ఒక తరగతి లో 90 మార్కుల సరాసరి తో ముగ్గురు విద్యార్థులు కలరు ఆ గ్రూపులోకి కొత్తగా మరొక విద్యార్థి చేరగా వారి సగటు 92 కి పెరిగిన కొత్తగా చేరిన విద్యార్థి మార్కులు ఎన్ని?
విద్యార్ధి మార్కులు =[పెరిగిన సరాసరి విలువ × సమూహము లోని వ్యక్తుల సంఖ్య(అదనంగా చేరిన వ్యక్తి తో కలిపి)] + మొదటి సరాసరి
పెరిగిన సరాసరి విలువ = 92 - 90 = 2
సమూహము లోని వ్యక్తుల సంఖ్య(అదనంగా చేరిన వ్యక్తి తో కలిపి) = 4 మొదటి సరాసరి =90
కొత్త విద్యార్ధి మార్కులు =(2 × 4)+90=98 జవాబు=98
5 గురు విద్యార్థుల మార్కుల సరాసరి 90 అయినా అందులో రమేష్ మార్కులు మిగిలిన విద్యార్థుల మార్కుల మొత్తంలో 1/4 వంతు అయిన రమేష్ మార్కులు ఎన్ని?
5 గురు విద్యార్థుల మార్కుల సరాసరి = 90
రమేష్ మార్కులు = X
సరాసరి = రాశుల మొత్తం / రాశుల సంఖ్య
సరాసరి = మార్కుల మొత్తం / విద్యార్థుల సంఖ్య
మార్కుల మొత్తం = సరాసరి * విద్యార్థుల సంఖ్య
మార్కుల మొత్తం = 90 * 5 = 450
మిగిలిన విద్యార్థుల మార్కుల మొత్తం = 450 - X
1/4 వంతు అయిన రమేష్ మార్కులు = 450 - X * ¼
1/4 వంతు అయిన రమేష్ మార్కులు = X = 450 - X * ¼
X = 450 - X * ¼
4 X = 450 - X
5 X = 450
X = 450 / 5
X = 90
రమేష్ మార్కులు = X = 90
కిషోర్, అరవింద్, అర్జున్ సరాసరి బరువు 120 KG లు అయిన అందులో అరవింద్ బరువు 25 KG లు, అర్జున్ బరువు, అరవింద్ బరువు కంటే 8% ఎక్కువ అయిన కిషోర్ బరువు ఎంత ?
ముగ్గురి సరాసరి బరువు = 120 KG
అరవింద్ బరువు = 25 = 100%
అర్జున్ బరువు, = 8% అరవింద్ బరువు కంటే ఎక్కువ
అర్జున్ బరువు, = 100% + 8% = 108%
కిషోర్ బరువు = X = ?
100% = 25 KG
108% = ?
Cross multiplication
(25 * 108) / 100 = 27
అర్జున్ బరువు = 27
అరవింద్ బరువు + అర్జున్ బరువు = 27 + 25 =52
కిషోర్ బరువు = X = సరాసరి బరువు - (అరవింద్ బరువు + అర్జున్ బరువు)
X = 120 - 52 = 68 kg లు
కిషోర్ బరువు = 68 kg లు
20 వ్యక్తుల సరాసరి 200 మరియు 30 వ్యక్తుల సరాసరి 300 అయిన వారి మొత్తం సరాసరి ?
సరాసరి = రాశుల మొత్తం / రాశుల సంఖ్య
20 వ్యక్తుల మొత్తం = 20 * 200
30 వ్యక్తుల మొత్తం = 30 * 300
మొత్తం వ్యక్తులు = 20 + 30 = 50
మొత్తం సరాసరి = [ (20 * 200) + ( 30 * 300) ] / 50
= (4000+9000) / 50 = 13000 / 50
మొత్తం సరాసరి = 260
ఒక తరగతి గది లో 20 మంది విద్యార్థుల సరాసరి బరువు 55 kgలు ఆ గది నుండి 6 గురు విద్యార్థులు వెళ్ళిపోవడం వల్ల సరాసరి బరువు 52 కి తగ్గిన వెళ్ళిన వ్యక్తుల సరాసరి బరువు ఎంత?
20 మంది విద్యార్థుల సరాసరి బరువు = 55 kgలు
14 మంది విద్యార్థుల సరాసరి బరువు = 52 kgలు
=( 55 *20) - (52 * 14 ) = 372
వెళ్ళిన విద్యార్థుల బరువుల మొత్తం = 372
వెళ్ళిన 6 గురు విద్యార్థుల సరాసరి బరువు = 372 / 6 = 62
వెళ్ళిన 6 గురు విద్యార్థుల సరాసరి బరువు = 62
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి