AGE (MEDIUM) 1

 సతీష్ వయస్సు 8 సంవత్సరాల తర్వాత 35 సంవత్సరాలు అయిన 6 సంవత్సరాల క్రితం సతీష్ వయస్సు ఎంత?


సతీష్ ప్రస్తుత వయస్సు 35-8 = 27 సంలు


6 సంవత్సరాల క్రితం  సతీష్ వయస్సు = 27 - 6 = 21 సంలు

  (OR)


6 సంవత్సరాల క్రితం సతీష్ వయస్సు 35-8-6 = 21 సం.


రాజేష్, అతని తండ్రి వయస్పుల మొత్తం 84 సంవత్సరాలు రాజేష్ వయస్పు  తండ్రి వయస్సు లో ⅖ వ వంతు అయిన రాజేష్ తండ్రి వయస్సును కనుగొనుము ? 


రాజేష్ తండ్రి వయస్సు  =  X అనుకొనుము


రాజేష్ వయస్సు = ⅖  X 


X + ⅖  X = 84


X ( 1 + ⅖ ) = 84


7/5 X = 84


7X = 84 * 5


X = 84*5 / 7 


X = 12 * 5 = 60 సంవత్సరాలు


రాజేష్ తండ్రి వయస్సు  = X = 12 * 5 = 60 సంవత్సరాలు


రాజేష్ వయస్సు = ⅖  X = ⅖ 60 = 2 * 12 = 24 సంవత్సరాలు


రాజేష్ తండ్రి వయస్సు  = 60 సంవత్సరాలు


రాజేష్ వయస్సు = 24 సంవత్సరాలు


15సంవత్సరాల క్రితం కూతురి వయస్సు తల్లి వయస్సులో 25% తల్లి ప్రస్తుత వయస్సు 55 సంవత్సరాలు అయిన కూతురి వయస్సు  ఎంత?


15సంవత్సరాల క్రితం తల్లి వయస్సు = 55 - 15 = 40 సంవత్సరాలు 


కూతురి వయస్సు 40 సంవత్సరాలలో 25% అయిన 


40 = 100%


25% = ?


25 *40 / 100 = 10 సంవత్సరాలు 


లక్ష్మి తల్లి వయస్సు లక్ష్మీ ప్రస్తుత వయస్సు కి 3 రేట్లు మరియు  లక్ష్మి అమ్మమ్మ వయస్సు లక్ష్మి తల్లి వయస్సు కి 2 రెట్ల 4 సంవత్సరాల క్రితం లక్ష్మి వయస్సు 6  సంవత్సరాలు అయిన లక్ష్మి అమ్మమ్మ ప్రస్తుత వయస్సు ఎంత?


లక్ష్మి ప్రస్తుత వయస్సు 6+4 = 10 సంవత్సరాలు 

లక్ష్మి తల్లి  ప్రస్తుత వయస్సు. = 10*3 = 30 సంవత్సరాలు

లక్ష్మీ అమ్మమ్మ ఉయస్ప: 60 సంవర్సరాలు.


కిరణ్, సతీష్, క్రిష్ణ వయస్సుల  మొత్తం 50 సంవత్సరాలు అయిన 12 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల మొత్తం ఎంత?


ఇక్కడ మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కావున సంవత్సరాలను వ్యక్తుల సంఖ్యతో హెచ్చించాలి

12 * 3 = 36  సంవత్సరాలు 

ప్రస్తుతం సంవత్సరాల మొత్తం = 50 సంవత్సరాలు 

12 సంవత్సరాల తర్వాత వయస్సుల  మొత్తం = 50 + 36 = 86 సంవత్సరాలు 


క్రిష్ణ, కిరణ్  ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 3:2 మరియు వారి వయస్సుల మొత్తం 60 అయిన  8 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి ఎంత?


కిరణ్  ప్రస్తుత వయస్సు = 24 

క్రిష్ణ,  ప్రస్తుత వయస్సు = 60 - 24 = 36 

8 సంవత్సరాల తర్వాత కిరణ్  వయస్సు = 24 +8 =32

8 సంవత్సరాల తర్వాత క్రిష్ణ,  వయస్సు =  36 +  8 = 44

వారి వయస్సుల నిష్పత్తి = 44 : 32 = 11: 8

వయస్సుల నిష్పత్తి =  11: 8

కామెంట్‌లు లేవు: