ్రీశైలం బ్యాక్ వాటర్.
ఓర్వకల్లు కు శ్రీశైలం నుంచి ఒక టి.ఎం.సి. రూ 428 కోట్ల అంచనా వ్యయంతో నీటి తరలింపు.
వైఎస్సార్ జిల్లా కొప్పరి పారిశ్రామిక వాడకు బ్రహ్మ సాగర్ నుంచి 0.6 టి.ఎం.సి. నీరు 331 కోట్ల అంచనా వ్యయంతో నీటి తరలింపు.
రాయలసీమను పారిశ్రామిక సీమగా అభివృద్ది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ - ఇంప్లిమెంటేషన్ ట్రస్ (నికెడిట్) నిధులతో మల్టీ ప్రొడక్ట్ పార్కులుగా కొప్పర్తి, ఓర్వ కల్లు పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది.
వైఎస్సార్ పశు బీమా :-
వైఎస్సార్ పశుబీమా పథకాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.
ఈ పథకం క్రింద పెద్ద పశువులకు 15 వేల నుండి 30 వేలు చిన్న జీవాలకు 6 వేల వరకు పరిహారం :
వైఎస్సార్ పశు బీమా పథకం కింద చెల్లించే మొత్తం ప్రీమియంలో 80 శాతాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది
20 శాతం సన్న చిన్న కారు రైతులు చెల్లించాలి. దేశ ఆవులు, గేదెలు ఒక్కో దానికి ప్రభుత్వం 1924 చెల్లిస్తే, లబ్ధిదారులు రు 231, చెల్లించాలి.
ఎద్దులు, దున్న పోతులకు ప్రభుత్వం 578 చెల్లిస్తే లబ్ధిదారులు రు 116,మేకలు, గొర్రెలకు ప్రభుత్వం ఒక్కదానికి 185 భరిస్తే లబ్ధిదారులు రు 46, చెల్లించాలి.
ఈ పథకం ద్వారా రైతుల కు సహకరించే సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వ౦ నిర్ణయించింది.
బీమా చేయించేందు 50 రుల ప్రోత్సాహం, పోస్టు మార్టంకు, 125 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వనుంది.
అక్టోబర్ నెల చివరణ ఈ పథకం అమలు లోకి వస్తుంది. ఈ పథకం క్రింద ప్రభుత్వం
సంవత్సరానికి 110 కోట్ల వరకు ఖర్చు చేయదలచింది.
ఒంగోలు జాతి పునరుజ్జీవం కోసం దేశంలోనే తొలిసారిగా పిండ మార్పిడి ప్రక్రియ (ఈటిటీ)
అంతరించి పోతున్న ఒంగోలు జాతిని రక్షించడం కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
దేశంలోనే తొలి సారిగా పిండ మార్పిడి
ఎంబ్రియె ట్రాన్స్ ఫర్ టెక్నాలజీ )(ఈ టీటీ) ద్వారా ఈ జాతి పునరుత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది,
ఈ ప్రక్రియలో భాగంగా కృత్రిమ గర్భధారణ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ) ఐ.వీ.ఎఫ్ ద్వార పిండాలను ఉత్పత్తి చేసి వాటిని ఘనీభవింపజేసి నిల్వ చేస్తారు. తరువాత ఈ పిండాలను ఆవుల అద్దె గర్భాల్లో ప్రవేశ పెట్టి దూడలను అభివృద్ధి చేస్తారు.
ఈ ప్రక్రియను లాంఫాం ఐవీఎఫ్- ఈటీటీ ప్రయోగాల ద్వార అభివృద్ధి చేశారు.
ఇప్పటి వరకు 787 పిండాలను ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేశారు.
కర్నూలులో జ్యుడీషియన్ అకాడమి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కర్నూలులో జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి