ఒక క్లాస్ లో 20 మంది విద్యార్థుల సరాసరి మార్కులు 95 అయిన మొత్తం మార్కులు ఎన్ని?
విద్యార్థుల మొత్తం మార్కులు = 95 * 20 = 1900
విద్యార్థుల మొత్తం మార్కులు = 95 * 20 = 1900
ఒక క్లాసులో 40 విద్యార్థుల మార్కుల మెత్తం 3200 అయినా ఆ విద్యార్థుల మార్కుల సరాసరి ఎంత?
విద్యార్థుల మార్కుల మెత్తం = 3200
విద్యార్థుల సంఖ్య = 40
సరాసరి = రాసులమొత్తం / రాసుల సంఖ్య = 3200 / 40
విద్యార్థుల మార్కుల సరాసరి = 80
ఒక తరగతి గది లో 20 మంది విద్యార్థులు కలరు వారి గణితం పరిక్ష మార్కుల సరాసరి 75 , హిందీ మార్కుల సరాసరి 65 సోషల్ మార్కుల సరాసరి 95 అయిన 3 సబ్జెక్టుల సరాసరి ఎంత?
మూడు సబ్జెక్టుల సరాసరి మెత్తం = 75 +65 + 95 = 235
మూడు సబ్జెక్టుల సరాసరి = 235 / 3 = 78.33
మూడు సబ్జెక్టుల సరాసరి = 78.33
5 సంఖ్యల సరాసరి 70 అయిన కొత్తగా 80 ను చేర్చడం వల్ల మొత్తం సరాసరి ఎంత?
5 సంఖ్యల సరాసరి = 70
6 వ సంఖ్య = 80
5 సంఖ్యల మొత్తం = 70 * 5 =350
6 సంఖ్యల మొత్తం =350 + 80 = 430
సరాసరి = 430 / 6 = 71 .66
సరాసరి సమస్యల విషయంలో ప్రశ్నని జాగ్రత్తాగా అర్థం చేసుకొని చేయండి. ఏమాత్రం తేడా ఉన్నామార్కులు {జాజ్} నష్ట పోతారు.
రవి బరువు 50 kg లు, క్రిష్ణ బరువు 65 kg లు, కిరణ్ బరువు 60 kg లు అయిన వారి సరాసరి బరువు ఎంత?
బరువు ల మొత్తం = 50+65+60 = 175
వ్యక్తుల సంఖ్య = 3
సరాసరి = 175 / 3 = 58.33
ఒక తరగతి గది లో 20 మంది విద్యార్థుల సరాసరి బరువు 55 kgలు ఆ గది నుండి 6 గురు విద్యార్థులు వెళ్ళిపోవడం వల్ల సరాసరి బరువు 52 కి తగ్గిన వెళ్ళిన వ్యక్తుల సరాసరి బరువు ఎంత?
20 మంది విద్యార్థుల సరాసరి బరువు = 55 kgలు
14 మంది విద్యార్థుల సరాసరి బరువు = 52 kgలు
=( 55 *20) - (52 * 14 ) = 372
వెళ్ళిన విద్యార్థుల బరువుల మొత్తం = 372
వెళ్ళిన 6 గురు విద్యార్థుల సరాసరి బరువు = 372 / 6 = 62
వెళ్ళిన 6 గురు విద్యార్థుల సరాసరి బరువు = 62
30మంది వ్యక్తుల వయస్సుల సరాసరి 62 సంవత్సరాలుఅందుకు 4గురు వ్యక్తులను తీసివేయడం వల్ల వయస్సు సరాసరి 64 కి పెరిగిన 4 గురి వ్యక్తుల వయస్సుల సరాసరి ఎంత?
30 వ్యక్తుల వయస్సుల మొత్తం - 30 *62 = 1860
26 వ్యక్తులు, వయస్సుల మొత్తం = 26 * 64 = 1664
1860 - 1664 / 4 = 196/ 4 = 49 ,44 గురి వ్యక్తుల వయస్సుల సరాసరి = 49