- ప్రవాహ వేగం 1 km /hr గల నదిలో ఒక పడవ ప్రవాహ వ్యతిరేక దిశ లో 4km దూరాన్ని చేరుటకు 1hr పట్టిన నిలకడ నీటిలో పడవ వేగం కనుగొనుము ?
ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం =దూరం /కాలం
=4/1=4 km /hr
ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం =4 km /hr
ప్రవాహ వేగం =1 km /hr
నిలకడ నీటిలో పడవ వేగం = ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం + ప్రవాహ వేగం
=4+1=5 km /hr
నిలకడ నీటిలో పడవ వేగం = 5 km /hr
జవాబు =5 km /hr
ఒకపడవ 20 km/hr ప్రవాహదిశలో ప్రయాణించిన ప్రవాహ వేగం 7 km/hr అయిన ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం ఎంత?
ప్రవాహదిశలో పడవ వేగం = 20 km/h
ప్రవాహ వ్యతిరేకదిశలో పడవ వేగం =ప్రవాహదిశలో పడవ వేగం - 2 * ప్రవాహ వేగం
ప్రవాహ వ్యతిరేకదిశలో పడవ వేగం = (20-7*2 ) = 20 - 14 = 6 km/hr
ప్రవాహ వ్యతిరేకదిశలో పడవ వేగం = 6 km / hr
ప్రవాహ వేగం 5 km/hr నిశ్చల నీటిలో పడవ వేగం 6 km/hr గల ఒక పడవ ప్రవాహ ఒక ఒడ్డున మొదలై తిరిగి అదేఒడ్డుకు చేరుటకు 2 గంటల సమయం పట్టినఒక ఒడ్డు నుండి మరొక ఒడ్డుకు గల దూరం ఎంత ?
ఒడ్డు నుండి మరొక ఒడ్డుకు గల దూరం = X అనుకొనుము
2X దూరం ప్రయాణించుటకు పట్టిన కాలం = 2 hrs
కాలం = దూరం / వేగం
x/ (6 - 5) + x / (6 + 5)
{ X+ ( X/11 )} = 2 hrs
12x = 2 * 11
X = (11 * 2) / 12
X = (11 * 2) / 12 = 6.833
X = 6.833
దూరం = X = 6.833 kms
దూరం = 6.833 kms