- ఒక తరగతి లో 400 మంది విద్యార్థులు వున్నా అందులో బాలురు 250 అయిన ఆ తరగతి లో బాలికల శాతం ఎంత.?
మొత్తం విద్యార్థులు = 400
బాలురు =250
బాలికలు =400-250=150
బాలికలు =150
శాతం% =(ఇచ్చిన విలువ /మొత్తం విలువ ) ×100
కావున
శాతం = (ఇచ్చిన విలువ/ పూర్తి విలువ)*100
బాలికల శాతం%=(150 /400) × 100
బాలికల శాతం=37.5%
జవాబు =37.5%
ఒక వ్యకి తన వద్ద ఉన్న మొత్తం లో 90% ఖర్చు చేయగా చివరికి ఆ వ్యకి దగ్గర 200 మిగిలిన అయినా ఆ వ్యకి దగ్గర మొదట ఉన్న సొమ్ము ఎంత.?
శాతం = (ఇచ్చిన విలువ/ పూర్తి విలువ)*100
మొదట ఉన్న సొమ్ము ను x అనుకొనిన
10% = (200 / x ) × 100x
= 200*100/10x =
200*10x = 2000
జవాబు: 2000
ఒక కుటుంబం ఒక నెల మొత్తం20 కేజీల గోధుమలను వినియోగించకొనిన గోధుమల ధర 15%పెరిగిన న లో గతంలో గోధుమ కోసం చేసిన ఖర్చుతో ఎన్ని కేజీల గోధుమ లభించును ?
గతంలో ఖర్చు చేసినా విలువ=100 అనుకొని న
15% పెరగడం వల్ల20 కేజీల గోధుమల కు చేసే ఖర్చు115 అవుతుంది
గతంలో ఖర్చు చేసినా 100 కు ప్రస్తుతం లభించే గోధుమలు
=(100 /115)*20
=17.39కేజీలు
గతంలో ఖర్చు చేసినా రూపాయలకు ప్రస్తుతం లభించే గోధుమలు=17.39 కేజీలు
జవాబు =17.39కేజీలు
ఒక వృత్తాకారపు మైదానం వైశాల్యంలో 20 %కార్ల పార్కింగ్ కు, 40 శాతం భవన నిర్మాణానికి ఉపయోగించిన 500 చదరపు మీటర్లు మిగిలి ఉన్న ఆ వృత్తాకార మైదానం పూర్తి వైశాల్యం ఎంత
మిగిలిన విస్తీర్ణం(శాఖలలో)=40 %
40%=500 చదరపు మీటర్లు
శాతం = (ఇచ్చిన విలువ/ పూర్తి విలువ)*100
40%=(500/x)*100
x=(500/40)*100
x=500*100/40
x=1250
మైదానం మొత్తం వైశాల్యం=1250 చదరపు మీటర్లు
జవాబు =1250 చదరపు మీటర్లు
ఒక సంవత్సరంలో 73 రోజులు ఎంత శాతం?
ఒక సంవత్సరం మొత్తం365 రోజులు కలవు
365 రోజులలో 73 రోజుల శాతం
శాతం=73/ 365*100
శాతం=20%
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి