సతీష్ వయస్సు 8 సంవత్సరాల తర్వాత 35 సంవత్సరాలు అయిన 6 సంవత్సరాల క్రితం సతీష్ వయస్సు ఎంత?
సతీష్ ప్రస్తుత వయస్సు 35-8 = 27 సంలు
6 సంవత్సరాల క్రితం సతీష్ వయస్సు = 27 - 6 = 21 సంలు
(OR)
6 సంవత్సరాల క్రితం సతీష్ వయస్సు 35-8-6 = 21 సం.
రాజేష్, అతని తండ్రి వయస్పుల మొత్తం 84 సంవత్సరాలు రాజేష్ వయస్పు తండ్రి వయస్సు లో ⅖ వ వంతు అయిన రాజేష్ తండ్రి వయస్సును కనుగొనుము ?
రాజేష్ తండ్రి వయస్సు = X అనుకొనుము
రాజేష్ వయస్సు = ⅖ X
X + ⅖ X = 84
X ( 1 + ⅖ ) = 84
7/5 X = 84
7X = 84 * 5
X = 84*5 / 7
X = 12 * 5 = 60 సంవత్సరాలు
రాజేష్ తండ్రి వయస్సు = X = 12 * 5 = 60 సంవత్సరాలు
రాజేష్ వయస్సు = ⅖ X = ⅖ 60 = 2 * 12 = 24 సంవత్సరాలు
రాజేష్ తండ్రి వయస్సు = 60 సంవత్సరాలు
రాజేష్ వయస్సు = 24 సంవత్సరాలు
15సంవత్సరాల క్రితం కూతురి వయస్సు తల్లి వయస్సులో 25% తల్లి ప్రస్తుత వయస్సు 55 సంవత్సరాలు అయిన కూతురి వయస్సు ఎంత?
15సంవత్సరాల క్రితం తల్లి వయస్సు = 55 - 15 = 40 సంవత్సరాలు
కూతురి వయస్సు 40 సంవత్సరాలలో 25% అయిన
40 = 100%
25% = ?
25 *40 / 100 = 10 సంవత్సరాలు
లక్ష్మి తల్లి వయస్సు లక్ష్మీ ప్రస్తుత వయస్సు కి 3 రేట్లు మరియు లక్ష్మి అమ్మమ్మ వయస్సు లక్ష్మి తల్లి వయస్సు కి 2 రెట్ల 4 సంవత్సరాల క్రితం లక్ష్మి వయస్సు 6 సంవత్సరాలు అయిన లక్ష్మి అమ్మమ్మ ప్రస్తుత వయస్సు ఎంత?
లక్ష్మి ప్రస్తుత వయస్సు 6+4 = 10 సంవత్సరాలు
లక్ష్మి తల్లి ప్రస్తుత వయస్సు. = 10*3 = 30 సంవత్సరాలు
లక్ష్మీ అమ్మమ్మ ఉయస్ప: 60 సంవర్సరాలు.
కిరణ్, సతీష్, క్రిష్ణ వయస్సుల మొత్తం 50 సంవత్సరాలు అయిన 12 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల మొత్తం ఎంత?
ఇక్కడ మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కావున సంవత్సరాలను వ్యక్తుల సంఖ్యతో హెచ్చించాలి
12 * 3 = 36 సంవత్సరాలు
ప్రస్తుతం సంవత్సరాల మొత్తం = 50 సంవత్సరాలు
12 సంవత్సరాల తర్వాత వయస్సుల మొత్తం = 50 + 36 = 86 సంవత్సరాలు
క్రిష్ణ, కిరణ్ ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 3:2 మరియు వారి వయస్సుల మొత్తం 60 అయిన 8 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి ఎంత?
కిరణ్ ప్రస్తుత వయస్సు = 24
క్రిష్ణ, ప్రస్తుత వయస్సు = 60 - 24 = 36
8 సంవత్సరాల తర్వాత కిరణ్ వయస్సు = 24 +8 =32
8 సంవత్సరాల తర్వాత క్రిష్ణ, వయస్సు = 36 + 8 = 44
వారి వయస్సుల నిష్పత్తి = 44 : 32 = 11: 8
వయస్సుల నిష్పత్తి = 11: 8
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి