ఒక గడియారం ను 500రూపాయలకు అమ్మినప్పుడు వచ్చే లాభం దానిని 350 రూపాయలకు
అమ్మినప్పుడు వచ్చే నష్టంతో సమానం అయినప్పుడు ఆ వస్తువు ఖరీదు ఎంత?
లాభం = అమ్మిన వెల - కొన్నవెల
నష్టం = కొన్నవెల - అమ్మిన వెల
లాభం = 500 - కొన్నవెల
నష్టం = కొన్నవెల - 350
500 - కొన్నవెల = కొన్నవెల - 350
కొన్నవెల +కొన్నవెల = 500+350
2*కొన్నవెల =850
కొన్నవెల =850/2
కొన్నవెల =425
సతీష్ 3 రేడియోలలో రెండింటిని ఒక్కొక్కటి 475 చొప్పున అమ్మిన ఒక్కొక్క దాని పై 5% నష్టం వచ్చిన అయిన ఆ రేడియో అసలు ధర ఎంత వచ్చిన నష్టాన్ని భర్తీ చేయాలి అంటే మిగిలిన రేడియోని అతడు ఎంతకు అమ్మాలి?
రేడియో 5% నష్టానికి అమ్మిన ధర = 475
అసలు ధర = x
నష్టం = x - 475
నష్ట శాతం= నష్టం/ కొన్నవెల*100
5% =( x - 475) / x*100
5X = ( x - 475) / *100
5X = (100 x) -( 475 *100)
95x = 47500
X = 47500 / 95
X = 500
అసలు ధర = x = 500
నష్టం = 500 - 475 = 25
2 రేడియోల పై నష్టం = 2*25 = 50
నష్టాన్ని భర్తీ చేయాలి అంటే మిగిలిన రేడియోని
అతడు అమ్మ వలసిన ఖరీదు = 500 + 50=550
Short cut
95% = 475
100% = ?
475*100) / 95 = 500
అసలు ధర = 500
నష్టం = 500 - 475 = 25
2 రేడియోల పై నష్టం = 2*25 = 50
నష్టాన్ని భర్తీ చేయాలి అంటే మిగిలిన రేడియోని
అతడు అమ్మ వలసిన ఖరీదు = 500 + 50=550
పవన్ జీతం16000 రూ మొదట పవన్ జీతాన్ని 20% పెంచి 20% తగ్గించినా ఈ మార్పు పవన్ కి లాభంమా, నష్టమా మార్పు శాతం ఎంత?
20% పెంచినప్పుడు జీతం= ?
20% = (x/16000)*100
x=(20*16000) / 100
X = 3200
20% పెంచినప్పుడు జీతం= 16000+3200 = 19200
80% = ( y / 19200) * 100
20% తగ్గించినప్పుడు జీతం = 15360
16000-15360 = 640
నష్ట శాతం= నష్టం/ కొన్నవెల*100
నష్ట శాతం = 640 / (16000 * 100)
నష్ట శాతం = 4 %
మార్పు శాతం = 4%
SHORT CUT
మార్పు శాతం =( 100 - నష్టం)*(100+లాభం) / 100
మార్పు శాతం =( 100 - 20)*(100+20) / 100
ప్రస్తుత శాలరీ = 96%
నష్ట శాతం = 100 - 96 = 4 %
ఒక దుకాణదారుడు 10 దానిమ్మలను 60 రూ ల కొని అందులో 5 దానిమ్మలను 40 రూపాయలకు మరొక 5 దానిమ్మలను 50 రూపాయలకు అమ్మిన లాభశాతం ఎంత ?
కొన్నవెల = 60 రూ
అమ్మిన వెల = 40 + 50 = 90
లాభం = అమ్మిన వెల - కొన్నవెల
లాభం = 90 - 60 = 30
లాభ శాతం= లాభం/ కొన్నవెల *100
లాభ శాతం= 30/ 60*100
లాభ శాతం= 50%
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి