SEPTEMBER 2022 CURRENT AFFAIRS NATIONAL

జాతీయం
 భారత రక్షణ దళం :

మొట్టమొదటి పూర్తి స్వదేశీ విమాన వాహక యుద్ధనౌక  INS విక్రాంత్

(INDIAN NAVEL SHIP విక్రాంత్) నేడు భారత నౌకాదళంలో కి :

స్వదేశీ విమాన వాహకయుద్ధ నౌక INS విక్రాంత్  ను  భారత ప్రధాని శ్రీనరేంద్రమోడీ గారు (2-సెప్టెంబర్-2022) న  భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు.

కేరళలోని Cochin shipyard లో ఈ కార్యక్రమం జరిగింది .ఈ కార్యక్రమం లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్,కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ , కేరళ సీఎం పిన్నరయి విజయన్ మరి కొందరు ముఖ్యనేతలు పాల్గొన్నారు. 
INS విక్రాంత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి విమాన వాహక నౌక.

 ఈ సంఘటనతో భారతదేశం సొంతంగా విమాన వాహక యుద్ధ నౌక  ను తయారు చేసుకోగల  దేశాల జాబితాలో చేరింది.

 భారతదేశం తో కలిపి ఇప్పటివరకుయూ.ఎస్, యూ. కె, రష్యా, చైనా,ఫ్రాన్స్ ఆరు దేశాలు మాత్రమే ఈ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. 

2005 ఈ విమాన వాహక యుద్ధ నౌకనిర్మాణ ప్రతిపాదన జరిగింది 

 నేవీ అంతర్గత సంస్థ అయిన వార్ షిప్ డిజైన్ బ్యూరో (WDB) 2009 నుంచిపూర్తిస్థాయి నిర్మాణాన్ని మొదలు పెట్టి  13 సంవత్సరాల లో  పూర్తి చేశారు దీని నిర్మాణానికి20 వేల కోట్లు ఖర్చు చేశారు క్షిపని దాడిని తట్టుకునేలా దీనిని రూపొందించారు 

. INS విక్రాంత్ లో కొత్త నౌకాదళ చిహ్నం “నిషాన్ “ ను  భారత ప్రధాని ఎగురవేశారు.

నౌకా సామర్థ్యం 

34 యుద్ధ విమానాలు(కమోవ్ - 31, మిగ్ - 29 కె యుద్ధ విమానాలు,ఎల్.హెచ్ హెలికాప్టర్లు , ఎం.హెచ్ - 60 ఆర్ .సి .హాక్ మల్టీ రోల్) దేశీయంగా రూపొందించిన తేలికపాటి హెలికాప్టర్లుమోహరింప చేయవచ్చు,
 తొలిత  కొన్ని సంవత్సరాలు మిగ్ - 29 కె యుద్ధ విమానాలు మాత్రమే మోహరింప చేయనున్నారు.

INS విక్రాంత్ యొక్క
బరువు : 45,000 టన్నులు

పొడవు : 860 FEETS

వెడల్పు : 190 FEETS

 INS విక్రాంత్ కి ముందు :

INS విక్రాంత్ కిపూర్వం బ్రిటన్  కి చెందినహెర్క్యులిస్, హెర్మీ స్ లను భారతదేశం దిగుమతి చేసుకుని వాటికి  విక్రాంత్ (1961), విరాట్ (1987) గా  పేర్లు మార్చి నౌకాదళంలో లో చేర్చారు.
ఇవి ప్రస్తుతం పాత పడడంతో తొలగించబడ్డాయి ప్రస్తుతం 2013రష్యా నుంచి స్వీకరించబడ్డ విక్రమాదిత్య మాత్రమే విమాన వాహక  యుద్ధనౌక  INSవిక్రాంతి చేరికతో మరల విమాన వాహక యుద్ధ నౌకల సామర్థ్యం  రెండుకు చేరింది .

మూడో నౌక అవసరాన్ని గుర్తించి భారత్  2015 సంవత్సరంలోనే 65,000 టన్నులతో విశాల్ నౌకా తయారీని ప్రారంభించింది 
ఇది కూడా నౌకాదళంలో చేరితే మన సముద్ర జల హద్దులను పరిరక్షించుకోవడం ఇంకా సులభం అవుతుంది .
శివాజీ నౌకాదళం ప్రేరణతో నౌకా దళానికి కొత్త  చిహ్నం, కొత్త పతాకం 

చత్రపతి శివాజీ స్ఫూర్తితో నౌకాదళ కొత్త చిహ్నాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు బానిసత్వ జాడలను చేరిపేయాలి అన్న ఉద్దేశంతో కొత్త చిహ్నా ఆవిష్కరణ జరిగింది.
నీలం రంగు లో అష్టభుజి ఆకారంలో ఉన్న ఈ చిహ్నం లో బంగారు రంగు బోర్డర్ లు ఉన్నాయి .
చిహ్నం లోని అష్టభుజి ఆకారాన్ని ,బార్డర్ లైన్లను శివాజీ నౌకాదళ చిహ్నం నుంచి తీసుకున్నారు .

అష్టభుజి ఎనిమిది దిక్కులకు సూచిక అని అన్ని  దిక్కుల  వైపు నావికాదళం దుర్భేద్యమైనది అని ఈ చిత్రాన్ని డిజైన్ చేసినట్టు నావికాదళం తెలిపింది .

అష్టభుజి మధ్యభాగంలో నాలుగు సింహాల జాతీయ చిహ్నం,యాంగరు (లంగరు) గుర్తు ఉంచారు .

 చిహ్నం క్రింది భాగంలో నావికాదళం మోటో `”సం నో వరుణః “  రుర్వేదం నుంచి స్వీకరించారు.

దీని అర్థం వరుణ దేవుడా మాపై కరుణ చూపించు .




ఈ చిహ్నాన్ని ప్రధానమంత్రి   చత్రపతి శివాజీ కి అంకితమిచ్చారు .

నావికాదళం లోని కొత్త జెండా కు ఎడమవైపు పైభాగాన జాతీయ జెండా ను కుడివైపు కింది భాగాన
కొత్త చిహ్నాన్ని ఉంచారు
 
సైన్స్ అండ్ టెక్నాలజీ  :

సర్వైకల్ క్యాన్సర్ కు మొట్టమొదటి స్వదేశీ టీకా :  సీరమ్ 

 సీరమ్  ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సర్వైకల్ క్యాన్సర్ కు మొట్టమొదటి స్వదేశీ టీకా సెర్వ వ్యాక్ ను అభివృద్ధి చేసినట్టుప్రకటించింది.

 ఇది హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) కు  టీకా.

 టీకా 9-18వయస్సు బాలికలకు సమర్థవంతంగా పనిచేస్తుంది 
.పాపిలోమా వైరస్ వల్ల ఎక్కువమంది సర్వైకల్ క్యాన్సర్ కు గురవుతున్నారు.

కరోనా కు చుక్కల మందు టీకాను అభివృద్ధి  చేసిన :భారత్ బయోటెక్ 

ప్రముఖ సంస్థ భారత్ బయోటెక్ కరోనాకు ముక్కు ద్వారా తీసుకునే టీకా “ఇన్ కో వ్యాక్ “(BBV154) ను అభివృద్ధి చేసింది.

ఈ తరహా టీకా(వ్యాక్సిన్) ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి టీకా .దీనిని 2–8 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య నిల్వ ఉంచాలి.
ఈ టీకాను వాషింగ్టన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ రూపొందించింది

 
ప్రపంచంలో 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా : భారత్

BLUEBERGE  సంస్థ తన నివేదికలో ప్రపంచంలో 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా  భారత్ బ్రిటన్ ను వెనక్కి నెట్టి చేరిందని ప్రకటించింది

ఇందులో అమెరికా మొదటి స్థానం ,చైనారెండవ స్థానం, జపాన్   మూడవ స్థానం జర్మనీ నాలుగో స్థానంలో ఉన్నా యి.
 
రాజ్ పత్ పేరు ఇక :కర్తవ్య పత్ 

రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న రాజ్ పత్ పేరు  ను :కర్తవ్య పత్ గా మార్చారు 

రాజ్ పత్ ను :కర్తవ్య పత్ గా   మార్చడానికి  సంబంధించిన తీర్మానాన్ని న్యూఢిల్లీ నగరపాలక పరిషత్ (NDMC)7/9/2022 బుధవారం ఆమోదించింది

ప్రజా సాధికారతకు చిహ్నంగా నిలిచే పేరు కర్తవ్య పత్

బ్రిటిష్ పాలనలో రాజ్ పత్ ను కింగ్స్ వే  అని పిలిచేవారుకింగ్స్ వే బ్రిటిష్ కాలంలో దాదాపు50సంవత్సరాలు ఈ పేరుతో కొనసాగింది, ఈ పేరు బ్రిటిష్ వలస
పాలన గుర్తు చేస్తుంది
స్వాతంత్రం అనంతరం రాజ్ పత్ గా మార్చబడింది రాజ్ పత్ ఈ  పేరు రాచరికపు విధానాన్ని గుర్తు చేస్తుంది

కర్తవ్య పత్  బ్రిటిష్ వలసపాలనను, రాచరికపు వ్యవస్థ గుర్తులను చెరిపేస్తూ కర్తవ్యాన్ని గుర్తు చేసే
విధంగారాజ్ పత్ పేరును కర్తవ్య పత్ గా మార్చారు 

కర్తవ్య  పత్ 15.5 KM  పొడవు, ఇందులో ఒకేసారి1125 వాహనాలను పార్క్ చేయవచ్చు 

భారత ప్రధాని మోడీ 8 /9/2022 న కర్తవ్య  పత్ ను  ప్రారంభించారు 

సెంట్రల్ విస్టా అవెన్యూ ప్రాజెక్టులో భాగంగా నేతాజీ విగ్రహావిష్కరణ
 
ఆధునీకరించిన ఇండియా గేట్ ప్రాంగణంలో లో 28 అడుగుల ఎత్తు 65 టన్నుల బరుబరువు గల

ఏకశిలగ్రానైట్ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్నివిగ్రహాన్ని సెంట్రల్ విస్టా అవెన్యూ ప్రాజెక్టులో భాగంగాప్రధాని మోడీ గారు 8 /9/2022 న ఆవిష్కరించారు.

అరుణ్ యోగిరాజ్ నేతృత్వంలోని శిల్పుల బృందం నేతాజీ  విగ్రహాన్ని రూపొందించింది .

ఐక్యరాజ్య సమితి మానవ అభివృద్ధి సూచి లో 132వ స్థానంలో భారత్
 
2021 సంవత్సరానికి సంబంధించి మానవ అభివృద్ధి సూచి లో 191 దేశాల జాబితాలో భారత్ 
కు 132  వ స్థానం దక్కింది 

మానవ అభివృద్ధి విలువ 0.633

భారత్ లో సగటు ఆయుర్దాయం  67.2

భారతదేశంలోకి అడుగుపెట్టిన చిరుతలు.

భారతదేశంలో 1948 చిట్ట చివరి చిరుత మృత దేహాన్ని మధ్య  ప్రదేశ్ లో కనుగొన్నారు.
1948 - తరువాత భారం దేశంలో చిరుతల ఆనవాళ్ళు కనిపించలేదు..
 1952- లో భారత దేశం చిరుతలు అంతరించి పోయాయని అధికారికంగా  ప్రకటించింది.
భారతదేశం లో లేవడ్స్ 12,000 వరకు ఉన్నాయి వీటినే మనం వార్తల్లో చిరుతలు గా చూస్తుంటాము 
వాస్తవానికి  లెపర్ట్, చిరుతలు రెండు వేరు,
ఆజాది అమృత్ మహాత్సవ” సందర్భంగా "ప్రాజెక్ట్ చీత"  పేరుతో దక్షిణాఫ్రికా, నమీబియా తో చర్చలు జరిపి 8 చిరుతలను భారతదేశం దిగుమతి చేసుకుంటుంది
ఇందులో  లో 5  ఆడ చిరుతలు 3 మగ చిరుతలు ఈ చిరుతలను నవంబర్ -17న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్ లోని గ్యాలియర్ మహారాజ పుర వైమానిక స్థావరంలో చిరుతలును దించి భారత వైమానిక దళానికినికి చెందిన M17 హెలికాప్టర్లు  లో కునే  నేషనల్ పార్కు లో ప్రధాని నరేంద్ర మోడీ  విడుదల చేశారు. 
గ్యాలియర్ మహారాజ పుర వైమానిక స్థావరం లో  వీటికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతి ఆదిత్య  సిందియా స్వాగతం పలికారు.
  
నవంబర్ 26 న కొత్త పార్లమెంటు భవనం ప్రారంభం
జాతీయ రాజ్యoగ దివత్సవ సందర్భంగా నవంబర్-26 న కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించబోతున్నారు.
1949 నవయిర్ - 26న భారత రాజంగాన్ని ఆమోద ముద్ర పడింది. 
ఆ రాజుకు గుర్తుగా నవంబర్ 26న కొత్త పార్లమెంట్ ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది..

అస్థిత్వంలో లేని 86 రాజకీయ పార్టీల తోలగింపు .

అసిత్యంలో లేని86 రాజకీయ పార్టీల  కేందఎన్నికల సంఘం రద్దు చేసింది. 
క్రియా శీలంగా లేని రాజకీయ పార్టీల పార్టీ పరంగా సంక్రమించే ప్రయొజనాలపై నిషేధం విధించింది.
ఈ రెండు జాబితాలలో  6 పార్టీలు ఆంధ్ర ప్రదేశ్ నుండి  , 16 పార్టీలు తెలంగాణ నుండి ఉన్నాయి.
ఎన్నికల చిహ్నల ఉత్తర్వు - 1968 కింద ఈ చర్యలు తీసుకుంది.

హర్యానాలోని రాకి ఘర్  లో  హరప్పా-సంస్కతి  మ్యూజియం 
హరప్పా సంస్కృతి తెలియజేసే ప్రపంచంలోనే ఆతి  పెద్ద సంస్కతి  మ్యూజియంహర్యానాలోని రాకి ఘర్  లో    “హరప్పా-సంస్కతి  మ్యూజియం” మ్యూజియం లో 5,000 ఏళ్ళనాటి సింధు నాగరికతకి (ఇండస్ వ్యాలీ ) సంబంధించిన ఆనవాళ్ళను ప్రదర్శిస్తారు.
రాకి ఘర్ గ్రామం  2600 - 1900 BC కాలంనాటి ఇండస్ వ్యాలీ సంస్కృతిలో భాగమే .

రజనీస్  మంత్రాస్ పుస్తకం P.C బాలసుబ్రమణ్యన్  
P.C బాలసుబ్రమణ్యన్  గారు రచించిన పుస్తకం  రజనీస్  మంత్రాస్ పుస్తకం LIFE LESSONS FROM ONE OF INDIA’S SUPERSTARS  ,    P.C బాలసుబ్రమణ్యన్  గారు జాతీయ  ఉత్తమ రచయిత

ట్విటర్ లో కోహ్లీకి  50  మిలియన్ అనుచరులు

ట్విటర్ లో 50  మిలియన్ అనుచరులు గల క్రికెటర్ విరాట్ కోహ్లీ నిలిచారు.

IBM క్యాంటమ్ నెట్వర్కింగ్  నెట్వర్క్ లో IIT మద్రాస్ 
IBM క్యాంటమ్ నెట్వర్కింగ్ 180 సంస్థలో నెట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నారు IIT మద్రాస్ క్యాంటమ్ నెట్వర్క్ లో చేరిన దేశ మొట్టమొదటి సంస్థ, క్యాంటమ్ నెట్వర్కింగ్ న్యూయార్క్ IBM ప్రారంభించిన నెట్వర్క్  

G-20 కూటమికి భారత్ కు అధ్యక్ష హోదా 
డిసెంబర్ -1-2022 నుండి 30 నవంబర్ 2023 వరకు భారత్,G.20 దేశాలకు అధ్యక్షత దేశం గా ఉంటుంది.
G.20 దేశాలు
భారత్, రష్మా , అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్,U.K, కెనడా, ఇటలి, తుర్కీ (టర్కీ), యూరపియన్ యూనియన్  గ్రూప్, అర్జెంటీనా, బ్రెజిల్,సౌత్ కొరియా, మెక్సికో,చైనా, ఇండోనేషియా, సౌది అరేబియా ఆస్ట్రేలియా,సౌత్ ఆఫ్రికా 
ప్రపంచ G.D.P లో  85% GDP G-20 దేశాల వాట  ఉంటుంది 
అంతర్జాతీయ వాణిజ్యంలో 75%  G-20 దేశాల నుంచి జరుగుతుంది
ప్రపంచ జనాభా లో  ⅔ భాగం జనాభా G-20 దేశాలు కలిగి వున్నాయి.
 2023 సంవత్సరం G-20 సదస్సు కు భారత్ ఆతిధ్యం ఇస్తుంది.

దేశంలోనే మొట్ట మొదటి చిప్ తయారీ సంస్థ.
గుజరాత్ ఆహమ్మదాబాద్ కు చెందిన వేదాంత - ఫాక్స్ కాన్ భాగస్వామ్యం లో దేశంలోనే మొట్ట మొదటి చిప్ తయారీ సంస్థ ప్రారంభమైంది.
1.54 లక్షల కోట్ల పెట్టుబడుల ఈ సంస్థ ప్రారంభమైంది.   పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్ కు చెందిన వేదాంత గ్రూప్ , తైవాన్ కు చెందిన ఫాక్స్ కాన్ సంస్థలు కలిసి ఈ సంస్థను ఎర్పాటు చేస్తుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద  కార్బన  ఫైబర్ సంస్థను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్

గుజరాత్ లోని హజీరలో ప్రపంచం లోనే అతిపెద్ద  కార్బన ఫైబర్ సంస్థను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రారంభిస్తుంది.
- 2025 కి  ఈ సంస్థ నిర్మాణం పూర్తవుతుంది .
 
రాజస్థాన్ వేదికగా నేషనల్ డిఫెన్స్ మైక్రో  స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజర్స్ సరస్సు 
 నేషనల్ డిఫెన్స్ మైక్రో  స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజర్స్ సరస్సు మరియు ప్రదర్శన రాజస్థాన్ లోని కోతా లో  జరిగింది.  
మిషన్ అమృత్  సరోవర్  లో ప్రథమ స్థానం లో : ఉత్తర ప్రదేశ్ 
ఉత్తర ప్రదేశ లో 8462 సరస్సులను పునర్బివనంలోకి తెచ్చారు.
పార్లమెంటుకు అంబెత్కర్ పేరు పెట్టని : తెలంగాణ తీర్మానం 
దేశ పార్లమెంటుకు (చట్ట సభ ) అంబెత్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీ లో తీర్మారం చేసింది.

అంతర్జాతీయ  క్రికెట్ కు రాబిన్ ఊతప్ప వీడ్కోలు,
కర్ణాటకకు చెందిన రాబిన్ ఊతప్ప అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించారు.
రాబిన్ ఊతప్ప  43 అంతర్జాతీయ  వన్డేలలో 934 పరుగు లు  చేశారు.

విల్ పవర్ పుస్తకం సోజార్ట్  మారిజ్నే ( SJOGRDHARAME) 
భారత మహిళల జట్టుకు సంబంధిచిన అంశాలను ఇతివృత్తంగా తీసుకుని రాసిన పుస్తకం.

PM SHRI  పధకం:
సెప్టెంబర్-5-2022న ప్రధాని  మోడీ గారు PM SHRI  పధకాన్ని ప్రకటించారు.
ఇందులో 14500 పాఠశాలలను ఆధునీకరించాలి.
PM SRI ?
Prime Minister Schools for Rising India
5 సంవత్సరాలలో (2022-2027) 27 వేల కోట్ల రూపాయల వనరులు కేటాయించారు 
నేషనల్ ఎడుకేషన్ పాలసీ. 2020లో భాగంగా ఈ పథకం ప్రవేశ పెట్టారు .
జాతీయ విద్యా విధానం ప్రకారం GDP లో 6% విద్యా వ్యవస్థ కోసం ఖర్చు పెట్టాలి.
ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం  60% నిధులు , రాష్ట్ర ప్రభుత్వం  40%  నిధుల తో పాఠశాలల ఆధునీకరణ , అభివృద్ధి చేపట్టాలి. 
ప్రత్యేక హోదా రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం  90% నిధులు  కేటాయిస్తుంది. 
విద్యార్థులను 21 శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా తయారుచేయడం ఈ పథకం యొక్క ఉద్దేశం. 

రవాణాశాఖ లో ఆన్‌లైన్ ద్వారా  పౌర సేవలు.
58 పౌర సేవలను పూర్తిగా అలైన్‌లో అందుబాటు లోకి కేంద్ర రవాణాశాఖ తీసుకు వచ్చింది.
ఈ పనులను ఆధార్ ప్రామాణికం గా ఇంటి నుండి పూర్తి చేసుకోవచ్చు.
ఈ సేవలలో లెర్నర్ లైసెన్సు దరఖాస్తు, ఎల్ ఎల్ ఆర్ లో మార్పులు ,డ్రైవింగ్ లైసెన్సు రెన్యువల్, డ్రైవింగ్ లైసెను మార్పులు కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
 వాహన రిజిస్ట్రేషన్, యాజమాన్య బదిలీ వంటి సేవలను ఇందులో చేర్చారు.
నవంబర్-1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.

రక్తదాన అమృత్ మనోత్సవం లో ప్రపంచ రికార్డు :
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మ దినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17న ప్రారంభించినరక్తదాన  అమృత్ మనోత్సవం లో తొలిరోజే 1,00,506 మంది పాల్గొని  ప్రపంచ రికార్డు సృష్టించారని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీర ప్రకటించారు. 
ఈ కార్యక్రమం లో భాగంగా ఢిల్లీ లోని "సఫ్దర్ జంగ్ " ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన రక్త దానం శిభిరంలో కేంద్ర ఆరోగ్య మంత్రి కూడా రక్త దానం చేశారు. 

పర్యాటక రంగ అభివృద్ధి కోసం వికాస్ భీ. విరాసత్ భీ  నినాదం
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించెందుకు " వికాస్ భీ విరాసత్  భీ " [ఒక వైపు అభివృద్ధి మరొక వైపు వారసత్వ వైభవం ], నినాదంతో ముందుకు వెళ్లాలని టూరిజం మంత్రుల సదస్సులో కేంద్ర పర్యాటక శాఖ మండి జి. కిషన్ రెడ్డి చెప్పారు.
18 - సెప్టెంబర్ న జరిగిన పర్యాటక మంత్రుల సదస్సులో ఆయన ప్రసంగిచారు.
హిమమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో పర్యాటక మంత్రుల సదస్సు సెప్టెంబర్ 1న ప్రారంభమై మూడు రోజుల పాటు జరుగుతుంది.
రామాయణ, బుద్ధ, హిమాలయన్‌ సర్కుట్ ద్వారా ప్రత్యేక రైళ్ళను నడుపుతూ పర్యాటక రంగ అభివృద్ధికి రైల్వే శాఖ కృషి చేస్తుంది

పర్యాటక రంగ అభివృద్ధికి దేకో భారత్
దేకో భారత్ పేరుతో భారతీయ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయుటకు భారత దౌత్య కార్యాలయాల్లో ప్రత్యేక అధికారిని నియమించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్‌రెడ్డి
తెలిపారు.
ప్రవాస భారతీయులు కూడా మన దేశాన్ని సందర్శిస్తు, ఒక్కొక్కరు 5 గురు విధేశీయులను మన దేశాన్ని సందర్శించేలా  పాటుపడాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు
మూడు దశాబ్దాల తర్వాత కాశ్మీరులో సినిమహాళ్ల ప్రారంభం :
దాదాపుగా మూడు దశాబ్దాల తర్వాత కశ్మీరులో సినిమా హాళ్ళు ప్రారంభించిన లెఫ్టినెంట్  గవర్నర్ మనోజ్ సిన్హా  కశ్మీర్‌ లోని పుల్వమా, శోపియా లలో మల్టీపర్పస్ సినిమా హాళ్ళను జమ్ము -కశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్  మనోజ్ సిన్హా ప్రారంభించారు.
1990 లో పూర్తిగా సినిమా హాళ్ళను మూసివేశారు. 
1999 ఉగ్రవాద చర్యలో ప్రారంభించాలి అన్న ప్రయత్నాన్ని విరమించారు.
ఈ ఉగ్రవాద చర్యలో శ్రీనగర్‌లోని లాల్ చౌక్ లో గల రీగల్ సినిమా హాలు పైగ్రెనేడ్ దాడి చేశారు. 
.పుల్వమా, శోపియాల యువతకి అంకితం ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.చరిత్రాత్మక ఘటనగా ఆయన కొనియాడారు.

90వ ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ కి చిన్నంగా కోణార్క్ ఆలయ రథ చక్రం

భారత్ లో అక్టోబర్ లో జరిగే 20 వ ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీకి చిహ్నంగా కోణార్క్ ఆలయ రథచక్రాన్ని స్వీకరించారు.
చక్రానికి చుట్టూ భారత జాతీయ పతాకం లోని మూడు రంగులను వృత్తం లా ఏర్పాటుచేసి రూపొందించిన చిహ్నాన్ని జనరల్ అసెంబ్లీ నిర్వహిస్తున్న CBI ఇటివల వి ఆవిష్కరించింది. 
వారంలో 7 రోజులు 24 గంటలు ఇంటర్ పోల్  విధులకు చిహ్నంగాఈ లోగోను ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు.
ఒక్కో దేశం ఒక్కో సంవత్సరం అసెంబ్లీని నిర్వహిస్తుంది. 1997లో మనదేశంలో ఈ సమావేశం జరిగింది. స్వాతంత్యం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ సమావేశాలను అక్టోబర్ 18 నుండి మూడు రోజుల పాటు నిర్వహిస్తారు.
195 దేశాల అధికారులు ఈ సమావేశం లో పాల్గొంటారు.
కార్సినోజన్‌ను గుర్తించే ఆర్టిఫిషియల్ ఇంటలి జెన్స్
ఢిల్లీ లోని టిపుల్ ఐటి విద్యార్థులు కార్సినోజన్స్ ను గుర్తించే కృత్రిమ మేధా (ఎఐ) పరికరాన్ని కనుగొన్నారు. 
దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ కు మెటా బోకిల్లర్ అని పేరు పెట్టరు.
మెటాబోకిల్లర్ క్యాన్సర్ కారకాలను గుర్తించడమే కాకుండా అందుకు తగ్గ కారణాలను వివరిస్తుంది.కాన్సర్ వంశపారంపర్యంగా, 5 శాతం కార్సినోజన్ వల్ల  95 శాతం వస్తుంది.కాన్సర్ కు ముఖ్య కారణం జీవన శైలి, ఆహారపు అలవాట్లు ముఖ్య కారకాలు
కిసాన్ క్రెడిట్ కార్డు డిజిటల్ విధానంలో
“సంభవ్"లో భాగంగా కిసాన్ కెడిట్ కార్డులను పూర్తిగా డిజిటలీకరణ చేస్తున్నట్టు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
ఆర్ బి ఐ ఆధ్వర్యంలోని రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ సహకారం తో మహారాష్ట్రలోని హార్ధా జిల్లాలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు.
సంభవ్
బ్యాకింగ్ సేవల పూర్తిగా డిజిటలైజ్ లక్ష్యంతో మొదలు పెట్టిన కార్యక్రమం.
ఆస్కార్ బరిలో గుజరాత్ యొక్క ఛలోషో 
 గుజరాత్ యొక్క ఛల్లోషో  సినిమా 95 వ ఆస్కార్ పురష్కారాల కోసం భారత దేశం తరుపున ఎంపిక చేశారు
భారతదేశం తరుపున విదేశి చిత్ర విభాగంలో ఎంపిక చేశారు.
తొమ్మిదేళ్ళ వయసులో సినిమాతో ప్రేమలో పడిన పల్లెటూరి కుర్రాడికథ.
అయోధ్యలో 251 మీటర్ల ఎత్తైన రాముడి విగ్రహం .
ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో 251  మీటర్ల ఎత్తిన శ్రీరాముని విగ్రహాన్ని రూపొందించనున్నారు.
దీని నిర్మాణం పూర్తయితే ఇప్పటి వరకు అతిపెద్ద విగ్రమం అయిన సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (182 మిటర్లు) కంటే ఎత్తైన విగ్రహం అవుతుంది.
ఈ విగ్రయాన్ని ప్రముఖ శిల్పి, పద్మ భూషణ్ అవార్డు గ్రహింత రామ్. వి .సులార్,ఆధ్వర్యంలోరూపొందిస్తారు.
చైనా సృష్టించిన ప్రపంచ మొదటి  క్లోనింగ్  తోడేలు మాయ
ప్రపంచంలో తొలిసారిగా క్లోనింగ్ ద్వారా సృష్టించబడ్డ ఆర్కిటిక్ తోడేలు మాయ ను బీజింగ్ కు చెందిన సినోజిన్ బయోటెక్నాలజీ సంస్థ మార్చిన్ పోలార్ లాండ్ సంస్థ తో కలిసి  సృష్టించింది.
అంతరించి పోతున్న ఈ అరుదైన జాతిని రక్షించేందుకు  2020 నుంచి కృషి చేస్తున్నాయి.
ఈ క్లోనింగ్ కణంను ఓ ఆర్కిటిక్ తోడలు చర్మం నుంచి సేకరించారని సినోజిన్ బయోటెక్నాలజీ సంస్థ జిఎం. మిజిడాంగ్ తెలియజేశారు.
30-కే.ఎన్ హైబ్రిడ్ మోటార్ పరీక్ష విజయవంతం: ఇస్రో
ఇస్రో ఉపగ్రహ వాహక నౌకల్లోని ప్రొపలన్ వ్యవస్థకు ఉపకరించే హెచ్  టి పి బి ( హైబ్రిడ్ టెర్మినేటెడ్ పాలిబుటాడైన్) హైబ్రిడ్ మోటార్ ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది.
తమిళనాడు మహేంద్రగిరిలోని ఇసో ప్రొవల్పచ్ కాంప్లెక్స్ లో వీఎస్ ఎస్ సీ, ఇస్రో లు కలిసి ఈ పరీక్షను సమీక్షించాయి.
15 సెకన్ల పాటు మోటరు యొక్క ఇందనం, ద్రవ ఆక్సిజన్ (LOK) ఆక్సిడైజర్ ల దహన శక్తి ని పరీక్షించారు.
ఈ మోటార్ వాహక నౌక నియంత్రన, పున: ప్రారంభాన్ని సులభంగా ప్రారంభిస్తాయి.
ఇక మీదట ఇంధన, ద్రవ ఆక్సిజన్‌ను ఈ పరీక్ష విజయ వంతంగా  ఉపయోగించవచ్చు.
పుస్తక ఆవిష్కరణ లో శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం!
చదవడం - వ్రాయడం ,పెద్ద జమాలప్ప జీవిత సంగ్రహం అనే పుస్తకాలను శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఆవిష్కరించారు
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఓఎస్టీ ఎం.ప్రభాకరన్ రచించిన "పెద్ద జమాలప్ప జీవిత సంగ్రహం”,  పెద్ద జమాలప్ప వయోలిన్ విద్వాంసుడు  వీ ఆర్ రెడ్డి చదవడం - రాయడం పుస్తకాన్ని రచించాడు.
జాతీయ పర్యావరణ మంత్రుల సదస్సు
జాతీయ పర్యావరణ మంత్రుల సదస్సు గుజరాత్ లోని ఏక్తానగర్ లో సెప్టెంబర్ 23,24 రెండు రోజుల పాటు జాతీయ పర్యావరణ మంత్రుల సదస్సు జరిగింది. దీన్ని భారత ప్రధాని మోడి గారు వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
ఈ సదస్సు కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి  భూపెంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగింది.
తెలంగాణ పర్యావరణ మంత్రి  ఇంద్రకరణ్,ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మంత్రి - పెద్దిరెడ్డి గారు పాల్గొన్నారు
ఈ సదస్సులో భాగంగా స్వచ్చ వాయు సర్వేక్షన్ ను ఈ సదస్సులో ప్రకటించారు.ఇందులో భాగంగా భారతీయ నగరాలలో వాయు కాలుష్యం తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ కి మార్గదర్శకాలను విడుదల చేసింది.
వాయు కాలుష్యం న్ని  40 % శాతానికి తగ్గించాలి.
మేక్ ఇన్ ఇండియా
 మేక్ ఇన్ ఇండియా సెప్టెంబర్  25 నాటికి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 
సెప్టెంబర్ 25 2014 వ సంవత్సరంలో మేక్ ఇన్ ఇండియా ప్రారంభమయ్యింది
 మేక్ఇన్ ఇండియా కారణంగా 8 సంవస్సరాలలో 80 బిలియన్ డాలర్ల విదేశి ప్రత్యక్ష పెట్టుబడులు చేకూరాయి తయారీ సేవ రంగాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.
అవలాచే రాడర్: సిక్కింలో
భారత దేశంలో మొట్ట మొదటి సారిగా అవలాంచె మానిటరింగ్ రాడర్ ను నార్త్. సిక్కిం లో ఏర్పాటు చేశారు.
దీనిని భారత ఆర్మీ మరియు డి..ఆర్.డి.ఓ యొక్క డిఫెన్స్ జియో ఇన్ఫర్ మేటిక్స్ అండ్ రీసర్చ్ ఎస్టాబ్లిస్మెంట్ (DGRE)  సంయుక్తంగా ఏర్పాటు చేశారు.
హిమాలయాలలో ఏర్పడే హిమపాతం ను గుర్తించడానికి ఈ రాడర్ ను ఏర్పాటు చేశారు. DGRE దీనిని పర్యవేక్షిస్తుంది.
పియం కేర్ ఫండ్ ట్రస్టీగా - రతన్ టాటా - కేటి థామస్, కరియా ముండా
పియం కేర్ ఫండ్ ట్రస్టీగా - రతన్ టాటా - కేటి థామస్, కరియా ముండా కరియా. ముండా - మాజీ డిప్యుటి స్పీకర్ , కేటి థామస్ - సుప్రీంకోర్టు మాజీ జడ్జి
హైదరాబాద్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియ ఎథికల్ హ్యకింగ్ ల్యాబ్ ను ఏర్పాటు
హైదరాబాద్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియ ఎథికల్ హ్యకింగ్ ల్యాబ్ ను హైదరాబాద్ సైబర్ సెక్యురిటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సిసీఓఈ) లో ఏర్పాటు చేసింది. యూబీఐ ఎండి - సీఈఓ ఎ. మణిమేఖలై ఈ ల్యాబ్ ను ప్రారంభించారు.
పటిష్ట సైబర్ రక్షణ వ్యవస్థను నిర్మించి బ్యాంక్ లో సమాచారం, డిజిటల్ ఆస్తులను కాపాడే ఉద్దేశంతో దానిని ఏర్పాటు చేశారు.
భారత మహిళల ఫాస్ట్ బౌలర్ : జులన్ గోస్వామి  ఆటకు వీడ్కోలు
భారత మహిళల ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి 24/ సెప్టెంబర్/ 2022 ఇంగ్లాండు ఆటతో వీడ్కోలు పలికింది.
కీమే తెరపీ సైడ్ ఎఫెక్ట్ ను తగ్గించే విధానాన్ని అభివృద్ధి చేసిన ఐఐటి గుహవాటి పరిశోధకులు
కాన్సర్ కీమోతేరపీ లో కాన్సర్ కణాలతో పాటు సాధారణ ఆరోగ్య  కణాలను కూడా చంపె సైడ్ ఎఫెక్టును నిరోదించడానికి ఐఐటి గువాటి శాస్త్రవేత్తలు.
కీమోతెరపీ మందులను నేరుగా కాన్సర్ కణాలకు అందించే ప్రత్యేక మాలిక్యుల్స్ ను తయారు చేశారు.
ఇవి శరీరంలో గల క్యాన్సర్ కణాలకు నేరుగా మందుని చేరవేసి కీమోతెరపి సమయంలో పరారుణ కాంతి ప్రసరించినప్పుడు అవి విచ్చిన్నమై  వాటిలోని ఔషదం క్యాన్సర్ కణాలకు మాత్రమే చేరవేస్తాయి. ఈవిధంగా ఔషదం క్యాన్సర్ కణాలని మాత్రమే నాశనం చేస్తుంది
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్లు చేసింది. 
కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం
దేశం లో తొలి సారి మూడు రాజ్యాంగ ధర్మాసనాల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ ప్రసారం యూట్యూబ్ ద్వారా నిర్వహిచారు.
విచారణ ప్రక్రియను తొలిరోజే 7.74 లక్షల మంది విచారన ప్రక్రియను వీక్షించారు.
ఆగస్టు 26 న అప్పటి సీజేఐ జస్టిస్ ఎస్.వి.రమణ విరమణ కార్యక్రమాలను తొలిసారి ప్రత్యక్ష ప్రసారం చేశారు
సుప్రీంకోర్టు పూర్తిస్థాయి విచారణ ప్రసారాన్ని 27/9/2022 నుంచి ప్రారంభించింది..
భారత త్రిదళాధిపతిగా అనిల్ చౌహాన్
విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ భారత త్రిదళాధిపతి గా నియమించబడ్డారు. భారత తొలి సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ స్థానంలో అనిల్ చౌహాన్ విధులు నిర్వహిస్తారు .
సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించారు.
చౌహన్ గారు ప్రస్తుతం జాతీయ భద్రత మండలి సచివాలయంలో (NSCS) లో సైనిక సలహాదారుగా ఉన్నారు.
అనిల్ చౌహన్ గారు 2010లో  “ఆఫ్టర్ మాథ్ ఆఫ్ ఎ న్యూక్లియర్ అటాక్” పుస్తకం గోర్టా రైఫిల్స్ రెడీమేడవుల్ సెంటర్ చరిత్ర పుస్తకాలు ఆయన రచించారు.
అటార్నీటి జనరల్ గా సినియర్ న్యాయవాది ఆర్.వెంకట రమణి.
కేంద్ర ప్రభుత్య  సీనియర్ న్యాయవాది ఆర్.వెంకట రమణి కేంద్ర ప్రభుత్వం నియమించింది.
ప్రస్తుతం అటార్నీ జనరల్ కే.కే వేణు గోపాల్ పదవీకాలం సెప్టెంబర్ 30న ముగుస్తుంది.
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన డిసెంబర్ వరకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పేదలకు ఉచితంగా బియ్య౦ ఆహార ధాన్యాలు అందించే పధకం గడువును డిసెంబర్ వరకు పెంచారు.
కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. 
 
న్యూఢిల్లీ, అహమ్మదాబాద్, ముంబయి రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఆమోదం
న్యూఢిల్లీ, అహమ్మదాబాద్, ముంబయి రైల్వే స్టేషన్లను 60 వేల కోట్లతో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.తెలియజేశారు.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియ[ PFI ] పై 5 సంవత్సరాల నిషేధం 
కేంద్ర హోంశాఖ - ఇస్లామిక్ సంస్థ అయిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై ఐదు సంవత్సరాలు నిషేధం విధించింది.
కేంద్రం పిఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలను చట్టవిరుద్ధ సంస్థలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
రిహబ్ ఇండియా ఫౌండేషన్, కాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, అల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ ఉమన్స్ ఫ్రంట్,జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రిపాద ఫౌండేషన్ లు పి.ఎఫ్.ఎ .ఐ కి అనుబంధ సంస్థలు గా ఉన్నాయి.
ఈ సంస్థల అన్నింటికి చట్ట వ్యతిరేక కర్య కలాపాల నిరోధక చట్టం 1967 సెక్షన్ 3(1) ఆధారంగా కేంద్ర హోంశాఖ వీటి ఫై 5 సంవత్సరాల నిషేధం విధించింది .
జాతీయ దర్యాప్తు సంస్థ దీనికి సంబంధించిన దర్యాప్తును నిర్వహిస్తుంది.

డాటా సేక్వురిటి కాన్సిల్ ఆఫ్ ఇండియా CEO గా - వినాయక్ గాడ్సే

దిలీప్ ట్రోఫీ 2022 విజేత వెస్ట్ జోన్
దేశ వాలీ టోర్ని అయిన దిలీప్ ట్రోఫీ 2022 - వెస్ట్ జోన్ గెలిచింది. సౌత్ జోన్ పై వెస్ట్ జోన్
అవాంచిత గర్భవిచ్చిత్తి మహిళల హక్కు సుప్రీంకోర్టు
దేశంలో మహిళల అందరికి గర్బవిచ్చితి హక్కు గా కలదు అని అందులో వివాహిత, అవివాహిత అనే వివక్ష రాజ్యాంగంలోని అధికరణం 14 కు విరుద్దం, 20-24 వారాలలోపు గర్ప విచ్ఛిత్తి చేసుకొనే అధికారం  అందరి  మహిళలకు సమానంగా ఉందని జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జె.బి పార్సీవాలా,జస్టిస్ ఎ .ఎస్ బోపన్నాల ధర్మాసనం తెలిపింది.
ఎంటిపి చట్టంలోని సెక్షన్ 3(బి) పరిధిలోకి  భార్యకు ఇష్టం లేకుండా బలంవంతంగా భర్త చేసే సంభోగం కూడా అత్యాచారం కిందకు వస్తుందని తొలిసారిగా MTP చట్ట౦సెక్షన్ 3(బి) పరిధిలోకి వైవాహిక ఆత్యా చార చట్టాన్ని తీసుకువచ్చింది, ఇటువంటి సంభోగం వల్ల కలిగే గర్భాన్ని తొలగించుకునే హక్కు పూర్తిగా భార్యకు ఉంటుందని  సర్వోన్నత ధర్మాసనం వివరించింది
వివాహితలు, వితంతువులు, అత్యాచార బాధితులు, దివ్యాంగులు, మైనర్లు ఇలా ఏడు వర్గాల మహిళలు 24 వారాల్లో గర్భ విచ్చిత్తి చేసుకోవచ్చు.
ధర్మాసనం గర్బవిచ్చిత్తి  సమయం 20 వారాలనుండి 24 వారాలకు పెంచింది.
జాతీయ మహిళా కమీషన్ తొలి అధ్యక్షురాలు జయంతి పట్నాయక్ కన్నుమూత
ఒడిశాకాంగ్రెస్ నాయకురాలు జాతీయ మహిళా కమీషన్ తొలి అధ్యక్షురాలు జయంతి పట్నాయక్ మరణించారు
మూర్చ రకాలను గుర్తించే అల్గారిథమ్ ను సృష్టించిన ఐఏఎస్ సీ, ఎయిమ్స్
మూర్చ రకాలను గుర్తించే అల్లారిథమ్ ను భారతీయ విజ్ఞాన సంస్థ (ఐ.ఎ.ఎస్.నీ), ఎయిమ్స్ (రుషికేష్) సంయక్తంగా రూపొందించాయి.
ఈ ఈజీ (ఎలక్ట్రో ఎన్సిపాలో గ్రామ్స్ )ను ఈ సాఫ్ట్వే ర్ వర్గీకరించి మూర్చరకాలు ఫోకల్, జనరల్ ఎపిలెప్సీ గుర్తిస్తుంది.
సంకేతాలుక్యుములేటివ్ స్సైక్ వేవ్ కౌంట్ ద్వారా సాధారణ, ఫోకల్,జనరలైజ్ద్ అబ్‌సెన్స్ వంటి నాలుగు రకాల సంకేతాల ద్వారా మూర్చవ్యాధి రకాలను గుర్తించవచ్చు

నబీ అజాద్ కొత్త పార్టీ :  డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ  
జమ్మూ - కాశ్మీర్ లో సీనియర్ నేత గులాం నబి ఆజాద్ కొత్త రాజకీయ పార్టీ  డెమోక్రటిక్  ఆజాద్ పార్టీ   గా నామకరణం చేశారు. నబీ అజాద్ కాంగ్రెస్ మాజీ నేత.
ఒడిషా కోర్టుల్లో కాగిత రహిత సేవలు ప్రారంభించిన జస్టిస్ యు.యు లలిత్..
కటక్ జ్యుడిషియల్ అకాడమీ ప్రాంగణంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్  యు.యు లలిత్ గారు ఒడిషాలోని 30 జిల్లాల్లో ఉన్న న్యాయస్థానాలలో కాగిత రహిత  ఈ ఫైలింగ్ వ్యవస్థను ప్రారంభించారు.
దీనివలన పిటిషనర్లు ఇంటర్ నెట్ ద్వారా వ్యాజ్యాలు దాఖలు చేయవచ్చు.
ఒడిషా కోర్టు తపాల కవరు ఆవిష్కరణ
ఒడిషా కోర్టు ఏర్పాటైన 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తపాలా  కవరును ఆవిష్కరించారు
ప్రముఖ తెలుగు చలన చిత్ర సినియర్నటుడు, కథానాయకుడు కృష్ణం రాజుగారు మరణించారు
ప్రముఖ తెలుగు చలన చిత్ర సినియర్నటుడు, కథానాయకుడు కృష్ణం రాజుగారు మరణించారు
కోవిడ్ అనంతర సమస్యలతో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు.
ఈయన తొలి నంది అవార్డు అందుకున్న  ఉత్తమ నటుడు,కేంద్ర సహాయ మంత్రిగా కూడా కొంత కాలం సేవలందించారు

ఈయన బాహుబలి కథానాయకుడిగా చేసిన ప్రభాస్ గారి పెద్దనాన్న

క్రీడారంగం :
అఖిల భారత ఫుట్ బాల్  సమాఖ్య (AIFF) అధ్యక్షుడిగా : కళ్యాణ్  చౌబె
అఖిల భారత ఫుట్ బాల్  సమాఖ్య (AIFF)అధ్యక్షుడిగా  కళ్యాణ్ చౌ బె ఎన్నికయ్యారు
కళ్యాణ్ చౌ బె ఈస్ట్ బెంగాల్ మాజీ గోల్ కీపర్ . అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి ఆటగాడిగా కళ్యాణ్  చౌబె రికార్డు  సృష్టించారు .
చౌబె కంటే ముందు రాజకీయ నాయకులైన  ప్రియారంజన్ దాస్ మున్షి ,ప్రఫుల్ పటేల్ అధ్యక్షులుగా వ్యవహరించారు .

నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా )ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ 
గా:జస్టిస్ డి .వై చంద్ర చూడ్
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా ) ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్  గా  సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి .వై చంద్ర చూడ్  నియమితులయ్యారు .

ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లోభారత్ కు కాంస్యం
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో బజరంగ్ పునియా కాంస్యం సాధించాడు.
సెబస్టియన్ రిమో [పోర్టోరికో] పై విజయం సాధించి బజరంగ్ ఈ ఘనత సాధించాడు.
ప్రపంచ చాంపియన్ షిప్స్ లో నాలుగు పతకాలు సాధించిన తొలి భారతీయుడు బజరంగ్.
ప్రపంచ పారాండ్ ప్రీ గోల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన జివాంజి దీప్తి
ప్రపంచ పారా గ్రాండ్ ప్రి గోల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో తెలుగు మహిళల టి 20 విభాగం లో 400 మీటర్ల పరుగులో తెలుగు అమ్మాయి  జివాంజి దీప్తి స్వర్ణం సాధించింది .
ఈ టోర్నిలో బంగారు పతకం  సాధించిన తొలి భారతీయ క్రీడాకారిని.
హాకిఇండియా అధ్యక్షుడిగా దిలీప్ టిర్కి
భారత హాకీ మాజీ కెప్టెన్ దిలిప్ టిర్కి హాకి ఇండియా అధ్యక్షుడి ఎన్నికయ్యారు.
హాకిఇండియా అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి ఆటగాడు దిలీప్ టిర్కి
యుఎస్ ఓపెన్ మహిళల విభాగంలో ఇ గా స్వైటెక్ టైటిల్ కైవసం
పోలాండ్ కి చెందిన ఇ గా స్వైటెక్  యుఎస్ ఓపెన్ మహిళల విభాగంలో 
టైటిల్ కైవసం చేసుకుంది . ఫైనల్ లో జాబెర్ పై గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది
ఈ టైటిల్ తో ఇగా స్వైటెక్ ఆమె ఒకే సంవత్సరం 7 టైటిళ్ళను కైవసం చేసుకుని రికార్టు సృష్టించింది..
ఆసియా కప్ శ్రీలంక కైవసం.
11 సెప్టెంబర్ న జరిగిన ఆసియకప్ ఫైనల్ లో శ్రీలంక పాకిస్థాన్ పై విజయం సాధించి కప్పును కైవసం చేసుకుంది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి