నోబెల్ పురస్కారం 2022
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం.
రసాయన శాస్త్ర విభాగ నోబెల్ పురస్కారం కరోలిన్ ఆర్. బెర్టోజీ(అమెరికా), కె. బ్యారీ షార్ప్ లెస్(అమెరికా) మోర్టెన్ మెల్టాల్ (డెన్మార్క్) శాస్త్ర వేత్తలకు లభించింది.
క్లిక్ కెమిస్ట్రీ, బయో ఆర్థోగానల్ రియాక్షన్స్ లో చేసిన పరిశోధనలకు గాను నోబెల్ పురష్కార౦ లభించింది.
వీరు చేసిన ఈ పరిశోధనలు క్యాన్సర్ ఔషధం తయారీ, పాలిమర్స్ అధ్యయనం మరియు డిఎన్ ఏ మ్యాపింగ్ లో ఎంతగానో ఉపయోగపడతాయి.
ఈ అవార్డు గ్రహీతల బృందంలోని కె బ్యారీ షార్ప్ లెస్ 2001లో నోబెల్ బహుమతి పొందారు.
2 సార్లు నోబెల్ పొందిన వ్యక్తుల జాబితాలో 5 వ వ్యక్తి గా షార్ప్ రికార్డులలో నిలుస్తాడు.
కె బ్యారీ షార్ప్ లెస్ ప్రస్తుతం కాలిఫోర్నియా లోని స్క్రిప్స్ రిసర్చ్ సంస్థలో పరిశోధనలు చేస్తున్నారు.
ఇందులో మరొకరైన మోర్టెన్ మెల్టాల్ ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ కోపెన్ హగన్ లో పని చేస్తున్నారు.
క్లిక్ కెమిస్ట్రీలో విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తున్న కరోలిన్ ఆర్. బెర్టోజీ సాన్ ఫర్డ్ యూనివర్శిటీలో పనిచేస్తున్నారు.
ఆమె పరిశోధనలు క్లిక్ కెమిస్ట్రీ లో నవశకాన్ని ప్రారంభిస్తాయని నోబెల్ కమిటి ప్రసంసించింది.
పరిణామక్రమం, జన్యుక్రమ నమోదులో పరిశోధనలకు గాను వైద్యశాస్త్ర నోబెల్
మానవ పరిణామ క్రమంలో పరిశోధనలకు గాను వైద్యశాస్త్రంలో స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబోప్రతిష్టాత్మక వైద్యశాస్త్ర నోబెల్ బహుమతికి ఎన్నికయ్యారు.
ఆదిమ మానవులు( హోమోనిన్స్ ) కంటే ఆధునిక మానవులు భిన్నమని, జన్యుపరమైన భిన్నత్వంని
నియాండర్తల్స్, డెనీ సోవన్స్ వంటి హోమినిన్స్ జన్యువులని ఆధునిక మానవుల జన్యువులను సరిపోల్చి చూసి, తేడానుతెలియజేశారు. ఈ విధంగా తేడాను కనుగొనే నూతన సాంకేతను కూడా స్వాంటే పాబో కనుగొన్నారు.
స్వాంటే పాబో ఇప్పటి వరకు గుర్తించని ఆదిమజాతి డెనీ సోవన్ జాతిని కనుగొన్నందుకుమరియు నియాండెర్తల్ జన్యుక్రమాన్ని నమోదు చేయడంతో స్వాంటే పాబో నోబెల్ బహుమతికి ఎన్నికయ్యారు.
ప్రస్తుత హోమోసెఫియన్స్ ఆఫ్రికా నుంచి వలస వచ్చి వివిధ ప్రాంతాలలో విస్తరించారు.
అభివృద్ధి చేసిన సాయంతో దాదాపు అసాధ్య మనుకున్న నియాండెర్తల్ జన్యు క్రమ నమోదును 2010 లో పూర్తి చేశారు.
యూరోపియన్, ఆసియ కు చెందిన హోమోసేపియన్లలో 1-4 శాతం జన్యుక్రమం నియాండెర్తల్ జన్యువులతో పోలి ఉంది
స్వాంటే పాటో పరిశోధనల్లో అత్యంత కీలకమైనది డెనీ సోవన్స్ జాతిని గుర్తించడం.
సైబీరియా ప్రాంతంలోని ఓ గుహలో లభించిన 40 ఏళ్ళ క్రితం నాటి చేతివేలి ఎముక ఆధారంగా డి.ఎన్ .ఎ.
ని నమోదు చేసి నియం డెరైల్స్, హోమో సెఫియన్స్ తో పోల్చి చూసినప్పుడు అది ప్రత్యేకంగా ఉండటంతో కొత్త జాతి గా గుర్తించి ఈ కొత్తగా గుర్తించిన జాతికి డెనిసోవన్ అని పేరు పెట్టారు
డెనిసోవన్ యొక్క ఎముక మంచుతో కప్పబడి ఉండటం వల్ల డి.ఎన్.ఎ లో మార్పు రాక పోవటం వల్ల ఈ పరిశోధనలు సులభతరం అయింది.
హోమో సెపియన్లు ఆఫ్రికా నుంచి వలస వెళ్ళె సమయానికి యూరప్ పశ్చిమ ప్రాంతంలో నియాండర్తల్స్ తూర్పు ప్రాంతంలో డెనిపోవన్లు ఉండేవారని పరిశోధనల్లో స్పష్టమైంది.
భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి ముగ్గురికి
భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి కి ముగ్గురు శాస్త్రవేత్తలు ఎన్నికయ్యారు.
క్వాంటం ఎంటాంగిల్మెంట్, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఫోటాన్ పై చేసిన పరిశోధనలో అలెన్ ఆస్పెక్ట్ (ఫ్రాన్స్), జాన్ ఎఫ్ క్లాసర్ (అమెరికా), అంటన్ జీలింగర్ (ఆస్ట్రియా) కు విడి విడిగా జరిపిన పరిశోధనలకు గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది నట్లు రాయల్ స్పీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.
ఈ క్యాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసిన పరిశోధనల వల్ల సెన్సింగ్ టెక్నాలజీ లో విప్లవాత్మక మార్పులు వస్తాయి.
క్వాంటం ఎంటాంగిల్మెంట్
క్వాంటం ఎంటాంగిల్మెంట్ అంటే దూరంగా ఉన్న రెండు కణాలు ఒకే లక్షణాలను కలిగి వుండడం.
ఏదైనా కారణం చేత ఒక కణం లో మార్పు సంభవిస్తే వందల కిలోమీటర్ల దూరంగా ఉన్న కణం కూడా దానికి అనుగుణంగా స్పందిస్తుంది.
దీనివల్ల కాంతి యొక్క ఫోటాన్ల లోని ఒక కణం లో కలిగే మార్పుకు దూరంలో ఉన్న కణం స్పందిచడాన్ని ఈ శాస్త్రవేత్తలు వేరువేరుగా జరిపిన ప్రయోగాలలో గుర్తించారు.
ఈ శాస్త్ర వేత్తలు ఒకరి ప్రయోగాలను మరొకరు ఆధారం చేసుకొని పూర్తి స్థాయి క్వాంటం ఎంటాంగిల్మెంట్ ను నిరూపించారు.
2010 లో ఈ ముగ్గురు ఇజ్రాయిల్లో వూల్ఫ్ ప్రైజ్ సంయుక్తంగా గెలుచుకున్నారు.
నోబెల్ శాంతి బహుమతి : రష్యా, ఉక్రెయిన్ మానవ హక్కుల సంస్థలకు, అలెన్ బియాల్ యాస్కీ కి
మానవ హక్కుల కోసం పోరాడు తున్న రష్యా, ఉక్రెయిన్ సంస్థలకు, అలెన్ బియాల్ యాస్కీ కి అత్యున్నత గౌరవం నోబెల్ కమిటి" ద్వారా దక్కింది.
ఇందులో బెలారస్ ఉద్యమ కారుడు అలెస్ బియాల్ యాస్కీ, రష్యా మానవ హక్కుల సంస్థ "మెమోరియల్” సంస్థకు, ఉక్రెయిన్ కు చెందిన “సెంటర్ ఫర్ సివిల్ లిబరీస్” కు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ని నోబెల్ కమిటీ 7-10-2022 న ప్రకటించింది.
ప్రస్తుతం బియల్ యాస్కిన్ జైలులో ఉన్నారు.
నోబెల్ గ్రహీతల గురించి పూర్తిగా
అలెన్ జియాల్ యాస్కీ :
అలెస్ బియాల్ యాస్కీ రష్యాలోని వైర్చిపిల్లా 25/ సెప్టెంబర్ / 1962 న జన్మించారు.
1980 నుంచి బెలారస్ లో మానవ హక్కుల ఉద్యమంలో పాల్గోన్నారు.
1996 లో వియన్నా హ్యూమన్ రైట్స్ సెంటర్ ను స్థాపించారు.
2013 లో హవెల్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ అవార్డును పొందారు.
2020 లో రైట్ లవ్లీ హుడ్ అవార్డును గెలుచుకున్నారు.
14 జులై 2022 లో మానవ హక్కుల కోసం ప్రభుత్వానికి
వ్యతిరేఖంగా పని చేస్తున్న బియల్ యాష్కీ ని
పన్నులు ఎగవేశారన్న కారణంతో అరెస్టు చేశారు.
మానవ హక్కుల కోసం చేస్తున్న కృషికి నోబెల్ శాంతి బహుమతి బియాల్ యాస్కీ కి లభించింది.
బియల్ యాస్కీ ని విడుదల చేయాలని ఓలా బెరిట్ రీస్ - అండర్సన్ బెలారస్ పాలకులకు విజ్ఞప్తి చేశారు.
మెమోరియల్ సంస్థ :
1989 జనవరి 28న మెమోరియల్ సంస్థ న్యాయ సేవ కోసం ఏర్పాటైంది
కమ్యునిస్టు పాలనలో అణచి వేయబడుతున్న ప్రజలకు న్యాయ సేవ అందిచాలన్న ఉద్దేశంతో మెమోరియల్ సంస్థ ప్రారంభమైంది.
రష్యా రాజధాని మస్కా కేంద్రంగా ప్రధాన కార్యాలయం ఉన్న యెమోరియల్ సంస్థ రష్యాలో జరుగుతున్న మానవ హక్కుల విధ్వసం పై, రాజకీయ ఖైదీల స్థితిగతులపై సమాచారాన్ని ప్రపంచానికి తెలియజెప్పుతుంది.
మానవ హక్కులకు వ్యతిరేఖంగా చేసే సైనికుల చర్యలకు వ్యతిరేఖంగా పోరాడుతుంది.
మెమోరియల్ సంస్థ కు యాన్ రచిన్స్కీ బోర్డు చైర్మెన్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ సంస్థను ఏప్రిల్ 5 2022 న రష్యా ప్రభుత్వం మూసి వేసింది.అయిన మెమోరియల్ సంస్థ అనధికారంగా, కార్యకలాపాలు సాగిస్తుంది.
ఈ సంస్థకు నోబెల్ శాంతి శాంతి బహుమతి లభించింది.
సెంటర్ ఫర్ సివిల్ లిబర్టిస్ :
2007 లో ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పుటకు సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ స్థాపించ బడింది.
మానవ హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య, ఉద్యమాలను ప్రోత్సహించడం కోసం ఈ సంస్థ పోరాడు తుంది.
పౌర సమాజాన్ని బలోపేతం చేయడం ముఖ్య లక్ష్యంగా ఈ సంస్థ తన కార్యకలాపాలు సాగిస్తుంది.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం లో ఈ సంస్థ సాధారణ ప్రజలపై జరుగుతున్న నేరాలను గుర్తించి
ప్రపంచానికి తెలియజేయడం లో క్రియశీలకంగా వ్యవహరిస్తుంది.
యుద్ధానికి వ్యతిరేఖంగా మానవ హక్కుల పోరాటమే అసలైన ఆయుధం అని" సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్" భావిస్తుంది.
సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ ప్రధాన కార్యాలయం ఉక్రెయిన్ లోని కివ్(Kyiv)లో ఉంది.
దీనిని ఒలేక్ సాంద్ర మాట్విచ్యుక్ (oleksandra Matvichuk ) స్థాపించారు.
సాహిత్యం లో ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నాకు నోబెల్ పురస్కారం.
అని ఎర్నా1999లో తన జీవితంలో జరిగిన స్వీయ అనుభవాన్ని నవలగా ఫ్రెంచ్ లో ఇవెన్మో పేరుతో రచించింది.
2000 వ సంవత్సరం లో ఈ నవల "హ్యాపెనింగ్ " పేరుతో ఇంగ్లీషులో అనువాదించబడింది.
(ఇది తన స్వీయ అనుభవం తో చట్టానికి వ్యతిరేఖంగా ) ఈమే 'క్లీస్ట్ ఔట్ (1974) "షేమ్"(1997) 'గెటింగ్ లాస్ట్ (2001)
"ది ఇయర్స్” (2008), ప్రాన్స్ .సమాజం, లేని స్వంత అనుభవాలతో ఫ్రాన్స్ చరిత్రను తెలియజేసింది.
"ఎ గర్ల్స్ స్టోరి" (2016) ఎక్కువగా స్వీయ అనుభవాలను రచనలుగా రచించారు.
ఈ మే తన నవలల్లో పురుషాదిక్య సమాజాన్ని వ్యతిరేఖిస్తు, స్త్రీ పక్షపాతిగా, స్త్రీ సమాజంలో స్పూర్తిని నింపె విధంగా ఈమె నవలలు కొనసాగుతాయి.
'ద కరేజ్ అండ్ క్లినికల్ అకంటి" పేరుతో వ్యక్తి గత జ్ఞాపకశక్తి సంబంధించిన మూలలపై చేసిన రచనలకు గాను ఈ పురస్కారం లభించింది .
ఆర్థిక నోబెల్ 2022 బ్యాంకులపై పరిశోధనలకు.
బ్యాంకులు అభివృద్ధి, బ్యాంకులపై పరిశోధనలకి గాను అమెరికా కు చెందిన బెన్ బెర్నాంకీ, డగ్లస్ డబ్ల్యూ, డైమండ్, ఫిలిప్ హెచ్- డైబేవిగ్ లకు సంయుక్తంగా ఆర్థిక్ నోబెల్ 2022 కి ఎన్నికయరు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ కోసం కృషి చేసినందుకు బెన్ బెర్నాంకీ కి ఆర్థిక నోబెల్ దక్కింది.
బెన్ బెర్నాంకీ అమెరిగా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ మాజీ ఛైర్మన్ అదేవిధంగా చి. అమెరికాకి చెందిన ఆర్థిక శాస్త్రవేత్తలు డగ్లస్ డబ్ల్యూ డైమండ్, ఫిలిప్ హెచ్. డైబేగ్ లకు బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలపై కీలక పరిశోధనలు చేసినందుకు ఆర్థికశాస్త్ర నోబెల్ దక్కింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి